Politics

జిల్లా పరిషత్‌ల విభజన ఇప్పట్లో లేనట్లే – TNI రాజకీయ వార్తలు

జిల్లా పరిషత్‌ల విభజన ఇప్పట్లో లేనట్లే  – TNI రాజకీయ వార్తలు

* జిల్లా పరిషత్‌ల విభజన ఇప్పట్లో లేనట్లేనని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జడ్పీల విభజనపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని తెలిపారు. ప్రస్తుతమున్న జిల్లా పరిషత్‌ల నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పారు. అధ్యయనం తర్వాత జడ్పీల విభజనపై విధివిధానాలు ప్రకటిస్తామని బొత్స స్యతనారాయణ తెలిపారు. 13 జిల్లాల నవ్యాంధ్ర… ఇక 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారింది. కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌లు జారీ చేసింది. రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ వీటిని విడుదల చేశారు. అంతకుముందు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు ఎస్పీలను నియమిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

*కేంద్రం విచక్షణా రహితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతోంది: తమ్మినేని
కేంద్ర ప్రభుత్వం విచక్షణా రహితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ క్రూడ్ ఆయిల్ ధర గతంలో 140 డాలర్లు ఉన్నా.. ఈ ధరలు లేవన్నారు. ప్రతి రూపాయిలో 45 పైసలకు పైగా డబ్బు పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తోందన్నారు. పన్నుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే.. మనమూ పెంచాల్సిన అవసరం లేదన్నారు. పెంచిన ధరలు తగ్గే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు

*ప్రభుత్వాన్ని మార్చాలనే కుట్ర భగ్నమైంది : ఇమ్రాన్ ఖాన్త
న నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కాసిం సురి తిరస్కరించడాన్ని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు. ప్రభుత్వాన్ని మార్చాలనే కుట్ర భగ్నమైందన్నారు. దేశ ప్రజలను అభినందించారు. కుట్రలు పాకిస్థాన్‌లో చెల్లబోవన్నారు. ముందస్తు ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీని ఇమ్రాన్ ఖాన్ కోరారు. అంతకుముందు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అనుమతించలేదు. సభను నిరవధికంగా వాయిదా వేశారు. కుట్ర జరుగుతోందనే కారణాన్ని చూపుతూ, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ తీర్మానాన్ని తిరస్కరించారు. ఈ అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దీంతో ప్రతిపక్షాలు సభలో రసాభాస సృష్టిస్తున్నాయి. ‘‘అసెంబ్లీని రద్దు చేయాలని నేను దేశాధ్యక్షునికి లేఖ రాశాను. ప్రజాస్వామిక విధానంలో ఎన్నికలు జరగాలి. ప్రజలు ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రజలను కోరుతున్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలే నిర్ణయిస్తారు’’ అని ఇమ్రాన్ చెప్పారు.

*మసీదు ముందు మైక్ పెట్టి హనుమాన్ చాలిసా వేస్తాం: రాజ్ థాకరే
మహారాష్ట్రలో లౌడ్‌స్పీకర్ల రగడ ప్రారంభమైంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ప్రధాన కార్యాలయంపై లౌడ్‌స్పీకర్ పెట్టి హనుమాన్ చాలిసా పటించడంతో రగడ తీవ్రమైంది. మసీదుల వద్ద ఉండే లౌడ్‌స్పీకర్లను తీసేయాలని లేదంటే మసీదుల ముందు హనుమాన్‌ చాలీసా మోగిస్తామని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కొద్ది సమయానికే ఎంఎన్ఎస్ కార్యాలయంపై లైడ్‌స్పీకర్లు పెట్టారు. అయితే వీటికి అనుమతి లేకపోవడంతో ఎంఎన్ఎస్ నేత మహేంద్ర భానుషాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు. 5,050 రూపాయల జరిమానా విధించి, మరోసారి రిపీట్ అయితే చర్యలు తీసుకుంటామని నోటీసు ఇచ్చారు.

*సీపీయస్ రద్దు చేయకపోతే, ప్రభుత్వాన్ని గద్దె దించుతాం: హరనాథ్
సీపీయస్‌ను ఒక పావుగా కొన్ని ఉద్యోగ సంఘాలు వాడుకున్నాయని ఏపీ పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరనాధ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీపీయస్ రద్దు డిమాండ్‌ను కరివేపాకులా వాడుకుని పక్కన పడేశారన్నారు. సీపీయస్ రద్దు చేసేంత వరకు పోరాటం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. సీపీయస్ రద్దు చేయకపోతే, ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హరనాథ్ పేర్కొన్నారు.

*ఒక్క రాజధానికి 60 నెలలు అయితే, మూడు రాజధానులకు 180 నెలలా?: లంకా దినకర్జ
గన్మోహన్ రెడ్డి పాలనకు ఫిట్ కారని అమరావతి నిర్మాణంపై కోర్టులో వేసిన అఫిడవిట్‌తో తెలిపోయిందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక్క రాజధానికి 60 నెలలు అయితే, మూడు రాజధానులకు 180 నెలలా? అని ప్రశ్నించారు. అదే భూసేకరణ లేదా సమీకరణ కూడా జగన్ చేయాల్సి వస్తే 1800 నెలలు కావాలేమోనని ఎద్దేవా చేశారు. నాడు ప్రపంచ బ్యాంక్ అమరావతి భూముల భవిష్యత్తు నగదీకరణ హామీతో ఇవ్వడానికి సిద్దమైన 25 వేల కోట్ల రుణం కాలరాసింది ఏవరు? ఆయన నిలదీశారు. నేడు 480 ఎకరాలు అమరావతి రాజధాని భూములు తాకట్టు పెట్టి రూ. 3 వేల కోట్ల రుణం తెచ్చి, ఆ భూములనే అమ్మి ఆ అప్పు తీరుస్తామన్న ప్రతిపాదన ఎవరిదన్నారు. మూడు సంవత్సరాల సమయం వృథా చేసి, ఇప్పుడు ఆగిన పనులకు కాంట్రాక్టర్లను వెతుకు తున్నారా? అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి మాటలు ఒకదానికొకటి పొంతన లేవన్నారు. రాష్ట్రంలో నిర్మాణల కోసం ఒక ఇటుక వేసే శక్తి కూడా లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జగన్ పాలన పోవడంతోనే రాజధాని అమరావతి నిర్మాణం దానంతట అదే పరుగులు తీస్తుందనేది ప్రజల నమ్మకమని లంకా దినకర్ వ్యాఖ్యానించారు.

*రైతుల‌ను విస్మ‌రించి కార్పొరేట్ల‌కు వ‌త్తాసు ప‌లుకుతోన్న కేంద్రం- మంత్రి కేటీఆర్
తెలుగు ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు చెప్పారు ఐటీశాఖ మంత్రి కేటీఆర్. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..వ‌రి కొనుగోళ్ల‌పై కేంద్రానికి ప‌లుమార్లు విజ్ఞ‌ప్తి చేశామ‌న్నారు. ఢిల్లీకి మంత్రులు వెళ్లి కేంద్రంలోని పెద్ద‌ల‌ను క‌లిశార‌ని కేటీఆర్ తెలిపారు. తెలంగాణభ‌వ‌న్ లో ఆయ‌న మాట్లాడుతూ..కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ ను ఇంత‌కు ముందుకూడా క‌లిశామ‌న్నారు. ఆహార భ‌ద్ర‌త కింద వ‌రి కొనుగోలు చేయాల‌ని చెప్పామ‌న్నారు. కేంద్రం త‌లా తోక లేని ప్ర‌భుత్వం..కార్పొరేట్ల‌కు వ‌త్తాసు ప‌లికే ప్ర‌భుత్వం అని మండిప‌డ్డారు కేటీఆర్. రైతుల‌పై ఏ మాత్రం ప్రేమ‌లేని ప్ర‌భుత్వమ‌ని అన్నారు. ప్ర‌త్యామ్నాయ పంట‌లు వేయాల‌ని మేం చెప్పాం అన్నారు. యాసంగిలో వ‌డ్లు వేయొద్ద‌ని మేం చెప్పామ‌న్నారు. ప్ర‌తీ ఏటా వ‌డ్డు కొనుగోలు చేసే బాధ్య‌త కేంద్రానిదే అన్నారు.

*కామారెడ్డి నుంచి పోటీచేస్తా: అజారుద్దీన్‌
వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీచేస్తానని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎక్కడి నుంచైనాపోటీ చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ధరలతో పేదల మీద భారం పెరుగుతోందని అన్నారు. పార్టీ ఆదేశాలమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6న కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేస్తామని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని అజారుద్దీన్‌ స్పష్టం చేశారు.

*రాష్ట్రంలో గతి, మతి లేని పాలన: సోము వీర్రాజు+
రాష్ట్రంలో గతి, మతి లేని పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా రాష్ట్రం ప్రచారం చేసుకుంటోందని, దానిని తాము ఖండిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ రాష్ట్రానికి వచ్చినన్ని నిధులు మరే రాష్ట్రానికీ రాలేదన్నారు. అలాగే ప్రత్యేక హోదాకు బదులుగా ఇచ్చిన కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని జగన్‌ అప్పుల పాల్జేస్తున్నారని, ఎటువంటి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని సోము వీర్రాజు దుయ్యబట్టారు.