NRI-NRT

కెనడా నుండి పెద్ద సంఖ్యలో భారతీయుల వలస.

కెనడా నుండి  పెద్ద సంఖ్యలో భారతీయుల వలస.

కెనడాలో విదేశీయులకు పెద్ద సంఖ్యలో శాశ్వత నివాసం కల్పించాలనుకుంటున్న అక్కడి ప్రభుత్వం..తన లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా లెక్కల ప్రకారం.. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఏకంగా లక్ష మంది విదేశీయులు కెనడాకు వలస వెళ్లారు. ఇందులో అధికశాతం భారతీయులే ఉన్నట్టు సమాచారం. ‘‘వివిధ దేశాల వారు మా దేశం స్థిరపడేందుకు నిర్ణయించుకోవడం మాకెంతో గర్వంగా ఉంది. మా దేశంలో కాలు పెట్టిన వారికి గొప్ప అనూభుతులు అందించేందుకు మేం నిరంతరం కృషి చేస్తాం’’ అని కెనడా ఇమిగ్రేషన్ శాఖ మంత్రి షాన్ ఫ్రేజర్ గురువారం పేర్కొన్నారు.

2021లో కెనడా ప్రభుత్వం దాదాపు లక్ష మంది భారతీయులకు ఆ దేశంలో శాశ్వత నివాసార్హత(పర్మెనెంట్ రెసిడెన్సీ) కల్పించింది. అంతేకాకుండా.. గతేడాది మొత్తం 4,05,000 మంది విదేశీయులను కెనడాలోకి ఆహ్వానించింది. ఇదే సమయంలో.. కెనడాలో శాశ్వత నివాసార్హత ఉన్న మరో 2,10,000 మంది కెనడా పౌరసత్వాన్ని కూడా పొందారు. దీనికి తోడు.. కెనడా ప్రభుత్వం 2021లో 4,50,000 స్టూడెంట్ వీసాలు జారీ చేసింది. తాజా లెక్కల ప్రకారం.. కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్య 6,22,000 లక్షలు కాగా.. వీరిలో దాదాపు 2,17,140 మంది భారతీయ విద్యార్థులే!