NRI-NRT

సౌదీలో వైభవంగా ఉగాది వేడుకలు!

సౌదీలో వైభవంగా ఉగాది వేడుకలు!

మాతృభూమికి దూరంగా ఎడారి దేశాలలో పని చేస్తున్న ప్రవాసాంధ్రులు వీలయినప్పుడల్లా పరాయి గడ్డపై తమ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో తెలుగు పండుగలను అందరు కలిసి వైభవంగా జరుపుకుంటారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను సౌదీ అరేబియాలో మదీన రాష్ట్రంలో యాన్బూ పారిశ్రామిక పట్టణంలో తెలుగు ప్రవాసీయులు అఖిల భారత తెలుగు సేన అధ్వర్యంలో ఇటీవల అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన పంచాగ శ్రవణం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరింపజేశాయి. అందరూ ఉగాది పచ్చడిని ఆస్వాదించారు.
04042022151743n78
సౌదీ అరేబియాలో అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు! స్ధానికంగా సాగయ్యె అరటి చెట్ల తోరణాలపై వడ్డీంచిన భోజనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా ఇక్కడే లభ్యమైన మామిడి కూడా మరో ఆకర్షణగా నిలిచింది. యాన్బూలోని ప్రవాసాంధ్రుడు కమ్మరి కాశీరాజ్ (0591059245), సంతి మల్లేశన్(0597384449) ఈ కార్యక్రమ నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, మహిళలు నిర్వహించిన వివిధ కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రవాసంలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు పాటుపడడమే కాకుండా ఇక్కడ పుట్టి పెరుగుతున్న చిన్నారులకు కూడా వాటి విలువలను నెర్పిస్తున్నట్లుగా మల్లేశన్ పెర్కోన్నారు. చిన్నారుల కోసం ప్రత్యేక తెలుగు భాష శిక్షణ తరగతులను కూడ నిర్వహిస్తున్నట్లుగా ఆయన చెప్పారు.
04042022151820n46-1