ScienceAndTech

అమెరికా మార్కెట్‌లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ ఇంజెక్షన్‌ – TNI వాణిజ్య వార్తలు

అమెరికా మార్కెట్‌లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ ఇంజెక్షన్‌ – TNI వాణిజ్య వార్తలు

*ఆర్థరైటీస్‌, రక్త సమస్యలు, కొన్ని రకాల కేన్సర్లు, వ్యాధి నిరోధక వ్యవస్థ సమస్యల చికిత్సకు వినియోగించే మిథైల్‌ప్రెడ్‌నిసోలోన్‌ సోడియం సక్సినేట్‌ ఇంజెక్షన్‌ను అమెరికాలో విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీ్‌సకు అనుమతి లభించింది. ఇందుకు యూఎ్‌సఎ్‌ఫడీఏ ఆమోదం తెలిపింది. ఫార్మాసియా అండ్‌ అప్‌జాన్‌ కంపెనీ ఎల్‌ఎల్‌సీ కంపెనీ ‘సొలు-మెడ్‌రోల్‌’ బ్రాండ్‌తో విక్రయిస్తున్న ఇంజెక్షన్‌కు ఇది జనరిక్‌. వివిధ మోతాదులు కలిగిన వయల్స్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ సరఫరా చేస్తుంది.

*వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఎల్‌ అండ్‌ టీ కనస్ట్రక్షన్‌ నిర్మించనుంది. ఆసుపత్రిని టర్న్‌కీ ప్రాతిపదికన డిజైన్‌ చేసి, నిర్మించి, అప్పగించడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎల్‌ అండ్‌ టీ కనస్ట్రక్షన్‌కు చెందిన బిల్డింగ్స్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌ వ్యాపార విభాగం ఆర్డర్‌ పొందింది. బిడ్డింగ్‌ ద్వారా ఈ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. వరంగల్‌ హెల్త్‌ సిటీలో భాగంగా 1,750 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎల్‌ అండ్‌ టీ నిర్మిస్తుంది. బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లు కాకుండా 23 అంతస్తుల బిల్డింగ్‌ను నిర్మించనున్నట్లు ఎల్‌ అండ్‌ టీ కనస్ట్రక్షన్‌ వెల్లడించింది. ప్రాజెక్టులో భాగంగా ప్రధాన ఆసుపత్రితోపాటు ఇతర భవనాలను కూడా కంపెనీ నిర్మిస్తుంది. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే.. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తెలంగాణలోని అతిపెద్ద ఆసుపత్రుల్లో ఇది ఒకటి అవుతుంది. దేశంలోనే అత్యంత ఎత్తు కలిగిన హాస్పిటల్‌ బిల్డింగ్‌గా నిలుస్తుంది. మొత్తం బిల్ట్‌ అప్‌ ఏరియా 16.5 లక్షల చదరపు అడుగులుంటుంది. నిర్మాణ వ్యయాన్ని బట్టి మొత్తం కాంట్రాక్టు విలువ రూ.1,000-2,500 కోట్ల మధ్య ఉండొచ్చు.

*ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఓమ్నీ హాస్పిటల్స్‌ పేరుతో ఆరు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న ఇన్‌కార్‌ హెల్త్‌కేర్‌ రూ.155 కోట్ల నిధులను సమకూర్చుకోనుంది. ఆల్టర్‌నేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ ‘ఇన్వెస్టెక్‌’కు చెందిన ఎమర్జింగ్‌ ఇండియా క్రెడిట్‌ ఆపర్ట్యునిటీస్‌ ఫండ్‌ వన్‌, ఇన్వెస్టెక్‌ బ్యాంక్‌ పీఎల్‌సీ నుంచి ఈ నిధులు సమీకరిస్తున్నట్లు ఓమ్నీ గ్రూప్‌ సీఈఓ అలోక్‌ చంద్ర ముల్లిక్‌ తెలిపారు. 2010లో ఓమ్నీ హాస్పిటల్స్‌ పేరుతో సేవలు ప్రారంభించినట్టు ఇన్‌కార్‌ గ్రూప్‌ సీఎండీ సూర్య పులగం తెలిపారు.

*హైదరాబాద్‌కు చెందిన ‘క్విక్‌ఆన్‌’ స్టార్టప్‌ డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ను విడుదల చేసింది. యూపీ ఐ, యుటిలిటీ బిల్‌ చెల్లింపులు, నాన్‌ ఇంటర్నెట్‌ యూపీఐ పేమెంట్లు, ఆధార్‌ నెంబర్‌ ఆఽ దార చెల్లింపులు, టికెట్‌ బుకింగ్‌, వాలెట్‌, ఈఎంఐ చెల్లింపులు, ఇన్వె్‌స్టమెంట్‌ సేవలతో పాటు మొత్తం 40కి పైగా సేవలను అందించే విధంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు క్విక్‌ఆన్‌ ఫిన్‌సర్వ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీ పరంధామ తెలిపారు. వచ్చే రెండు నెలల్లో ఈ సేవలన్నీ అందుబాటులోకి వచ్చే వీలుందని చెప్పారు. ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా నగదు బదిలీ చేసే సదుపాయాన్ని మొదటిసారిగా క్విక్‌ఆన్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన చెప్పారు. 2022, డిసెంబరు నాటికి 2 కోట్ల డౌన్‌లోడ్‌లను అంచనా వేస్తున్నాం. ఇందులో కనీసం కోటి మందైనా యాక్టివ్‌ వినియోగదారులుండే వీలుంది. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టనున్నామని వివరించారు. విట్టనాథ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వైజరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా స్టాక్‌ అడ్వైజరీ, పోర్టుఫోలియో మేనేజిమెంట్‌ సేవలను గత 15 సంవత్సరాలుగా అందిస్తున్నామన్నారు.

*హైదరాబాద్‌కు చెందిన హరిఓం పైప్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు అపూర్వ స్పందన లభించింది. మంగళవారం నాటితో కంపెనీ పబ్లిక్‌ ఆఫరింగ్‌ ముగిసే సమయానికి ఇష్యూ సైజుకు 7.93 రెట్ల బిడ్లు లభించాయి. కంపెనీ 85 లక్షల షేర్లను విక్రయానికి పెట్టగా.. 6.74 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలైనట్లు ఎన్‌ఎ్‌సఈ డేటా ద్వారా తెలిపింది. రూ.130 కోట్లు సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చిన కంపెనీ.. షేరు ధర శ్రేణిని రూ.144-153గా నిర్ణయించింది

*దేశీయ స్టాక్‌ మార్కెట్లో రెండు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్టపడింది. హెచ్‌డీఎ్‌ఫసీ ద్వయంతో పాటు మిగతా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 435.24 పాయింట్లు కోల్పోయి 60,176.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లు క్షీణించి 17,957.40 వద్ద క్లోజైంది. నిఫ్టీ 18,000 కీలక స్ధాయి కన్నా మళ్లీ దిగజారింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 17 నష్టాలు చవిచూశాయి. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ షేరు 2.98 శాతం పతనమై సూచీ టాప్‌ లూజర్‌గా నిలిచింది. బ్లూచిప్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పటికీ చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 1.28 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.37 శాతం పుంజుకున్నాయి.

*విదేశీ మారక నిల్వలు పడిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద్వీప దేశం శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి (ఎల్‌కేఆర్) తొలిసారి అత్యంత కనిష్ఠానికి చేరుకుంది. అమెరికా డాలర్ మంగళవారం 300 ఎల్‌కేఆర్‌ను తాకినట్టు శ్రీలంక బ్యాంకులు తెలిపాయి. డాలర్ మారకపు రేటు 310 ఎల్‌కేఆర్‌కు చేరుకుందని, కొన్ని బ్యాంకుల్లో ఇది 312గా ఉందని బ్యాంకులను ఉటంకిస్తూ స్థానిక మీడియా పేర్కొంది.