NRI-NRT

60ఏళ్లు దాటిన ప్రవాసుల సమస్యపై కువైత్ కీలక నిర్ణయం.

60ఏళ్లు దాటిన ప్రవాసుల సమస్యపై కువైత్ కీలక నిర్ణయం.

పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) డైరెక్టర్ జనరల్ వర్క్ పర్మిట్లను మంజూరు చేయడానికి నిబంధనలు, విధానాల జాబితాను జారీ చేయడానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ నం. 156/2022ను జారీ చేసింది. దీని ప్రకారం జాబితాలోని కంపెనీలలో 60ఏళ్లకు పైబడిన ప్రవాసులకు ఆరోగ్య బీమా జారీకి సంబంధించిన పరిమితిని రద్దు చేసింది. అందుకే ఇకపై కార్మికుడు తప్పనిసరిగా బీమా రెగ్యులేటరీ యూనిట్ నుండి బీమా పాలసీని కలిగి ఉండాల్సిందే. అలాగే 552/2018, 27/2021 నిబంధనలను కూడా రద్దు చేయడం జరిగింది. తాజా నిర్ణయం ఆధారంగా అధికారులు అవసరమైన సర్క్యూలర్‌ను జారీ చేయాలని ఈ సందర్భంగా పీఏఎం ఆదేశించింది.ఇక ఇటీవల గల్ఫ్ దేశం కువైత్ 60ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్ల రెన్యువల్‌ చేసుకోవడంతో పాటు ఆరోగ్య బీమాకు వీలు కల్పించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజును 250 కువైటీ దినార్లుగా(రూ.61వేలు) నిర్ణయించింది. అలాగే ఈ కేటగిరీ ప్రవాసుల బీమా రుసుమును ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ 500 కేడీలుగా(రూ.1.23లక్షలు), ఇతర చార్జీల రూపంలో మరో 3.5 కేడీలు(రూ.864) కలిపి మొత్తం 503.5 కువైటీ దినార్లుగా(రూ.1.24లక్షలు) నిర్ణయించింది. ఇలా వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజు, బీమా పాలసీ రుసుముతో కువైత్‌కు ఈ ఏడాది ఏకంగా 42.2 మిలియన్ కువైటీ దినార్ల(రూ.1,041కోట్లు) ఆదాయం సమకూరనుంది.