DailyDose

ఏపీ కేబినెట్ విస్తరణపై సజ్జల క్లారిటీ – TNI తాజా వార్తలు

ఏపీ కేబినెట్ విస్తరణపై సజ్జల క్లారిటీ – TNI తాజా వార్తలు

* ఏపీ కేబినెట్ విస్తరణపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా సీఎం జగన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా క్యాబినెట్‌లో మార్పులు ఉంటాయని వెల్లడించారు. మంత్రివర్గంలో ఎక్కువశాతం మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు. సామాజిక న్యాయానికి అనుగుణంగా సీఎం జగన్ కేబినెట్ ఏర్పాటు జరుగుతుందని తెలిపారు.

*ఆర్థిక సంవత్సరం తొలి రోజునే… పంచాయతీలకు జగన్‌ సర్కారు గట్టి ఝలక్‌ ఇచ్చింది. తన ఆర్థిక కష్టాల నుంచి కొంతైనా బయటపడేందుకు… పంచాయతీలు పన్నుల రూపంలో వసూలు చేసుకున్న మొత్తాలను కూడా ప్రభుత్వం తీసేసుకుంది. అయితే పంచాయతీల్లో నిధులు ప్రభుత్వం లాగేసుకోవడంపై పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అత్యవసర సమావేశమైంది. ఛాంబర్‌ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో హై లెవల్‌ కమిటీ వర్చువల్‌ సమావేశమైంది. ఏపీ ప్రభుత్వ చర్యను సమావేశం తీవ్రంగా ఖండించింది. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు వినతి పత్రాలు, భిక్షాటన, ధర్నాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే కోర్టును ఆశ్రయించాలని సమావేశంలో తీర్మానం చేశారు.

*నా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్నవారికి దీటైన సమాధానం : ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమి పక్షాల్లో అంతర్గత కలహాలు లేవని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శనివారం చెప్పారు. తన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నవారికి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దీటైన సమాధానం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కూటమిలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ ఉన్న సంగతి తెలిసిందే. సెంట్రల్ ముంబైలో జీఎస్‌టీ భవన్‌కు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన అనంతరం ఉద్ధవ్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్రదే పై చేయి అని, మహారాష్ట్రను అపఖ్యాతిపాలు చేస్తున్నవారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. జీఎస్‌టీ బిల్డింగ్ ప్రాజెక్టును వేగవంతం చేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కే దక్కుతుందన్నారు. ఈ ప్రాజెక్టు సకాలంలో ప్రారంభమయ్యేలా చేశారన్నారు. ఎంవీఏ ప్రభుత్వంలో అంతర్గత అశాంతి లేదన్నారు. తమ కూటమి కాళ్లు భూమిపై బలంగా ఉన్నాయన్నారు. తాము రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా ప్రగతి సాధించేందుకు పని చేస్తున్నట్లు తెలిపారు

*శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శనివారం రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టు శాలువాతో ముఖ్యమంత్రిని మంత్రి ఎర్రబెల్లి సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు అయు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, కేసిఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు ఈ ఉగాది మరిన్ని శుభాలు కలుగ జేయాలని కోరుతున్నట్టు తెలిపారు.

*ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పున‌కు సంబం ధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఈరోజు హైకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. గత నెల 3 న ఏపీ హైకోర్టు రాజధాని అమరావతి రైతుల భూములను నెలరోజుల్లో అభివృద్ధి చేపట్టి అందజేయాలని గడువు విధించింది. ఈ గడువు రేపటిలోగా ముగియనుండడంతో ముందు జాగ్రత్తగా ప్రభుత్వం 190 పేజీల‌తో కూడిన ప‌లు అంశాల‌ను ప్రస్తావిస్తూ అఫిడ‌విట్‌ను దాఖలు చేసింది.

*శ్రీశైలం, రామచంద్రాపురం ఘటనల నేపథ్యంలో పలు దేవాలయాల్లో బీజేపీ బృందాలు పర్యటించాయి. ఆ దేవాలయాల్లో జరిగిన ఘటనల రిపోర్టులను బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు అందజేశారు. శ్రీశైలంలో కర్ణాటక భక్తులపై జరిగిన దాడి, అన్యమతస్ధుల వల్లనే జరిగిందని.. ఈఓ, పోలీసులు వారికి ఏ విధంగా సహకరిస్తున్నారనే అంశాలను బీజేపీ నేతలు రిపోర్టులో వివరించారు.

*రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లు. హెచ్ వోడీ కార్యాలయాలకు సీసీకెమెరాల అనుసంధాన ప్రక్రియ. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ల డిజిటలైజేషన్ .15 కోట్ల పేజీల డిజిటలైజేషన్ చేయాలి1850 నుంచి ఉన్న డాక్యుమెంట్ల డిజిటలైజేషన్ చేయాలి. డిజిటలైజేషన్ కోసం ప్రైవేటు సంస్థను సంప్రదించాం. పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ను రిజిస్ట్రేషన్ శాఖ అమలుచేస్తోంది. రాష్ట్రంలో 37 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు. సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులకు సబ్ రిజిస్ట్రార్ హోదా. రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగం ద్వారా రూ.7,327 కోట్ల ఆదాయం.20.76 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగింది .రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ

*గవర్నర్ హోదాలో నా పరిమితులు నాకు తెలుసు.. నన్ను ఎవరూ నియంత్రించలేరు’ అని గవర్నర్‌ తమిళి సై స్పష్టం చేశారు. ప్రజా సమస్యల కోసం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేశారు. తనకు ఎలాంటి ఇగో లేదన్నారు. అందరితో సఖ్యతగా ఉండటమే తనకు తెలుసన్నారు. రాజ్‌భవన్ తెలంగాణ ప్రజల మేలు కోసమే ఉంద్నారు. వచ్చేనెల నుంచి యథావిధిగా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని గవర్నర్‌ తమిళిసై వెల్లడించారు.

*లింగంపేట్ మండలం రాంపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి విజయ్ కుమార్ (19) అనే యువకుడు మృతి చెందాడు. తోటి స్నేహితులే చెరువులో తోసేశారని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*గాంధీభవన్‌లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వర్కింగ్ ప్రెసిడెంట్‌లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, మల్లు రవి, సుదర్శన్ రెడ్డి, చిన్నారెడ్డి, హార్కర వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు శ్రీనివాస మూర్తి పంచాంగ పఠనం చేశారు.

*మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ ఈ నెల 11వ తేదీ సోమవారం నుంచి మరోమారు ఆధ్మాత్మిక పర్యటనకు బయలుదేరనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఆమె చెన్నై నుంచి విమానంలో తిరుచ్చి చేరుకుంటారు. అక్కడ ఉత్తమర్‌ ఆలయంలో దర్శనం చేసుకుని అక్కడ నుంచి తిరువాసి, గుణశీలం ఆలయాలను సందర్శిస్తారు. అక్కడ నుంచి నామక్కల్‌ ఆంజనేయాలయానికి వెళ్ళి పూజలు చేస్తారు. ఆ రోజు రాత్రి సేలం చేరుకుని అక్కడే ఒక హోటల్‌లో బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 8 గంటలకు తారామంగళంలోని ఎంజీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి జిల్లాలోని పలు ఆలయాలను దర్శిస్తారు.. శశికళ సేలం జిల్లా పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను అన్నాడీఎంకే మత్య్స విభాగం మాజీ కార్యదర్శి సురేష్‌ చేస్తున్నారు.

*సీఆర్ ఆధ్వర్యంలో.. ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో.. ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. వేద మంత్రాల ఆశీస్సులతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం పంచాంగ పఠనం చేశారు. సీఎం కేసీఆర్‌ను వేద పండితులు ఆశీర్వదించారు. బాచుపల్లి సంతోష్ కుమార శాస్త్రి పంచాంగ పఠనం చేశారు

*సంచలనం సృష్టించిన నల్గొండ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు అబ్దుల్ బారీని జైలు అధికారులు నిమ్స్‌కు తరలించారు. గుండె నొప్పి రావడంతో అబ్దుల్‌ను నల్గొండ జైలు అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీ రావుకు రౌడీ షీటర్ అబ్దుల్ బారీ సుపారీ గ్యాంగ్‌ను సమకూర్చాడు. ప్రస్తుతం నిందితుడు నల్గొండ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 2018 సెప్టెంబర్‌లో ప్రణయ్‌ను ముఠా దారుణంగా హత్య చేయగా… 2020 మార్చిలో హైదరాబాద్‌లో అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

*మధుకాన్‌ ఇన్‌ఫ్రా అనుబంధ సంస్థ సింహపురి ఎనర్జీ లిమిటెడ్‌ విలువను తగ్గించి విక్రయించాలన్న ప్రతిపాదనపై హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ సంస్థ గతంలో ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు పొందించింది. ఈ మొత్తం రుణాలను వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద రూ. 800 కోట్లు చెల్లిస్తామని ప్రతిపాదించింది.

*నిత్యం ప్రజల్లో ఉన్న వారిని పిలిచి పదవులు ఇవ్వాలి. ఆ దిశగా రాజకీయ ప్రక్షాళన జరగాలి. ఆ మార్పు రావాలని కోరుకుందాం’’ అని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ఈర్లె శ్రీరామమూర్తి రాసిన ‘నా జీవితం-ర గామ అభ్యుదయం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం లో ఆమె మాట్లాడారు. ‘‘గ్రామ సమస్యలతో పాటు అనేక సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినా ఆర్టీఐ కమిషనర్‌ వంటి పదవి కూడా ఇవ్వలేకపోయాం. దీనికి సిగ్గుపడాలి. ఇప్పటి రాజకీయాల్లో పదవి రానివాళ్లు బాధను బయట వ్యక్తం చేస్తుంటే, పదవి వచ్చిన వాళ్లు లోపల మరో బాధ వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామమూర్తి నవ్వుతూ హాయిగా ఉన్నారు. దీనికి పదవి రాకపోవడం ఒక కారణమై ఉండవచ్చు’’ అని పద్మ అన్నారు.

*స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదాయం ఒక్క నెలలోనే వెయ్యికోట్లు దాటింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నెల మార్చిలో రిజిస్ర్టేషన్ల ఆదాయం ఏకంగా వెయ్యికోట్లు దాటిందని ఆ శాఖ ఐజీ వి. రామకృష్ణ తె లిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35ు అధిక ఆదాయం వచ్చిందన్నారు. ఏడాదిమొత్తం మీద 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.6,336 కోట్ల ఆదాయం వస్తే.. 2021-22 ఏడాదికి రూ.7,327 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం గాడిన పడిందనేందుకు ఇది నిదర్శనమని తెలిపారు. మరోవైపు రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్లు కూడా పెరిగాయన్నారు. గత ఆర్థిక సంవత్సరం 17.20 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్‌ కాగా.. ఈ ఏడాది 20.76 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయని వివరించారు. 3.56 లక్షల డాక్యుమెంట్లు అధికంగా రిజిస్టర్‌ అయ్యాయని తెలిపారు. అనేక నూతన సంస్కరణలకు రిజిస్ర్టేషన్‌ శాఖలో శ్రీకారం చుట్టామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు

*ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన కొన్ని గంటల్లోనే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం బోల్తాపడింది. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట-పాయకరావుపేట మండలం నామవరం మధ్య ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు కేటాయించిన వాహనాల్లో ఒకటి శుక్రవారం సాయంత్రం ఒడ్డిమెట్ట వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ క్రమంలో అదుపుతప్పి.. డివైడర్‌పైకి ఎక్కి రోడ్డుపై బోల్తా పడింది. వాహనం డ్రైవర్‌ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కోలుగు గ్రామానికి చెందిన మణికంఠ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. నక్కపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని పక్కకు తీయించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. ఈ సంఘటపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ డి.వెంకన్న చెప్పారు.

*ముఖ్యమంత్రికి ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఆలోచన ఉన్నా.. రాష్ట్రంలో మద్యం తయారీఅమ్మకాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

*శుభకృత్‌ నామ సంవత్సరం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాలను అందించాలని గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయ వృద్ధి నమోదు చేయాలనిసకల వృత్తుల ప్రజలు ఆనందంగా ఉండాలని గవర్నర్‌ అన్నారు.

*ఏపీలో పంచాయతీ అకౌంట్లలో నిధులు అదృశ్యమవుతున్నాయి. అకౌంట్లలో సున్నా బ్యాలెన్స్‌ చూసి సర్పంచులు ఖంగుతిన్నారు.ఆర్ధిక సంఘం నిధులుజనరల్‌ ఫండ్స్‌ అకౌంట్లలోని నిధులను ఏపీ ప్రభుత్వం లాగేసుకున్నది. గత రాత్రి ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులను లాగేసుకుందని పంచాయతీ సర్పంచుల ఛాంబర్‌ ఆరోపిస్తున్నది. గ్రామ పంచాయితీల్లో నిధులు లాగేసుకున్నారని సర్పంచులు ఆరోపిస్తున్నారు. గతంలో ఆర్ధిక సంఘం నిధులుకోట్లను కూడా.. ప్రభుత్వం ఇలానే లాగేసుకుందని సర్పంచులు గుర్తుచేస్తున్నారు. గ్రామాల్లో వసూలు చేసిన ఆస్తిఇంటినీటిడ్రైనేజీ పన్నులను కూడా జనరల్‌ ఫండ్స్‌ నుంచి ఏపీ ప్రభుత్వం లాగేసుకున్నది. పంచాయతీ నిధులను ప్రభుత్వం దొంగిలించిందని టీడీపీ నాయకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. నిధుల గోల్‌మాల్‌పై త్వరలోనే ఉద్యమిస్తామని సర్పంచులు పేర్కొన్నారు.