NRI-NRT

తానాలో మరో రికార్డు. సీనియర్ల రాజీనామా.

Bandla Hanumaiah And Jampala Resigns From TANA BOD

తానాలో కలకలం రేగింది. తానా ట్రస్ట్ బోర్డు చైర్మెన్, మాజీ అధ్యక్షుడు డాక్టర్ బండ్ల హనుమయ్య, బోర్డు సభ్యుడు, మరో మాజీ అధ్యక్షుడు డాక్టర్ జంపాల చౌదరిలు తమ పదవులకు రాజీనామా చేశారు. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో బోర్డు సభ్యుడు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ పరుష పదజాలంతో దూషించటంతో వారిరువురు కలత చెంది రాజీనామా చేసినట్లు సమాచారం. మరొక మాజీ అధ్యక్షుడు కూడా ఈ సంఘటనకు నిరసనగా రాజీనామా చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.