NRI-NRT

స్విట్జర్లాండ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

స్విట్జర్లాండ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఏప్రిల్ 2న ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్’ వారు జ్యూరీచ్‌లో అక్రంగ వైభవంగా జరుపుకొన్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కనువిందుగా ఈ వేడుకలను నిర్వహించారు. స్విట్జర్లాండ్‌లో స్థిర పడిన 200 మంది తెలుగు వారు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ ఉగాది వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ గనికాంబ కడలి, జనరల్ సెక్టరీ డా.దుర్గారావు కారంకి, ట్రెజరర్ మాధురి ముళ్ళపూడి, కల్చరల్ సెక్రెటరీ మాణిక్యవల్లి చాగంటి, స్పోర్ట్స్ సెక్రటరీ రామచంద్ర వుట్టి ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో నిర్వహించారు.

y3
y5