Health

మహా సమర్థ ఓషది శొంఠి.

మహా సమర్థ ఓషది శొంఠి.

సహజంగా ఈ ఔషధిని కఫం వచ్చినపుడు మాత్రమే టీలో కలిపి సేవిస్తారు. ఇతర సమయంలోనూ దీనిని తీసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయి. దీనిలో అమూల్యమైన ఔషధ గుణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అల్లం పై పొట్టుని తీసేసి సున్నపుతేటలో ముంచి ఎండబెడితే సొంఠిగా మారుతుంది. శొంఠిని సంస్కృతంలో మహా ఓషది, విశ్వభేషజాం అని కూడా అంటారు. ఈ భూమి మీద అతి విలువైన, అనేక రోగాలను ధ్వంసం చేయగల మహా మహా మూలికలలో ఈ శొంఠి అనేది ఒకటి. దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు దీని శక్తికి ఆశ్చర్యపోయి దీనికి మహా ఓషది అని అర్థం వచ్చేటట్లుగా విశ్వభేజనం అని నామకరణం చేశారు. ప్రతి గృహిణీ శొంఠి ప్రయోజనాలని తెలుసుకుని ఉంటే తన కుటుంబ సభ్యులకు వచ్చే అనేక చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు తానే పరిష్కరించగలుగుతుంది. దీనిని లోనికి వాడిన తర్వాత ఇది శరీరం అంతా వ్యాపించి ప్రతి అవయవాన్ని మృదువుగా, లోపరహితంగా చేయడానికి తోడ్పడుతుంది.మానవునిలో జీవనశక్తిని,వ్యాధినిరోధక శక్తినీ వృద్ధి చేస్తుంది.

కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ని తగ్గిస్తుంది. మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది.పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది. శ్వాశ రోగాలను, ఉదరశూలాలను, దగ్గులను, హృదయ రోగములను, బోదకాలను, వాత రోగములను తగ్గిస్తుంది.ఉదరములో గ్యాస్ ఎక్కువైనపుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య కోసం పావు చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తగ్గిపోయి గుండెనొప్పి కూడా తగ్గుతుంది.దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలతో కలిపి సేవిస్తే విష జ్వరాలు తగ్గిపోతాయి. ఒకవైపు తలనొప్పి వచ్చేవారు శొంఠిని నీటితో కలిపి మెత్తగా నూరి నుదుటిపైన పట్టు వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది. జాయింట్లలో వాపు (ఆమవాతము) వచ్చి విపరీతమైన నొప్పి తో బాధపడే వారు దోరగా వేయించిన శొంఠి పొడి అరచెంచా మోతాదు గా చెరకు రసంలో కలిపి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తొందరగా తగ్గుతుంది. అదేవిధంగా శొంఠి పొడిని తిప్పతీగ సమూల రసం పావుకప్పులో కలిపి సేవిస్తూ ఉంటే దీర్ఘకాలిక ఆమవాత సమస్య తగ్గిపోతుంది.కొంతమందికి పొట్ట మందగించి ఆకలి కాకుండా ఉంటుంది.

అలాంటి వారు దోరగా వేయించిన శొంఠి 50గ్రా, పాతబెల్లం 100గ్రా కలిపి మెత్తగా దంచి నిలువ ఉంచుకుని రోజూ రెండుపూటలా 5గ్రా మోతాడుతో సేవిస్తూ వస్తే మందాగ్ని హరించిపోయి మంచి ఆకలి పుడుతుంది.ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు పావుచెంచా శొంఠిపొడి, పావు చెంచా కరక్కాయ పొడి రెండింటిని కలిపి ఒక కప్పు వేడినీటిలో వేసి రెండుపూటలా సేవిస్తూ ఉంటే దగ్గు,దమ్ము, ఎక్కిళ్ళు అన్ని తగ్గిపోతాయి.రక్తక్షీణత వల్ల వచ్చే పాండు రోగాలకు శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధము 10గ్రా తీసుకుని దానిని 50గ్రా ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని కరగబెట్టి దించి ఆ నెయ్యిని రోజు ఆహారంలో వాడుతూ ఉంటే పాండురోగము తగ్గి రక్తము వృద్ధి చెందును.పక్షవాతం ఉన్నవారు దోరగా వేయించిన శొంఠిపొడి, సైన్ధవ లవణం పొడి రోజూ మూడుపూటలా గోరు వెచ్చని నీటిలో గాని, తేనెతో గానీ కలిపి ఆహారం తర్వాత తీసుకుంటూ ఉంటే క్రమంగా పక్షవాతం తగ్గుముఖం పడుతుంది.మూత్రం కష్టంగా వచ్చేవారికి శొంఠి పొడి, సైన్ధవ లవణం కలిపి తీసుకుని పల్లెరుకాయలతో కాచిన ఒక కప్పు కషాయంలో కలిపి రోజూ రెండుపూటలా సేవిస్తూ ఉంటే మూత్రం ధారాళంగా వస్తుంది.నడుం నొప్పి ఉన్నవాళ్లు రోజు రాత్రిపూట నిద్రపోయేముందు చిటికెడు శొంఠి ని ఒక చెంచా వంటాముదంతో కలిపి తాగుతూవుంటే నడుము నొప్పి, పక్కటెముకల నొప్పి, ఉదరశూల తగ్గిపోతాయి.ఇంకా ఎన్నో సమస్యలకు ఈ మహా ఓషది పనిచేస్తుంది..