Movies

అప్పుడే కదా కిక్‌

అప్పుడే కదా కిక్‌

అగ్రహీరోయిన్‌గా బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉండి కూడా మంచి అవకాశాలు వచ్చినప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు కియారా అడ్వాణీ. కథ నన్ను ఇన్‌స్పైర్‌ చేయగలిగితే చాలు… సినిమా చేస్తాను, స్టార్స్‌, జానర్‌తో పని లేదు అన్నారు కియారా. అగ్రహీరోలతోనే సినిమాలు చేయాలనే నియమం పెట్టుకోలేదనీ, మంచి కథ దొరికితే వర్ధమాన హీరోలతోనూ సినిమాలు చేయడానికి తాను సిద్ధం అన్నారు కియారా.కెరీర్‌లో ముందుకెళ్లడానికి కమర్షియల్‌ విజయాలు అవసరమే. కానీ కొన్నేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనసుకు నచ్చి చేసిన చిత్రాలు కొన్నైనా ఉండాలి. అప్పుడే కదా నటిగా నాకూ కిక్‌ ఉంటుంది అని కియారా చెప్పారు. ప్రస్తుతం ఆమె తెలుగులో రామ్‌చరణ్‌ సరసన నటిస్తున్నారు. హిందీలో ‘జుగ్‌ జుగ్గ్‌ జీయో’, ‘గోవిందా నామ్‌ మేరా’, ‘భూల్‌ భూలయ్యా 2’ చిత్రాల్లో  నటిస్తున్నారు.