WorldWonders

ప్రపంచంలోనే ఖరీదైన స్కూల్.. ఫీజు ఏడాదికి రూ.99లక్షలు!

ప్రపంచంలోనే ఖరీదైన స్కూల్.. ఫీజు ఏడాదికి రూ.99లక్షలు!

‘అక్షరాలా 99 లక్షల రూపాయలు’… ఇదేదో విలాసవంతమైన ఇంటి ధరో, ఖరీదైన కారో విలువో అనుకోకండి.. ఓ విద్యార్థి ఏడాది ట్యూషన్ ఫీజు! అవును.. ఒక్క విద్యార్థి ఓ ఏడాది చదువుకునేందుకు కట్టే మొత్తం అది. ఇంత భారీ ఫీజును వసూలు చేస్తున్న స్కూల్ ఎక్కడుంది? దాని ప్రత్యేకతలేంటి? తెలుసుకుందాం పదండి..’ఇన్​స్టిట్యూట్ లె రోసే’.. స్విట్జర్లాండ్​లో ఉన్న ఈ పాఠశాల ఐరోపాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూల్​గా ప్రసిద్ధికెక్కింది. ఒక్కో ఏడాదికి విద్యార్థుల నుంచి లక్షా 30 వేల డాలర్లు (సుమారు రూ.99 లక్షలు) వసూలు చేస్తోంది. సాధారణంగా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్కూళ్లన్నీ ఐరోపాలోనే కనిపిస్తుంటాయి. చాలా స్కూళ్లలో ఫీజు కనీసం రూ.60 లక్షలకు తక్కువ ఉండదు. దీనికి కారణం ఆ స్కూల్​కు ఉన్న మంచి పేరుతో పాటు అక్కడి వసతులు, పూర్వ విద్యార్థులే కారణం. లె రోసే పాఠశాల సైతం ఇదే కోవలోకి వస్తుంది.
14921548-school0
స్పెయిన్​ రాజు జువాన్ కార్లోస్, ఈజిప్ట్​కు చెందిన కింగ్ ఫాద్-2, బెల్జియం రాజు కింగ్ అల్బర్ట్​-2 వంటి ప్రముఖులు ఈ స్కూల్​లోనే చదువుకున్నారు. అందుకే ఈ పాఠశాలను ‘స్కూల్ ఆఫ్ కింగ్స్’ అని పిలుస్తుంటారు. వీరితో పాటు ఐరోపాకు చెందిన శక్తిమంతమైన కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఇక్కడే చదువుకున్నారు. పాల్ కార్నాల్ అనే వ్యక్తి 1880లో ఈ స్కూల్​ను ప్రారంభించారు. రెండు క్యాంపస్​లు ఉన్న ఏకైక బోర్డింగ్ స్కూల్ ఇదే. జెనీవా నది ఒడ్డున అధునాతన వసతులతో స్కూల్​ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్ కోర్టులు, షూటింగ్ రేంజ్​లు, గుర్రపు స్వారీ కేంద్రాలు, వింటర్ క్యాంపస్(స్కీయింగ్ కోసం) వంటి వసతులు అందుబాటులో ఉన్నాయి. రూ.300 కోట్లు విలువ చేసే కన్సర్ట్ హాల్ సైతం ఉంది.
14921548-school-d
*ప్రత్యేకతలు…:
వసతులే కాదు చదువు విషయంలోనూ ఈ స్కూల్​కు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కో తరగతిలో 10 మందికన్నా తక్కువ మంది ఉంటారు. ప్రస్తుతం 420 మంది విద్యార్థులకు 150 మంది టీచర్లు ఉన్నారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండటం ద్వారా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టిసారించేందుకు వీలవుతుంది. విద్యార్థుల సంఖ్యలో పది శాతం మంది విదేశీయులకు మాత్రమే అనుమతి ఉంటుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులంతా ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు పోటీ పడుతుంటారు. ఇక్కడ బోధించే ఉపాధ్యాయుల పిల్లల కోసం 30 సీట్లు కేటాయిస్తారు. మొత్తం 420 మంది విద్యార్థుల్లో ముగ్గురికి మాత్రమే స్కాలర్​షిప్ సౌలభ్యం ఉంటుంది. మిగిలినవారంతా రూ.99 లక్షలు ఫీజు కట్టాల్సిందే.
14921548-schooldd
14921548-school-play
14921548-school-room
mahjong tile red dragon emoticons