NRI-NRT

బహ్రెయిన్‌లో భారతీయుడికి అరుదైన గౌరవం

Auto Draft

బహ్రెయిన్‌లో భారతీయుడికి అరుదైన గౌరవం లభించింది. దీంతో అతడు సంతోషం వ్యక్తం చేశాడు. బహ్రెయిన్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశాడు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. లులు ఫైనాన్షియల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అదీబ్ అహ్మద్‌‌కు బహ్రెయిన్‌లో అరుదైన గౌరవం దక్కింది. గోల్డెన్ రెసిడెన్సీ వీసాతో బహ్రెయిన్ ప్రభుత్వం ఆయనను గౌరవించింది. బహ్రెయిన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగా గోల్డెన్ వీసాను అందుకున్న అదీబ్ అహ్మద్.. సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బహ్రెయిన్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్‌ను వ్యాపార కేంద్రంగా మార్చడానికి గోల్డెన్ వీసా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. కేరళలో జన్మించిన అదీబ్ అహ్మద్.. యూఏఈ వెళ్లి అక్కడ బిలియనీర్‌గా ఎదిగారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సౌత్ ఆసియా రిజినల్ స్ట్రాటజీ గ్రూప్ అడ్వైజరీ బోర్డు సభ్యులుగా ఉన్నారు.