Movies

త్రివిక్రమ్‌ కారును అడ్డుకున్న ట్రాఫిక్‌ పోలీసులు

త్రివిక్రమ్‌ కారును అడ్డుకున్న ట్రాఫిక్‌ పోలీసులు

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు తాజాగా జూబ్లీహిల్స్‌ పోలీసులు జరిమాన విధించారు. హైదరాబాద్‌ నగరంలోని జూబ్లిహిల్స్‌ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అటుగా వెలుతున్న త్రివిక్రమ్‌ కారును అడ్డుకున్నారు. ఆయన కారును తనిఖీ చేసిన ట్రాఫిక్‌ పోలీసులు బ్లాక్‌ ఫిలింను గుర్తించారు. దీంతో కారుకు ఫైన్‌ వేసి బ్లాక్‌ ఫిలింను తొలగించారు. ఆనంతరం ఆయనకు రూ. 700 జరిమానా విధించారు.కాగా వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్‌ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌లకు కూడా ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్‌ వేసి బ్లాక్‌ ఫిలిం తొలగించిన సంగతి తెలిసిందే.