Movies

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు..

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు..

గ‌తేగాది చివ‌ర‌లో పెళ్లి పీట‌లెక్కిన సెల‌బ్రిటీ క‌పుల్స్ లో ఒక‌రు బాలీవుడ్యాక్టర్లు క‌త్రినాకైఫ్ విక్కీ కౌశ‌ల్ వెడ్డింగ్ త‌ర్వాత అంద‌రిలా ఎలాంటి హ‌నీమూన్ ప్లాన్ ఏమీ చేసుకోకుండా..ప్రొఫెష‌న‌ల్ క‌మిట్ మెంట్స్ పై ఫోక‌స్ పెట్టారు విక్కీ-క‌త్రినా. ఈ ఇద్ద‌రు న్యూ మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేసేందుకు కూడా టైం ఇవ్వ‌కుండా త‌మ త‌మ షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీ అయిపోయారు. ఈ ఇద్ద‌రు సెల‌బ్రిటీల‌కు ఇన్నాళ్ల‌కు టైం దొరికిన‌ట్టైంది. క‌త్రినా-విక్కీ కౌశ‌ల్ వెకేష‌న్ టూర్ ప్లాన్ చేసుకున్నారు.క‌త్రినాకైఫ్-విక్కీ అంద‌మైన రిసార్ట్స్ లొకేష‌న్ ను హ‌నీమూన్ ప్లాన్ వేసుకున్నారు. స‌ముద్ర తీరంలో ప‌డ‌వ‌పై విహ‌రిస్తూ..సాగ‌ర అందాల‌ను ఆస్వాదిస్తూ..న్యూ మ్యారేజ్ లైఫ్ లోని సంతోష‌క‌ర క్ష‌ణాల‌ను ఎంజాయ్ చేస్తున్నారు. క‌త్రినా హాట్‌,క‌ల‌ర్ ఫుల్ స్విమ్ షూట్‌లో ఉన్న స్టిల్‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..ప‌డ‌వ‌,స‌ముద్రం,ఐలాండ్‌, హ‌ర్ట్ ఎమోజీల‌ను క్యాప్ష‌న్ గా పెట్టింది. ఇంత‌కీ క‌త్రినా-విక్కీకౌశ‌ల్ బ్యూటీ ఫుల్ టూర్ ఫొటోలు షేర్ చేసినా..ఇంత‌కీ వాళ్లెక్క‌డికి వెళ్లార‌నేది మాత్రం స‌స్పెన్స్ గా పెట్టారు.