Movies

ఆర్​ఆర్​ఆర్​ క్రేజ్​.. చెర్రీని చుట్టుముట్టిన ముంబయి వాసులు

ఆర్​ఆర్​ఆర్​ క్రేజ్​.. చెర్రీని చుట్టుముట్టిన ముంబయి వాసులు

ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో దక్షిణాదితో పాటు ఉత్తారాధిలోనూ క్రేజ్​ సంపాదించుకున్నారు హీరో రామ్​ చరణ్​. అల్లూరి సీతారామరాజుగా చరణ్​ పండించిన హావభావాలు, నటనకు అక్కడి ప్రేక్షకులూ ఎమోషనల్​గా కనెక్ట్​ అయ్యారు. ఆదివారం సాయంత్రం ముంబయి వెళ్లిన చరణ్​ను అభిమానులు చుట్టుముట్టారు. ఈ వీడియో వైరల్​గా మారింది. పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాతో దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ ఆయనకు క్రేజ్‌ పెరిగింది. అందుకు నిదర్శనమే ఈ వీడియో. ‘మగధీర’ తర్వాత రామ్‌చరణ్‌ ‘జంజీర్‌’ అనే ఓ బాలీవుడ్‌ చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.ముంబయిలో రామ్​ చరణ్​ఇక తాజాగా విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాలీవుడ్‌ మార్కెట్‌లో రామ్‌చరణ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ పడించిన హావభావాలు, నటనకు అక్కడి ప్రేక్షకులూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిపోయారు. బాలీవుడ్‌ ఆడియన్స్‌ రెస్పాన్స్‌ ఎలా ఉందో చూడాలనే ఉద్దేశంతో ఆదివారం సాయంత్రం చరణ్‌ ముంబయి బాంద్రాలోని గెయిటీ గెలాక్సీకి వెళ్లారు. చరణ్‌ని చూసిన అభిమానులు ఆయన్ని చుట్టుముట్టారు. ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. తనపై అక్కడివారు చూపించిన ప్రేమాభిమానాలకు చరణ్‌ ఎంతో ఆనందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.