DailyDose

ప్రశ్నాపత్రం లీకైన కేసులో ఐదుగురి అరెస్టు -TNI నేర వార్తలు

ప్రశ్నాపత్రం లీకైన కేసులో ఐదుగురి అరెస్టు -TNI నేర వార్తలు

*యూపీలో ప్రశ్నాపత్రం లీక్ అవ్వడంతో రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 12వ తరగతి పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ప్రశ్నాపత్రం లీకైన కేసులో పోలీసులు గురువారం ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు జర్నలిస్టులని, మరో ఇద్దరు లోకల్ స్క్రైబర్లని పోలీసులు తెలిపారు. మరికొంత మందిని అరెస్ట్ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గట్టి ఆదేశాలు ఇచ్చారు. నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

*పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం జగ్గిశెట్టి గూడెంలో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. నిద్రపోతున్న మేకల కాపరి పర్వతాలు (60)ను దారుణంగా చంపి అతడి తల నరికి పట్టుకుపోయారు. ప్రతి రోజు మాదిరిగా మేకలను కాపేందుకు వెళ్లి అక్కడే నిద్రిస్తున్న పర్వతాలను గుర్తు తెలియని వ్యక్తులు చంపారు.

*శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం ఉద‌యం క‌స్ట‌మ్స్ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. దుబాయ్ నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికుడి వ‌ద్ద 6 బంగారం బిస్కెట్ల‌ను అధికారులు గుర్తించి, సీజ్ చేశారు. దుబాయ్ ప్ర‌యాణికుడి నుంచి రూ. 37.30 ల‌క్ష‌ల విలువైన 699.5 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం అత‌న్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

*విజయనగరం: జిల్లాలోని గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామం దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ పై నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పాత శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన భోగి నారాయణ (67)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

*తిరుచ్చి నుంచి చెన్నైకు కారులో తరలిస్తున్న లెక్కలో లేని రూ.50 లక్షలను అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యహారంపై ఆదిద్రావిడ సంక్షేమ శాఖ సబ్‌ కలెక్టర్‌ను అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తిరుచ్చి జిల్లా ఆదిద్రావిడ సంక్షేమ శాఖ సబ్‌ కలెక్టర్‌గా శరవణకుమార్‌ పనిచేస్తున్నారు. ఆ శాఖలో డ్రైవర్‌, అసిస్టెంట్‌, వంట మనిషి తదితర పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. ఈ పోస్టుల కోసం పలువురి నుంచి తీసుకున్న నగదును తిరుచ్చి నుంచి చెన్నైకి తరలిస్తున్నట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో, ఆ విభాగం ఏడీఎస్పీ దేవనాధన్‌ నేతృత్వంలో బుధవారం ఉదయం పోలీసులు విల్లుపురం జిల్లా కళ్లకుర్చి సరిహద్దులో ఆ కారు అడ్డుకుని అందులో బ్యాగులను పరిశీలించగా రూ.500 నోట్ల కట్టలను గమనించి, కారులో ప్రయాణిస్తున్న సబ్‌ కలెక్టర్‌ శరవణకుమార్‌, డ్రైవర్‌ మణిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో రూ.40 లక్షలను తిరుచ్చి నుంచి చెన్నైకి తీసుకెళుతున్నట్లు తేలింది. ఈ డబ్బు ఎవరిది? ఎందుకు తరలిస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

*తిరుచ్చి నుంచి చెన్నైకు కారులో తరలిస్తున్న లెక్కలో లేని రూ.50 లక్షలను అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యహారంపై ఆదిద్రావిడ సంక్షేమ శాఖ సబ్‌ కలెక్టర్‌ను అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తిరుచ్చి జిల్లా ఆదిద్రావిడ సంక్షేమ శాఖ సబ్‌ కలెక్టర్‌గా శరవణకుమార్‌ పనిచేస్తున్నారు. ఆ శాఖలో డ్రైవర్‌, అసిస్టెంట్‌, వంట మనిషి తదితర పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. ఈ పోస్టుల కోసం పలువురి నుంచి తీసుకున్న నగదును తిరుచ్చి నుంచి చెన్నైకి తరలిస్తున్నట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో, ఆ విభాగం ఏడీఎస్పీ దేవనాధన్‌ నేతృత్వంలో బుధవారం ఉదయం పోలీసులు విల్లుపురం జిల్లా కళ్లకుర్చి సరిహద్దులో ఆ కారు అడ్డుకుని అందులో బ్యాగులను పరిశీలించగా రూ.500 నోట్ల కట్టలను గమనించి, కారులో ప్రయాణిస్తున్న సబ్‌ కలెక్టర్‌ శరవణకుమార్‌, డ్రైవర్‌ మణిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో రూ.40 లక్షలను తిరుచ్చి నుంచి చెన్నైకి తీసుకెళుతున్నట్లు తేలింది. ఈ డబ్బు ఎవరిది? ఎందుకు తరలిస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

*గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ అరెస్టు కైకలూరు సంత మార్కెట్ సమీపంలోని కిరాణా దుకాణంలో దుకాణదారుడు భార్య మెడలో గొలుసు తెంచుకొని పారిపోతుండగా వెంబడించి పట్టుకున్న స్థానికులు యువకుడి వద్ద 1,20,000 విలువైన గొలుసు, ద్విచక్రవాహనం, ఒక చాకు, పెప్పర్ స్ప్రే, స్వాధీనం పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా యువకుడు సింగిడి సత్యనారాయణ గా గుర్తింపు దొంగతనం లో అతనికి సహకరించిన బుద్ధాల సుభాష్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసిన కైకలూరు టౌన్ ఎస్సై షణ్ముఖ సాయి.

*జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండలం ఇరికిచేడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహానికి దుండగులు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనలో ఎస్‌ఐకి తీవ్రగాయాలయ్యాయి.

*మృతిచిత్తూరు జిల్లాలో ఏనుగు మంద బీభత్సం సృష్టించింది. జోగివారిపల్లె పొలాల్లో నిద్రిస్తున్న ఎల్లప్ప అనే రైతును ఏనుగుల గుంపు తొక్కి చంపాయి. ఏనుగుల గుంపు పంటపొలాలను ధ్వంసం చేస్తుండటంతో కాపలా కోసం వెళ్లిన రైతు … అక్కడే నిద్రిస్తుండగా గజరాజులు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఎల్లప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

*గంజాయి తోటలు ధ్వంసం చేసి, అరికట్టాలని అధికారులు చెబుతున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా విశాఖ జిల్లా మాడుగుల మండలం గరికబంధ చెక్ పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (S.E.B) నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికింది. ఆటోలో తరలిస్తున్న రూ.10 లక్షల విలువైన 197 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, అరెస్టు చేశారు. ఒక ఆటో, 4 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ సీఐ సింహాద్రి తెలిపారు.

*బిహార్ తూర్పు చంపారణ్ జిల్లాలో ఓ ఏనుగు పెను బీభత్సం సృష్టించింది. ఓ గ్రామంపై విరుచుకుపడి కనిపించిందల్లా ధ్వంసం చేసింది. పోలీసులు, స్థానికులు అనేక గంటలు కష్టపడి ఆ ఏనుగును తాళ్లతో బంధించారు.

*మోతుగూడెం పోలీస్‌ స్టేషన్‌ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలో 150 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎస్‌ఐ వాసంశెట్టి సత్తిబాబు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన యూసఫ్‌, తెలంగాణలోని జయరాబాద్‌ మల్చల్వ గ్రామానికి చెందిన మహమ్మద్‌ వసీం, బహీరాబాద్‌కు చెందిన జహర్‌బాలు సింధువాడ నుంచి కర్ణాటకు గంజాయిని కారులో తరలిస్తున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా వారు పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసి రంపచోడవరం కోర్టులో హాజరుపరుస్తామని ఎస్‌ఐ చెప్పారు. గంజాయి విలువ రూ.4.50 లక్షలు ఉంటుందన్నారు.

*పాలకొల్లు మండలం భగ్గేశ్వరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొబ్బరి పీచు కావడంతో మంటలు అదుపులోకి రావడానికి కష్టంగా ఉందని అధికారులు అంటున్నారు.

*రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రజ్యోతి సబ్‌ఎడిటర్‌ ఓ.మధుసూదన్‌ కుటుంబానికి ఈఎస్‌ఐసీ డిపెండెంట్‌ బెనిఫిట్‌ మంజూరైంది. ఈఎ్‌సఐసీ డీసీబీవో – సనత్‌నగర్‌ ద్వారా మధుసూదన్‌ సతీమణి యమునకు బ్రాంచి మేనేజర్‌ కె. సాయికుమార్‌ జీవితకాల పెన్షన్‌ మంజూరు పత్రాలను అందజేశారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ కె. సైదులు పెన్షన్‌ నియమ, నిబంధనలను మధుసూదన్‌ కుటుంబ సభ్యులకు వివరించారు. సాయికుమార్‌ మాట్లాడుతూ.. దుర్ఘటన జరిగిన వెంటనే తమ కార్యాలయం స్పందించి బాధిత కుటుంబానికి పరిహారం అందించేందుకు సత్వరమే చర్యలు ప్రారంభించిందని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌ 24న బేగంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధుసూదన్‌ ప్రాణాలు కోల్పోయారు.

*నల్గొండ: జిల్లాలోని దామరచర్లలో దారుణఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కరెంటు తీగ తగిలి చందు అనే రైతు మృతి చెందాడు. అడవి పందుల రక్షణ కోసం కరెంటు తీగలను రైతు ఏర్పాటు చేశాడు. అక్కడ స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తరలించారు. ఆయన మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*నల్గొండ జిల్లాలోని దామరచర్లలో దారుణఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కరెంటు తీగ తగిలి చందు అనే రైతు మృతి చెందాడు. అడవి పందుల రక్షణ కోసం కరెంటు తీగలను రైతు ఏర్పాటు చేశాడు. అక్కడ స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తరలించారు. ఆయన మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణం పోస్ట్ ఆఫీస్ వద్ద షేక్ మొయిన్(32)పై సాయబ్ అలీ(22) అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. షేక్ మోయిన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. నిందితుడు సాయబ్ అలీ సంగారెడ్డి జిల్లా జిన్నారం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గౌస్ కుమారుడుగా గుర్తించారు.

*గుంటూరు జిల్లాలోని తెనాలిలో దారుణం జరిగింది. బాలుడిపై పాస్టర్ లైంగిక దాడి చేశాడు. పాస్టర్ అహరోన్ ప్రకాశ్ తనపై లైంగిక దాడి చేసినట్లు బాలుడు తెలిపాడు. గత 10 నెలలుగా కల్వరీ ప్రార్థనా మందిరంలో ఆ బాలుడు ఉంటున్నాడు. బాలుడు అనారోగ్యంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో తనపై జరిగిన అమానుష సంఘటనను వివరించాడు. ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కేసును వాపస్ తీసుకోవాలని బాధితులతో క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మంతనాలు జరుపుతున్నాడు.