DailyDose

ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ – TNI తాజా వార్తలు

ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ – TNI తాజా వార్తలు

* ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ అయ్యారు. కొత్త జిల్లాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నట్టు సమాచారం. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించే అవకాశమున్నట్టు సమాచారం. జనవరి 3న ప్రధానితో భేటీ అయిన సీఎం జగన్‌ 7 అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించారు. తిరిగి మరోసారి ఇదే అంశాలను ప్రస్తావించనున్నట్ట తెలుస్తోంది. రెవెన్యూ లోటు భర్తీపై కూడా కొంత జాప్యం జరుగుతోందని, వీటన్నింటినీ ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది.

*జగన్ ఢిల్లీ పర్యటనపై నారా లోకేష్ ట్వీట్ఏ
పీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకు? అని ప్రశ్నించి నాలుగు ఆప్షన్స్ కూడా ట్విటర్‌లో ఇచ్చారు.ఏ1-బాబాయ్ హత్య కేసులో దొరికిన అవినాష్‌రెడ్డిని తప్పించేందుకుఏ2-తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన రూ.48వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేయాలనిఏ3-తనపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు ఆపేయాలనిఏ4-లక్షల కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లిగవ్వ కూడా దక్కకుండా..మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలని అనే నాలుగు ఆప్షన్స్‌ను నారా లోకేష్ ఇచ్చారు.

*చిత్తూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ
చిత్తూరు జిల్లాలోని కల్లూరు మండలంలో టీడీపీ, వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. 5 రోజుల క్రితం టీడీపీ నేత రాజారెడ్డిపై దాడికి పాల్పడ్డ.. వైసీపీ శ్రేణులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసు స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీడీపీ నేతపై దాడి చేసిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయకుండా పోలీసులు వారికే మద్దతు ఇస్తున్నారని తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టీడీపీ శ్రేణుల ఆందోళనకు పోటీగా వైసీపీ శ్రేణులు ర్యాలీ తీశారు. దీంతో కల్లూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా రోడ్డుపై బైఠాయించిన టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ప్రధాన మంత్రి మహీంద రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీని కోల్పోయింది. ప్రభుత్వానికి మద్దతిస్తున్న పార్టీలుదాదాపు మంది సొంత పార్టీ ఎంపీలు స్వతంత్ర గ్రూపుగా ఏర్పడాలని నిర్ణయించడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీంతో పార్లమెంటులో ఆధిక్యతను నిరూపించుకోవాలని ఇతర పార్టీలను దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స ఆహ్వానించవలసి ఉంది.

*అన్నమయ్య జిల్లా కల్లూరులో పీఎస్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. సదుం మండలం బూరగమందకు చెందిన తెదేపా కార్యకర్త రాజారెడ్డిపై… సోమవారం వైకాపా కార్యకర్తల దాడిని వ్యతిరేకిస్తూ నిరసనకు తెదేపా పిలుపునిచ్చింది. ఈ నిరసనలో రాజంపేట తెదేపా నేత శ్రీనివాసులరెడ్డి పుంగనూరు ఇన్‌ఛార్జి చెల్లబాబు, నరసింహయాదవ్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు. కల్లూరు పీఎస్‌కు బయల్దేరుతుండగా నగరిపల్లిలో తెదేపా నేత నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. నల్లారి కిశోర్‌ గృహనిర్బంధాన్ని నిరసిస్తూ నగరిపల్లిలో తెదేపా ఆందోళన చేపట్టింది.

*మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ.. మంగళవారం ఉదయం యాదాద్రిలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఈవో గీతారెడ్డి, జర్నలిస్టులను అరెస్ట్‌ చేయించగా.. అరెస్ట్‌లకు నిరసనగా యాదగిరి గుట్ట పీఎస్‌ వద్ద జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు జర్నలిస్టులకు మద్దతు ప్రకటించాయి.

*సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా మాజీముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధినేత నారా చంద్రబాబునాయుడు ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్యమూర్తి.జగ్జీవన్ స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతికి కృషి చేద్దాం.దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టే ప్రభుత్వంపై పోరాడాల్సిన పరిస్థితి.దళితుల భవిష్యత్ కాలరాస్తున్న ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధపడాలి.దళితుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వడమే జగ్జీవన్‌కు మనమందించే నివాళి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

*సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా మాజీముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధినేత నారా చంద్రబాబునాయుడు ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్యమూర్తి.జగ్జీవన్ స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతికి కృషి చేద్దాం.దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టే ప్రభుత్వంపై పోరాడాల్సిన పరిస్థితి.దళితుల భవిష్యత్ కాలరాస్తున్న ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధపడాలి.దళితుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వడమే జగ్జీవన్‌కు మనమందించే నివాళి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

*కులరహిత సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నేత డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మంగళవారం జగ్జీవన్‌రామ్‌ 115వ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆదర్శనేత అని కొనియాడారు.

*బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్‌–2022కు ఈ నెల 7 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. అప్లికేషన్లను జూన్‌ 15లోగా, రూ. 500 పెనాల్టీతో జూలై 1 వరకూ పంపొచ్చని స్పష్టం చేశారు. ఇందుకు షెడ్యూల్‌ను సోమవారం తన కార్యాలయంలో ఆయన విడుదల చేశారు.

* హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వ్యవహారంలో సంచలన సృష్టించిన రాడిసన్ హోటల్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పబ్‌, లిక్కర్‌ లైసెన్సులను రద్దు చేసింది. 24 గంటలపాటు మద్యం సప్లైకి రాడిసన్‌ హోటల్‌ అనుమతి తీసుకున్నది. జనవరి 21న మద్యం సప్లైకి రాడిసన్‌ హోటల్‌ అనుమతి పొందింది. రూ.56 లక్షలు బార్‌ టాక్స్‌ చెల్లించి అనుమతిని తీసుకున్నారు. 2B బార్‌ అండ్ రెస్టారెంట్‌ పేరుతో అనుమతులు పొందారు. అయితే పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం బయటపడటంతో ఎక్సైజ్‌ శాఖ చర్యలు చేపట్టింది.

*కృష్ణా నదీ యాజమాన్య బోర్టుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి పేరుతో ఈ లేఖ ఉంది. విద్యుత్‌ ఉత్పత్తికి సాగర్‌ నుంచి తెలంగాణ నీటి వినియోగం అడ్డుకోవాలని ఈ లేఖలో విన్నవించారు.తాగు నీటికి లేకుండా విద్యుత్‌ ఉత్పత్తికి ఎలా చేస్తారని నిలదీశారు. కృష్ణా నీటిని తెలంగాణ దుర్వినియోగం చేస్తుందని ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో ఆక్షేపించింది.

*ప్రతి విషయంలోనూ ‘రివర్స్‌’ బాట పడుతున్న వైసీపీ సర్కారు జిల్లాకు నలుగురు జేసీల విషయంలోనూ అదే బాట పట్టింది. జిల్లా పరిపాలనలో నలుగురు జాయింట్‌ కలెక్టర్ల విధానానికి స్వస్తి పలికింది. రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఉత్తర్వులు (జీవో 23)జారీ చేశారు. మళ్లీ పూర్వపు పద్ధతిలోనే జిల్లాకు ఒక జాయింట్‌ కలెక్టరే ఉంటారని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. దీంతో నలుగురు జేసీల విధానం రద్దయిపోయినట్లే. పాత పద్ధతిలోనే పోస్టులు కొనసాగించాలంటే సగటున ఒక జిల్లాకు 3 కేడర్‌ జేసీలు, ఒక నాన్‌కేడర్‌ జేసీ చొప్పున నలుగురిని నియమించాలి. ఇలా 26 జిల్లాల్లో 78 మంది ఐఏఎ్‌సలను కేడర్‌ జేసీలుగా, 26 మంది స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను జేసీ-ఆసరాగా నియమించాలి. ఇప్పుడు జిల్లాలతోపాటు, డివిజన్లు కూడా భారీగా పెరిగాయి. ఐఏఎ్‌సతోపాటుడిప్యూటీ కలెక్టర్‌ పోస్టుల్లోనూ అధికారుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో తిరిగి\టి ఒకే జేసీ విధానం కొనసాగించాలని సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం జిల్లాకు ఒకే జేసీ ఉంటారు. అయితేజిల్లాలో డీఆర్‌వో పోస్టును మరింత బలోపేతం చేయనున్నారు. జేసీ ఆసరా చూసే అంశాలు డీఆర్‌వోకు బదిలీచేసే అవకాశం ఉంది.

*నూతన జిల్లాల ప్రారంభోత్సవానికి అఖిలపక్షాలను ఆహ్వానించకపోవడం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు, నిరంకుశంగా వ్యవహరించేందుకు రాష్ట్రం సీఎం జగన్‌ సొంత జాగీరు కాదని ధ్వజమెత్తారు. సోమవారం విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటు అన్ని రాజకీయ పక్షాలకు ఆమోదయోగ్యమైనా, సీఎం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. జగన్‌ ఏకపక్ష, నిరంకుశ విధానాలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. రామకృష్ణ మాట్లాడుతూ మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరంలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని తమ పార్టీ సూచించినా, ప్రభుత్వం బేఖాతరు చేసిందన్నారు

*మధ్యాహ్న భోజన పథకంలో.. అల్పాహారంగా చిక్కీలు పంపిణీ విషయమై ఇటీవల ఒక ఉపాధ్యాయున్ని సస్పెండ్‌ చేయడం అధికారుల తీవ్ర వైఖరికి నిదర్శనమని ఏపీ హెడ్‌మాస్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.వి.నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెలమల శ్రీనివాసరావులు పేర్కొన్నారు. ఈమేరకు పాఠశాల విద్య కమిషనర్‌కు సోమవారం లేఖ రాశారు. ఇలాంటి కారణాలతో సస్పెన్షన్‌కు గురైనవారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

*విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. ఇదే సమయంలో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత కొనసాగింది. ఇంకా బంగాళాఖాతం నుంచి గాలులు వీస్తున్నాయి. వీటన్నింటి ప్రభావంతో కోస్తాలో సోమవారం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా సోమవారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అనంతపురంలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

*ఈనెల 11న కొత్త మంత్రివర్గం కొలువుతీరబోతోంది. రవాణా శాఖకు ఎవరు మంత్రి అయినా నేను బస్‌ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా’’ అని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. విజయవాడలో బస్‌ అండ్‌ కార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ‘వన్‌ బస్‌ వన్‌ ఇండియా’ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి హోదాలో ఓ ప్రయివేట్‌ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే చివరిశారని అన్నారు. ప్రైవేట్‌ ఆపరేటర్లందరూ ఒకే తాటిపైకి వచ్చే ప్రయత్నం మంచి పరిణామమన్నారు. తెలంగాణ లారీ ఓనర్ల సంఘం కోరిక మేరకు అంతర్రాష్ట్ర ఒప్పందానికి తాము ముందుకు వచ్చినా ఆ రాష్ట్ర అధికారులు సిద్ధంగా లేరని అన్నారు. హైదరాబాద్‌లో తిరిగే ఏపీ బస్సులపై అనవసరంగా కేసులు రాయకుండా చూడాలని కోరారు. కాదని ఇష్టానుసారంగా కేసులు రాస్తే తెలంగాణ బస్సుల విషయంలోనూ అలాగే వ్యవహరించాల్సి ఉంటుందని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు.

*గల్ఫ్‌ దేశాల్లో ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌ ఘనంగా ప్రారంభమయిందిభారతదేశం కంటేఒకరోజు ముందుగా శనివారం నుంచి గల్ఫ్‌లో రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం కాగా.. శుక్రవారం రాత్రి నుంచి తరావీయా ప్రార్థనలు మొదలయ్యాయి. రంజాన్‌ మాసంలోని కారుణ్య గుణాన్ని స్ఫూర్తిగా తీసుకొని తన రాజ్యంలో మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు దుబాయ్‌ రాజు షేఖ్‌ మహమ్మద్‌ బిన్‌ రాషేద్‌ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా యుఏఈ వ్యాప్తంగామందికి పైగా ఖైదీలను విడుదల చేస్తూ వివిధ దేశాల రాజులు ఆదేశాలు జారీ చేశారు. రంజాన్‌ దీక్ష విరమించే సమయానికి రోడ్లపై ఉన్న వాహన చోదకులకు పోలీసులు ఉచితంగా ఇఫ్తార్‌ ఇస్తున్నారు. రెండేళ్ల అనంతరం కొవిడ్‌ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో సౌదీ అరేబియాలోని మక్కామదీన పుణ్యక్షేత్రాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది.

*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం లోని షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల ఆస్తులుఅప్పుల పంపిణీపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తా మని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కమిటీలో ఒక ఆర్థికవేత్తతో పాటు ఇత ర నిపుణులను సభ్యులుగా చేర్చుతామని ప్రతిపాదించింది. ఇదే షెడ్యూల్‌ లో ఉన్న తెలుగు అకాడమీ ఆస్తుల విభజన కేసుపై సోమవారం న్యాయ మూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయ వాది కేవీ విశ్వనాథన్‌ వాదిస్తూ అకాడమీ నిధులు ఇవ్వడానికి గతంలో తె లంగాణ ప్రభుత్వం అంగీకరించిందనిఅయినా ఇప్పటికీ డబ్బులు ఇవ్వడం లేదని అన్నారు.

*ఈ నెల 11, 12 తేదీల్లోఇంటర్‌ విద్యార్థులకు ఎథిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్‌ బోర్డు పేర్కొంది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ రెండు పరీక్షలు విద్యార్థులు తప్పకుండా రాయాల్సి ఉంటుందని తెలిపారు. గతేడాది కరోనా కారణంగా ఈ పరీక్షలను ఇంటర్‌ బోర్డు నిర్వహించలేదన్నారు. అసైన్‌మెంట్‌ రూపంలో ఇంటి నుంచే రాసి జవాబు పత్రాలు సమర్పించాలని చెప్పినట్టు తెలిపారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 2021-22 విద్యా సంవత్సర విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

*శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చిక్కుల్లో పడ్డారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో అలీబాగ్‌లో రూ.9 కోట్లు విలువచేసే ఎనిమిది ల్యాండ్ పార్సెల్స్ (ప్లాట్లు), ముంబైలోన దాదర్ శివార్లలో ఉన్న రూ.2 కోట్లు విలువచేసే ఒక ఫ్లాట్ ఉన్నాయి. పీఎంఎల్ఏ కింద ఈ ప్లాట్లు, ఫ్లాట్ జప్తు చేస్తూ ప్రొవిజనల్ ఆటాచ్‌మెంట్‌ను ఈడీ జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ముంబైలోని ఓ భారీ రెసిడిన్షియల్ బిల్డింగ్ రీ-డవలప్‌మెంట్‌కు సంబంధించి రూ.1,034 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్‌లో మనీ ల్యాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ జప్తు జరిగినట్టు చెబుతున్నారు.