Politics

ఈ నెల 7న ఏపీ మంత్రుల రాజీనామా – TNI తాజా వార్తలు

ఈ నెల 7న ఏపీ మంత్రుల రాజీనామా – TNI తాజా వార్తలు

*ఈ నెల 7న ఏపీ మంత్రుల రాజీనామా. కేబినెట్ భేటీ తర్వాత సీఎంకు రాజీనామాలు. ఇద్దరు మినహా మంత్రులంతా రాజీనామా. ఈ నెల 8న గవర్నర్ ను కలవనున్న సీఎం జగన్. ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం . కొత్తగా 23 మందికి అవకాశం. కొత్త జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గం కూర్పుపై పూర్తయిన కసరత్తు.

* ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో న్యాయవ్యవస్థపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొన్నారు. 150 పైగా కేసుల్లో ఏపీ ప్రభుత్వానికి కోర్టుల్లో చుక్కెదురైందని తెలిపారు. అంతకన్నా ఎక్కువగా కోర్టు ధిక్కారణ కేసులు కూడా పెరిగాయని విమర్శించారు. విద్యాసంస్థల ఆవరణల్లో ప్రభుత్వ వ్యవస్థలను నిర్మించొద్దని గతంలో కోర్టు తీర్పులిచ్చిందని అయినా కోర్టు తీర్పును పట్టించుకోలేదని తప్పుబట్టారు. కార్పొరేషన్ల పేరుతో బ్యాంక్‌ రుణాలు పొందడాన్ని కాగ్ తప్పుపట్టిందని లేఖలో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

* రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ.28 వేల కోట్లు ఇచ్చామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం జవాబిచ్చింది. రెవెన్యూ లోటు కింద 2015-20 నుంచి 2020-21 ఆర్థిక ఏడాదిల్లో.. ఏపీకి రూ.28 వేల కోట్లు విడుదల చేసినట్టు కేంద్రం తెలిపింది. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం, ఆర్థికసంఘాల సిఫార్సుల ప్రాతిపదికన.. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు సీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఉన్న కొన్ని అనుమతుల్లో సవరణలు కోరుతూ.. ఏపీ సీఎం నుంచి మూడు లేఖలు అందాయని కేంద్రం పేర్కొంది. 4 అంశాలపై మరిన్ని వివరాలు కోరుతూ 2 లేఖలను ఏపీకి పంపామని, అక్కడి నుంచి ఇంతవరకూ సరైన సమాధానం రాలేదని కేంద్రం తెలిపింది.

* ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలపాలన సోమవారం నుంచి మొదలైంది. చిత్తూరు జిల్లా మూడుముక్కలైంది. కొత్తగా తిరుపతి బాలాజీ జిల్లా ఏర్పాటైంది. ఇప్పటి వరకు జిల్లాతో కలిసి ఉన్న మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజక వర్గాలు కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో కలిసిపోయాయి. దాదాపు 66 మండలాలు కలిగిన చిత్తూరు జిల్లా మూడుముక్కలుగా విభజింపబడింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా వాసులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

* రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్ధీకరణతో ఏకీకృత అభివృద్దికి ప్రభుత్వం బాటలు వేసిందని గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు గవర్నర్ అభినందనలు తెలిపారు. 26 జిల్లాల ఏపీతో పాలనా చరిత్రలో నవశకానికి నాంది కానుందన్నారు. పాలనా సౌలభ్యం కోసం 23 నూతన రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం ముదావహమని గవర్నర్‌ అన్నారు.
*ఈ నెల 7న ఏపీ మంత్రుల రాజీనామా. కేబినెట్ భేటీ తర్వాత సీఎంకు రాజీనామాలు సమర్పిస్తారు.ఇద్దరు మినహా మంత్రులంతా రాజీనామా ఈ నెల 8న గవర్నర్ ను కలవనున్న సీఎం జగన్. ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
కొత్తగా 23 మందికి అవకాశం. కొత్త జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గం కూర్పుపై పూర్తయిన కసరత్తు…

*విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పలమనేరులో టీడీపీ ధర్నాకు దిగింది. మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి అధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. పేద ప్రజలు రాష్ట్రంలోబతికే పరిస్థితి లేదని సీఎంపై మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంటు, ఐరన్, ఇసుక, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు కారణంగా వైసీపీ పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని అమర్నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

*వివేకా హత్య కేసులో కొత్త ట్వీస్ట్..
కడప జిల్లా ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసు రోజుకొక ట్విస్ట్‌తో సాగుతోంది. సీబీఐ లోతైన దర్యాప్తుతో పెద్ద తలకాయల సంగతేంటో ప్రజలకు అర్థమైంది. అయితే కేసును వీలైనంత సాగదీసి అసలు నిందితులను అరెస్టు చేసినప్పుడు పెద్దగా సంచలనం కాకుండా చూసుకునేందుకు సూత్రధారులు ప్లాన్ చేసినట్లు సమాచారం. అందుకే కోర్టు తలుపులు తట్టడాలు, విచారణాధికారులపైనే కేసులు పెట్టడం చేస్తున్నారని చెబుతున్నారు. తద్వారా వీలైనంతకాలం కేసును సాగదీయవచ్చునని, ఈలోగా ఏదోఒక మార్గం దొరక్కపోతుందా? అని కీలక నిందితులు ఆశపడుతున్నారని సమాచారం. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అధికారపార్టీ ఎమ్మెల్యేలు గట్టిగానే మద్దతు ఇస్తున్నారు. ఈ విషయంలో వారు ఏ మాత్రం జంకడంలేదు. సీబీఐ విచారణ తీరును విమర్శించడం, అప్రూవర్‌గా మారిన దస్తగిరి 164 స్టేట్‌మెంట్లు తప్పని చెప్పడం.. కీలక సూత్రధారిగా భావిస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డిని వెనుకేసుకొస్తూ.. మీడియా సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది

*శ్రీరామనవమి ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈసారి భద్రాద్రి సీతారాముల కల్యాణానికి భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. కరోనా కారణంగా ప్రభుత్వం గత రెండేళ్లు భక్తులను అనుమతించలేదు. ఈసారి భక్తులు పెద్దఎత్తున రానున్నందున మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి పువ్వాడ ఆదేశించారు.

*యచోటి కేంద్రంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య కొత్త జిల్లా సోమవారం నుంచి ప్రారంభమైంది. కలెక్టర్, ఎస్పీలతోపాటు పలువురు ఉన్నతాధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాయచోటి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా నుంచి వేరుపడుతున్నందుకు బాధగా ఉన్నా.. మరోవైపు కొత్త జిల్లా కేంద్రంగా పరిపాలన ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలతో పోల్చుకుంటే.. ఇది వెనుకబడిన జిల్లా అని, తాగు, సాగునీటికి ఇబ్బందులున్న జిల్లా అని అన్నారు. ఇప్పుడు ఈ జిల్లాకు తాగు, సాగునీరు ఇస్తామని, అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. మౌలిక వసతుల కల్పన.. ఇలా అన్నిరకాల్లో కలిసి ముందుకు వెళతామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

*అవనిగడ్డ మండలం, పాత ఎడ్లంక కృష్ణానది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సీఆర్‌జడ్ పరిధి నుంచి అనుమతి లేకుండా భారీ టిప్పర్లతో తరలిస్తున్న ఇసుక అక్రమ రవాణాను గ్రామస్థులు అడ్డుకున్నారు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సైతం ఈ అక్రమ రవాణాకు వినియోగించడం గమనార్హం. ఎడ్లంక గ్రామ ఉనికిని ప్రశ్నార్థకం చేయొద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్రమ తవ్వకాలతో గ్రామంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వకాలపై విచారణ చేసి నిగ్గు తేల్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

*వాటాదారుల పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా ఫ్లిప్‌కార్ట్ ‘ఫౌండేషన్’ ప్రారంభమైంది. వ్యవస్థాపకత, జీవనోపాధి, స్థిరమైన వృద్ధి అవకాశాల కోసం సమాజంలోని అట్టడుగు, స్వల్ప ప్రాతినిధ్యమున్న వర్గాలకు మార్కెట్ యాక్సెస్‌పై దృష్టి సారించడం ఈ ఫౌండేషన్ లక్ష్యం. వివరాల్లోకి వెళితే… దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్… విభిన్న వాటాదారుల పర్యావరణ వ్యవస్థకు మద్దతునిచ్చే లక్ష్యంతో ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్‌ను ప్రారంభమైంది. ప్రభుత్వ సంస్థలు, ఎన్‌జీఓలు, కమ్యూనిటీ లీడర్‌లలో విభిన్న వాటాదారులతో సహకరించడం ద్వారా ఫౌండేషన్ పరివర్తన పనిని నడిపిస్తుందని బెంగళూరుకు చెందిన గ్రూప్ ఈ రోజు(సోమవారం) వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించడం, మహిళలు, ఇతరత్రా వెనుకబడిన వర్గాలకు వృద్ధి అవకాశాలకు సంబంధించి చేయూతనివ్వడం ద్వారా… ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్… రానున్న దశాబ్ద కాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 మిలియన్ల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

*గుర్తుతెలియని వ్యక్తులు నాటు తుపాకీతో యువకుడిని హత్యచేసిన ఘటన ఆదివారం ఏలూరు జిల్లా కొవ్వాడ గ్రామంలో జరిగింది. పోలీసులుకుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇంటి వరండాల్లో పడుకున్న అనిల్‌కుమార్‌ను శనివారం అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని వ్యక్తులు నాటు తుపాకీతో కాల్చడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడు సీఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. తెల్లవారుజామున రక్తపు మడుగులో కుమారుడు పడి ఉండడాన్ని గుర్తించిన అతని తల్లి కుమారి ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలుపగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. డీఎస్పీ లతాకుమారిసీఐ విజయబాబుఎస్‌ఐ జయబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

*జిల్లాల్లో అదనపు జేసీల వ్యవస్థకు ప్రభుత్వం స్వస్తి పలికింది. మళ్లీ పాత పద్ధతిలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) వ్యవస్థనే మరింత బలోపేతం చే యాలనుకుంటోంది. ఐఏఎస్‌ అధికారుల కొరతకొత్త జిల్లాల ఏర్పాటుతో వాటి భౌగోళిక విస్తీర్ణం బాగా తగ్గిపోవడంతో జిల్లాకొక జాయింట్‌ కలెక్టరు (జేసీ)నే ఉంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్‌జేసీఎస్పీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రెండుమూడో జేసీ పోస్టులను దాదాపుగా ఎత్తివేసినట్లే. నాన్‌కేడర్‌ అంటే స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌తో భర్తీచేస్తోన్న అదనపు జేసీ (ఆసరా) పోస్టులను ఎత్తివేసి.. వాటి స్థానంలో డీఆర్వోలనేకొనసాగించాలనుకుంటోంది. అంటే అదనపు జేసీలు చూసే బాధ్యతలు కూడా వారికే అప్పగించనున్నారు. అంటే.. ఇకపై జిల్లాల్లో డీఆర్వోలే కీలకం కాబోతున్నారన్న మాట. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆరు జిల్లాలకు ఇప్పుడున్న డీఆర్వోలను కొనసాగిస్తూమిగిలిన జిల్లాలకు కొత్త వారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు (జీవో జారీ చేశారు. ఇంకోవైపు.. రెవెన్యూయేతర విభాగాల నుంచి వచ్చి పలు జిల్లాల్లో ఆసరా జేసీలుగా పనిచేస్తున్న అధికారులను సొంత శాఖలకు సాగనంపారు. కర్నూలు ఆసరా జేసీగా ఉన్న ఎంకేవీ శ్రీనివాసులును వ్యవసాయ శాఖకుశ్రీకాకుళం ఆసరా జేసీ కె.శ్రీరాములు నాయుడును సహకారశాఖకు బదిలీ చేశారు. ఈ మేరకు ఆయా శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు.

*ఆరోగ్య సూచీల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆరోగ్యానికి పెద్దపీట వేశామన్నారు. కోట్లతో గత ఏడాది కంటే రెట్టింపు కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశాలుఏఎన్‌ఎంలుపీహెచ్‌సీ వైద్యులుడీఎంహెచ్‌వోలతో మంత్రి హరీశ్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీకుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సబ్‌ సెంటర్‌పీహెచ్‌సీల వారీగా పురోగతిని సమీక్షించారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళితో ఆశాఏఎన్‌ఎంవైద్య అధికారుల నుచి సమాధానాలు రాబట్టారు.

*ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు టీ-శాట్‌ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్‌ వ తేదీ వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. ఈ మేరకు టీ-శాట్‌ నెట్‌వర్క్‌ చానళ్ల సీఈవో శైలేష్‌ రెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం మినహా ప్రతిరోజు ఉదయం  గంటల నుంచిగంటల మధ్య పాఠ్యాంశాలు టీ-శాట్‌ విద్య చానల్‌లో ప్రసారం అవుతాయి. అలాగేసోమవారం నుంచి శనివారం వరకు ఉదయంనుంచి గంటల వరకుమధ్యాహ్నం గంటల వరకు టెట్‌ మొదటిరెండవ ప్రశ్న పత్రాలకు సంబంధించిన పాఠ్యాంశాలపై ప్రత్యేక లైవ్‌ పాఠాలు ఉంటాయి. పాఠ్యాంశ భాగాలు టీ-శాట్‌లో ప్రసారమవుతాయి. అలాగేటీ-శాట్‌ మాక్‌ టెస్ట్‌ కూడా నిర్వహించనుందని శైలేష్‌ రెడ్డి చెప్పారు.

*తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్థి సంస్థ కార్పొరేషన్‌ (టీఎ్‌సఆర్డీసీ) చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్‌ ఎర్రమంజిల్‌లోని రోడ్లుభవనాల శాఖ కార్యాలయంలోని తన చాంబర్‌ లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డిర్రబెల్లి దయాకర్‌ రావుసత్యవతి రాథోడ్‌రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడుఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డిఆర్‌అండ్‌బీ ఈఎన్సీలు గణపతి రెడ్డిరవీందర్‌ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు వేముల, ఎర్రబెల్లి, సత్యవతి మాట్లాడుతూ రాజకీయాల్లో ఓపిక అవసరమని, కష్టపడి పనిచేసే వారిని సీఎం కేసీఆర్‌ గుర్తిస్తారని, అలాంటి వారికి సమయానుకూలంగా పదవులు వరిస్తాయని అన్నారు. తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సోమవారం నుంచి టీఆర్‌ఎస్‌ నిర్వహించే ఆందోళనల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

*తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం ఢిల్లీకి చేరుకుంది. సోమవారం ఏఐసీసీ కార్యలయంలో పార్టీ ముఖ్య నాయకులతో రాహుల్‌గాంధీ సమావేశం కానున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఒక్కో రాష్ట్రం నుంచీ ముఖ్యనేతలను పిలిపించుకుని రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నారు. ఏకతాటిపై పార్టీని నడిపే అంశంపైనపార్టీ బలోపేతంపైనా వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ నేతలు లేవనెత్తుతున్న సమస్యలను ఆలకించి తగు ఆదేశాలూ ఇస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో సోమవారం రాహుల్‌గాంధీ సమావేశం అవుతున్నారు.

*మిళనాడులోని అన్నామలై యూనివర్సిటీలో డిస్టెన్స్‌(దూర) విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఆ వర్సిటీలో చేరవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) హెచ్చరించింది. దూర విద్యకు సంబంధించి యూజీసీ నుంచి ఈ వర్సిటీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ యూనివర్సిటీ ప్రకటించే వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని కోరింది. ‘‘అన్నామలై వర్సిటీ ఓపెన్‌, డిస్టెన్స్‌ విధానంలో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రకటన జారీ చేసినట్టు తెలిసింది. కానీ, యూజీసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కాబట్టి ఈ వర్సిటీలో ఎవరూ చేరవద్దు’’ అని యూజీసీ సెక్రటరీ రజనీశ్‌ జైన్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

*సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కోవోవ్యాక్స్‌ టీకాను దేశంలోని 12 ఏళ్లకు పైబడినవారి వ్యాక్సినేషన్‌ కోసం వినియోగించవచ్చని జాతీయ వ్యాక్సినేషన్‌ సాంకేతిక సలహా బృందం (ఎంటగీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఎంటగీకి చెందిన కొవిడ్‌-19 వర్కింగ్‌ గ్రూప్‌ ఈమేరకు సిఫారసులతో కూడిన నివేదికను సాంకేతిక స్థాయీ ఉప కమిటీకి సమర్పించినట్లు సమాచారం.