NRI-NRT

రీ-ఎంట్రీ, ఎగ్జిట్ వీసాలపై SAUDI కీలక ప్రకటన

రీ-ఎంట్రీ, ఎగ్జిట్ వీసాలపై SAUDI కీలక ప్రకటన

రీ-ఎంట్రీ, ఎగ్జిట్ వీసాలపై సౌదీ అరేబియా తాజాగా కీలక ప్రకటన చేసింది. ఎవరైతే ఈ వీసాలను క్యాన్సిల్ చేసుకుంటారో వారికి వాటి తాలూకు ఫీజులను రిఫండ్ చేయడం జరగదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్(జవాజత్) వెల్లడించింది. అలాగే లబ్ధిదారుడు ఈ వీసాలను సవరించుకోవడానికి కూడా వీలు పడదని స్పష్టం చేసింది. కానీ, యజమాని అబ్షర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మాత్రమే రద్దు చేసుకునే అవకాశం ఉందని జవాజత్ పేర్కొంది. అయితే, ఎట్టిపరిస్థితుల్లో రీ-ఎంట్రీ, ఎగ్జిట్ వీసాల రుసుము మాత్రం రిఫండ్ చేయడం ఉండదని తేల్చి చెప్పింది. రీ-ఎంట్రీ, ఎగ్జిట్ వీసాలపై కీలక ప్రకటన.. ఆ ఫీజు వాపస్ చేయడం కుదరదంటూ.. ఇక ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న కార్మికుల ఫైనల్ ఎగ్జిట్ వీసాలు కూడా క్యాన్సిల్ చేయడం కూదరదని స్పష్టం చేసింది. అలాగే విజిట్ వీసాలను రెసిడెన్సీ పర్మిట్లుగా(ఇఖామా) మార్చడం సాధ్యపడదని తెలిపింది. నివాసుతులు ఎవరైతే కింగ్‌డమ్ నుంచి బయటి దేశాలకు వెళ్తారో వారు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే వీసాతో పాటు ప్రయాణ ధృవీకరణ పత్రాలను కలిగి ఉండడం తప్పనిసరి అని జవాజత్ వెల్లడించింది. సౌదీకి వచ్చే సందర్శకులు ఉమ్రా, టూరిజం కోసం విజిట్ వీసాతో సహా ఒక వ్యక్తి కరోనావైరస్ బారిన పడిన సందర్భంలో చికిత్స ఖర్చులను కవర్ చేయడానికి అన్ని రకాల విజిట్ వీసాలపై బీమా కలిగి ఉండాలి.