Business

రెండో రోజు కూడా నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు..! – TNI వాణిజ్య వార్తలు

రెండో రోజు కూడా నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు..! – TNI వాణిజ్య వార్తలు

*భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు బుధవారం(ఏప్రిల్‌ 6)న వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. చమురు ధరల పెరుగుదల, యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వార్తలతో ఇన్వెస్టర్లు ఆచితూచి మార్కెట్లలో అడుగులువేశారు. దాంతో పాటుగా చైనా ఆర్థిక కేంద్రం షాంఘైలో లాక్‌ డౌన్‌ విధింపు వార్తలు సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 566 పాయింట్లు లేదా 0.94 శాతం క్షీణించి 59,610 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 150 పాయింట్లు లేదా 0.83 శాతం క్షీణించి 17,808 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.59 శాతం, స్మాల్ క్యాప్ 0.12 శాతం క్షీణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు నష్టాలను మూటకట్టుకున్నాయి.
విలీన వార్తల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ షేర్లు సోమవారం రోజున భారీ లాభాలను పొందాయి. కాగా గత రెండు సెషన్లలో ఈ స్టాక్స్‌ భారీగా క్షీణించాయి. హెచ్‌డీఎఫ్‌సి లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఅండ్ఎం నష్టాలో ముగిశాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌ టీ, ఎస్‌బీఐ లాభాలను గడించాయి.
*దేశీయ స్టాక్‌ మార్కెట్లో రెండు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్టపడింది. హెచ్‌డీఎ్‌ఫసీ ద్వయంతో పాటు మిగతా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 435.24 పాయింట్లు కోల్పోయి 60,176.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లు క్షీణించి 17,957.40 వద్ద క్లోజైంది. నిఫ్టీ 18,000 కీలక స్ధాయి కన్నా మళ్లీ దిగజారింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 17 నష్టాలు చవిచూశాయి. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ షేరు 2.98 శాతం పతనమై సూచీ టాప్‌ లూజర్‌గా నిలిచింది. బ్లూచిప్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పటికీ చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 1.28 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.37 శాతం పుంజుకున్నాయి.
*ప్రైవేటు రంగంలోని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1.25 కోట్ల వ్యాపార మైలురాయిని అధిగమించింది. బ్యాంకు మొత్తం డిపాజిట్లు రూ.68,676 కోట్లు కాగా రుణాలు రూ.58,086 కోట్లుగా ఉన్నాయి. వందేళ్ల చరిత్రలో ఇది తాము సాధించిన విశేషమైన మైలురాయి అని, ఉద్యోగుల ఎన్నో సంవత్సరాల కృషి ఫలితంగానే ఇది సాధ్యమయిందని బ్యాంక్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేష్‌ బాబు ఒక ప్రకటనలో అన్నారు. కేవీబీకి ప్రస్తుతం 789 బ్రాంచిలు, 1639 ఏటిఎంలు ఉన్నాయి.
*హైదరాబాద్‌కు చెందిన హరిఓం పైప్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు అపూర్వ స్పందన లభించింది. మంగళవారం నాటితో కంపెనీ పబ్లిక్‌ ఆఫరింగ్‌ ముగిసే సమయానికి ఇష్యూ సైజుకు 7.93 రెట్ల బిడ్లు లభించాయి. కంపెనీ 85 లక్షల షేర్లను విక్రయానికి పెట్టగా.. 6.74 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలైనట్లు ఎన్‌ఎ్‌సఈ డేటా ద్వారా తెలిపింది. రూ.130 కోట్లు సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చిన కంపెనీ.. షేరు ధర శ్రేణిని రూ.144-153గా నిర్ణయించింది.
*ఆర్థరైటీస్‌, రక్త సమస్యలు, కొన్ని రకాల కేన్సర్లు, వ్యాధి నిరోధక వ్యవస్థ సమస్యల చికిత్సకు వినియోగించే మిథైల్‌ప్రెడ్‌నిసోలోన్‌ సోడియం సక్సినేట్‌ ఇంజెక్షన్‌ను అమెరికాలో విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీ్‌సకు అనుమతి లభించింది. ఇందుకు యూఎ్‌సఎ్‌ఫడీఏ ఆమోదం తెలిపింది. ఫార్మాసియా అండ్‌ అప్‌జాన్‌ కంపెనీ ఎల్‌ఎల్‌సీ కంపెనీ ‘సొలు-మెడ్‌రోల్‌’ బ్రాండ్‌తో విక్రయిస్తున్న ఇంజెక్షన్‌కు ఇది జనరిక్‌. వివిధ మోతాదులు కలిగిన వయల్స్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ సరఫరా చేస్తుంది.
*మాస్కోపై ఒత్తిడిని పెంచే క్రమంలో $ 600 మిలియన్ అమెరికా డాలర్లకు పైగా రష్యన్ బాండ్ చెల్లింపులను నిలిపివేసింది. ఈ క్రమంలో… డాలర్ నిల్వలను హరించడం, లేదా… వచ్చే కొత్త ఆదాయం, లేదా… డిఫాల్ట్‌లో రష్యా ఎంచుకోవాలని యూఎస్ ప్రతినిధి పేర్కొన్నారు. రష్యాకు సంబంధించిన బంగారం, విదేశీ కరెన్సీ నిల్వలలో దాదాపు $ 640 బిలియన్లలో సగభాగాన్ని ఆంక్షలు స్తంభింపజేయనున్నందున రష్యా నిల్వల నుండి చెల్లించడానికి మాత్రమే వెసులుబాటు ఉంటుంది. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24 న రష్యా దాడి చేసిన తర్వాత విధించిన ఆంక్షల నేపథ్యంలో… యూఎస్ ఆర్థిక సంస్థల వద్ద రష్యన్ సెంట్రల్ బ్యాంక్ కలిగి ఉన్న విదేశీ కరెన్సీ నిల్వలు స్తంభింపజేయబడ్డాయి.
*బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఐపీఓను వచ్చే నెల లోనే పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. 7 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.50,000 కోట్ల మేరకు సమీకరించాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు ఎల్‌ఐసీ ఈ ఏడాది ఫిబ్రవరి 13న సమర్పించిన డీఆర్‌హెచ్‌పీకి సెబీ మార్చి ప్రథమార్ధంలో ఆమోదం తెలిపింది. ఈ అనుమతి గడువు వచ్చేనెల 12తో ముగియనుంది. అప్పటికల్లా ఐపీఓ ను ముగించాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని వారు పేర్కొన్నారు. లేదంటే, ప్రభుత్వం ఎల్‌ఐసీ ఐపీఓకు అనుమతి కోరుతూ సెబీకి మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందన్నారు
*భారత్‌లోని డేటా సెంటర్స్‌ కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రావు శ్రీనివాసను నియమించినట్లు కాలియర్స్‌ ఇండియా వెల్లడించింది. డేటా సెంటర్ల డిజైన్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌ మెంట్‌, డేటా సెంటర్ల నిర్వహణ మొదలైన విభాగాల్లో శ్రీనివాసకు రెండు దశాబ్దాల అనుభవం ఉందని కంపెనీ పేర్కొంది.