Food

ఆహా.. రూఅఫ్జా టీ

రూఅఫ్జా టీ రుచి చూద్దాం..

వేసవి వచ్చిందంటే చల్లచల్లని పానీయాలు తాగాలని చూస్తాం . అలాంటి చెప్పుకోదగిన పానీయాల్లో రూఅఫ్ కూడా ఒకటి . గులాబీరంగులో నోరూరించే ఈ డ్రింక్ని పిల్లల్నుంచీ పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు . దిల్లీలోని ఓ టీస్టాల్లో చల్లచల్లని రూఅఫ్- పొగలు కక్కే టీ కలగలిపి సరికొత్తగా రూఅఫ్ టీగా అందుబాటులోకి వచ్చింది . పాలలో రూఅఫ్ సిరప్ని జోడించి టీ డికాక్షన్ కలిపి బాగా మరగకాస్తున్నారు . దాంతో ఈ టీకి రూఅఫ్ రంగూ రుచీ తోడవుతున్నాయి . గులాబీ చాయ్గా పిలుచుకునే ఈ టీ కమ్మటి వాసనతో .. కలర్ఫుల్ ఉండి చాయ్ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది .