DailyDose

ముంబై హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్‌ ఖాన్‌

ముంబై హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్‌ ఖాన్‌

బాలీవుడ్‌ కండల వీరుడు, సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తాజాగా ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. జర్నలిస్టుపై దాడి కేసులో ఇటీవల అంధేరీ కోర్టు సల్మాన్‌, అతని బాడీగార్డ్‌ నవాజ్‌ షేక్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు(ఏప్రిల్‌ 5)అంధేరి కోర్టు ముందు వీరు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ అంధేరీ కోర్టు, మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ను ఆర్‌ఆర్‌ ఖాన్‌ ఉత్తర్వుల వ్యతిరేకిస్తూ సల్మాన్‌ మంగళవారం హైకోర్టును ఆశ్రయించాడు.

కాగా 2019లో సల్మాన్‌ అశోక్‌ పాండే అనే ఓ జర్నలిస్ట్‌పై దాడి చేశాడని, అతడి ఫోన్‌ బలవంతంగా లాక్కుని బెదిరించాడని ఆరోపిస్తూ అంధేరి కోర్టులో ఫిర్యాదు చేశాడు. అంతేకాదు వారిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్డును కోరాడు. ముంబై రోడ్డులో సల్మాన్‌ సైకిలింగ్‌ చేస్తుండగా మీడియా ఆయన చూట్టు చేరి ఫొటోలు, వీడియోలు తీస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో సల్మాన్‌ అశోక్‌ పాండే అనే జర్నలిస్టు దగ్గరికి వెళ్లి ఫోన్‌ లాక్కుని బెదించాడని, అతడి బాడీగార్డు నవాజ్‌ షేక్‌ కూడా తనతో దురుసుగా ప్రవర్తించినట్లు అతడు ఫిర్మాదులో పేర్కొన్నాడు.

అతడి ఫిర్యాదు మేరకు లోకల్‌ పోలీసులను ఈ కేసు విచారణ చెప్పట్టాల్సిందిగా కోర్డు ఆదేశించింది. ఇటీవల దీనిపై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్‌ సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌కు ప్రతికూలంగా ఉంది. దీంతో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ను ఆర్‌ఆర్‌ ఖాన్‌ తాజాగా జారీ చేసిన ఉత్తర్వు జారీ చేస్తూ సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌పై ఐపీసీ సెక్షన్‌ 504, 506 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అంధేరీ కోర్టు మార్చి 23న సల్మాన్‌, ఆయన బాడీగార్డుకు నోటిసులు ఇచ్చి ఏప్రిల్‌ 5న విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది.