DailyDose

ఏపీలో మూకుమ్మడిగా మంత్రుల రాజీనామా – TNI తాజా వార్తలు

ఏపీలో మూకుమ్మడిగా మంత్రుల రాజీనామా – TNI తాజా వార్తలు

*మరో రెండు సంవత్సరాల్లో రాబోయే ఎన్నికలకు సన్నద్దం అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దీంట్లో భాగంగా సచివాలయంలో ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఇవాళ తొలి మంత్రివర్గంలో ఉన్న వారందరీ చేత రాజీనామా చేయించారు. మొత్తం 24 మంది మంత్రులు తమ రాజీనామా పత్రాలను ఏపీ సీఎం జగన్‌కు అందజేశారు. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన క్యాబినెట్‌ సమావేశంలో ఏపీ మంత్రులంతా పాల్గొన్నారు.

*ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
చివరి కేబినెట్‌ భేటీ సందర్భంగా.. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ ఆమోదం తెలిపింది.
జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి అభినందనలు తెలుపుతూ కేబినెట్‌ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ను సీఎం జగన్‌ సహా కేబినెట్‌ మంత్రులు అభినందించారు.

*పార్లమెంట్ ఉభయ సభలు గురువారం నాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరిగాయి. గురువారం లోక్ సభ రాజ్యసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.పార్లమెంట్ బడ్జెట్ 2022 సమావేశాలు ఈ ఏడాది జనవరి 31న ప్రారభం అయ్యాయి. తొలి రెండు రోజులు మినహా మిగతా రోజుల్లో పార్లమెంట్ ఉభయ సభలు వేర్వేరు సమయాల్లో షిఫ్టుల వారీగా పని చేశాయి.మరోవైపు గత ఏడాది మాదిరిగానే ఈ సారీ పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం.రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. మొదటి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు నిర్వహించారు.రెండో దశ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించారు.తొలి రోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాధ్ కొవింద్ ప్రసంగించారు.ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు.గత ఏడాది బడ్జెట్ సమయంలో పెట్టుకున్న లక్ష్యాలు, సాధించిన విజయాలతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంచనాలతో కూడుకున్నదే ఆర్థిక సర్వే. ఈ సర్వేను ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అధ్యక్షతన ఆర్థిక నిపుణులతో కూడిన బృందం తయారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022 ను ప్రవేశ పెట్టారు.ఫిబ్రవరి రెండవ తేదీన నుంచి ఉభయ సభలు వేర్వేరు సమాల్లో భేటీ కానున్నాయి. ఒక్కో సభ రోజుకు 5 గంటల చొప్పున మాత్రమే పని చేసింది.పార్లమెంట్ సిబ్బంది పెద్ద ఎత్తున కరోనా బారిన పడటం, ప్రస్తుతం దేశంలో భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది పార్లమెంట్ వ్యవహారాల విభాగం.మొదట షిఫ్టులో రాజ్య సభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భేటీ అయింది.ఆ తర్వాత రెండో షిఫ్టులో సాయంత్రం 4 గంటల నంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ సమావేశాలు నిర్వహించారు.

*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత ఏడాది చివరి నాలుగు నెలల్లో పెట్టిన ఎర్న్‌ డ్ లీవ్స్ బిల్లులను ప్రభుత్వం వెనక్కి పంపింది. అలాగే డీఏ ఏరియర్స్ బిల్స్‌ను ప్రభుత్వం వెనక్కి పంపింది.
నిధుల కొరతతో వెనక్కి పంపినట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లా డ్రాయింగ్ అధికారుల లాగిన్ లోకి బిల్లులు వెనక్కి వచ్చాయి. బిల్లులు సమర్పించిన వెంటనే గత ఏడాదే ఇన్కమ్ టాక్స్ కట్ చేయడంతో ఉద్యోగులు ఖంగుతిన్నారు. మళ్లీ బిల్లు వెనక్కి రావడంతో బిల్లును మళ్లీ సబ్మిట్ చేయాల్సి రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

* కార్మిక శాఖ మంత్రి అవినీతి చిట్టాను టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బయటపెట్టారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గుమ్మనూరి జయరాం కమీషన్ల శాఖా మంత్రిగా మారారని, మూడేళ్లలో రూ. 735 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. కార్మికులకు గంజి కూడా లేకుండా చేసి.. ఆయన బెంజిలో తిరుగుతున్నారన్నారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి భూకబ్జాలకు పాల్పడ్డారని, పేదలకు వైద్యం అందించే ఈఎస్‌ఐలలో కౌంటర్లు పెట్టి జే ట్యాక్స్ వసూలు చేశారని ఆరోపించారు. జయరాం మంత్రి పదవి అడ్డుపెట్టుకొని వేల కోట్లు సంపాదించుకున్నారన్నారు.

*పాక్ నేషనల్ అసెంబ్లీ రద్దుపై తీర్పును పాకిస్థాన్ సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ రాత్రి 8 గంటలలోపు తీర్పు వెలువడవచ్చని తెలుస్తోంది. అంతకు ముందు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని సుప్రీం తప్పుబట్టింది. పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి సరిగా లేదని, శ్రీలంకలా తయారౌతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని, బలహీన ప్రభుత్వం సరికాదని పాక్ సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది.మరోవైపు ఇమ్రాన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా వస్తే దేశం 5 దశాబ్దాలు వెనక్కు వెళ్తుందన్నారు. విపక్షాలు విదేశాలతో చేతులు కలిపి కుట్ర చేశాయని ఆరోపించారు.

*36 అంశాల అజెండాతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఏపీ కేబినెట్‌ చివరి భేటీ సందర్భంగా మీడియాకు మంత్రి పేర్నినాని వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో మంత్రులు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, కొడాలినాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. తనకు ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుపెట్టుకుంటానని తెలిపారు. తనకు మీడియా చేసిన సహాయం అమోఘమని, ఈ మూడేళ్ళలో మీడియా మిత్రులు అందరినీ పేరుతో పిలిచేంత దగ్గరయ్యానని పేర్కొన్నారు. మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను అని మంత్రి పేర్ని నాని అన్నారు.

*ఢిల్లీ-మాస్కో మధ్య విమానాలను ఎయిర్‌ ఇండియా రద్దు చేసింది. ఢిల్లీ-మాస్కో-ఢిల్లీ మధ్య వారంలో రెండు రోజులు విమాన సర్వీసులను ఎయిర్‌ ఇండియా నిర్వహిస్తున్నది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇన్సురెన్స్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. టాటా చేతికి తిరిగి చేరిన ఎయిర్‌ ఇండియా అన్ని విమానాలకు ఇన్సురెన్స్‌ను అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. తమ గగనతలాన్ని రష్యా విమానాలకు నిషేధించాయి. ప్రతిగా రష్యా కూడా పశ్చిమ దేశాల విమానాలు, గగనతలం వినియోగంపై నిషేధం విధించింది. అయితే ఎయిర్‌ ఇండియా మాత్రం ఇప్పటి వరకు రష్యాకు విమానాలను నడుపుతున్నది. తాజాగా ఇన్సురెన్స్‌కు సంబంధించిన సమస్యల వల్ల మాస్కోకు విమానాలను రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

*పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తెలంగాణ కాంగ్రెస్ ధర్నాలకు పిలుపు ఇచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను గృహ నిర్భందం చేస్తున్నారు. గురువారం సివిల్ సఫ్లై భవన్, విద్యుత్ సౌధ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారు బయటకు వస్తే అరెస్టు చేయడానికి సిద్దంగా ఉన్నారు.

*బీజేపీ నేతలు దద్దమ్మలని, గవర్నర్‌ను వివాదంలోకి లాగుతున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు. ఎవరైనా రాజ్యాంగం పరిధిలో పని చేయాలని చెప్పారు. వడ్లను కొనే బాధ్యత కేంద్రానికి కాదా?, తెలంగాణ దేశంలో లేదా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని హెచ్చరించారు

*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఉన్న సింహాచలం ఆలయ చైర్మెన్ వివాదం ఎట్టకేలకు ముగిసింది. న్యాయ స్థానాల తీర్పుతో జగన్ సర్కార్..సింహాచలం ఆలయ పాలక వర్గాన్ని నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం ఆలయ చైర్మెన్ గా.. పూసపాటి అశోక గజపతి రాజును నియమిస్తు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అలాగే మరో 14 మంది పాలక సభ్యులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.కాగ రాష్ట్ర ప్రభుత్వం తాజా గా నియమించిన ఆలయ పాలక వర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. ఇదీల ఉండగా.. వైసీపీ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. సింహాచలం ఆలయ పాలక వర్గ చైర్మెన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించింది. అంతే కాకుండా.. సింహాచలం ఆలయ కమిటీ చైర్మెన్ గా అశోక్ గజపతిరాజు కూతురు సంచయిత తో పాటు మరి కొందరి సభ్యులుగా చేస్తు 2020 ఉత్తర్వులు జారీ చేసింది.దీనిపై అశోక్ గజపతి రాజు.. హై కోర్టును ఆశ్రయించారు. చాలా రోజుల పాటు విచరణ జరగగా.. హై కోర్టు అశోక్ గజపతి రాజుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాజా గా పాత ఆలయ కమిటీనే నియమిస్తు.. ఉత్తర్వులను జారీ చేసింది.

*ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆరోగ్యశాఖ నూతన డైరెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఆశయాలకు అనుగుణంగా వైద్యఆరోగ్యశాఖను మరింత బలోపేతం చేస్తానన్నారు. ఆయా శాఖాధిపతుల్ని సమన్వయం చేసుకుంటూ మెరుగైన ఫలితాల్ని సాధిస్తామన్నారు. డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న నివా్‌సకు ఎన్‌హెచ్‌ఎం ప్రొగ్రామ్‌ మేనేజర్‌ కర్రి అప్పారావుసిబ్బంది స్వాగతం పలికారు.

*డీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శావల్యాపురం మండలం కారుమంచిలో టీడీపీ-వైసీపీకి చెందిన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తులు 13 మంది, వైసీపీ కార్యకర్తలు ఆరుగురికి గాయాలయ్యాయి. ఇటీవల ముగిసిన కారుమంచి తిరునాళ్ళుపై వివాదం కాస్త ఘర్షణకు దారి తీసింది.

*ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ లైట్ల వెలుగులో కేడి పేటకు చెందిన గర్భిణికి ఆపరేషన్ జరుగుతోంది. గత రెండు రోజులుగా విత్యుత్ కోతలు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో జెనరేటర్ పని చేయడం లేదు. విద్యుత్ కోతల కారణంగా ఆసుపత్రిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీలుబాలింతలురోగులు ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవడం లేదు.

*నరసరావుపేటలో ప్లెక్సీల కలకలం రేగింది. సీఎం జగన్ పర్యటన సందర్భంగా ప్రైవేట్ హాస్పటల్ భవనంపై వైసీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ప్లెక్సీని తొలగించడంతో వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీని తొలగించారని ఆరోపించారు. అయితే తమ వద్ద అనుమతి తీసుకొనే ప్లెక్సీని ఏర్పాటు చేశారని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్లెక్సీలు తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పారు.

*ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరగటంతో రాష్ట్రంలో బుధవారం ఉదయం అగ్గిపెట్టెల కర్మాగారాలు మూతపడ్డాయి. గత మూడు నెలలుగా ముడిపదార్థాల ధరలు 30 నుంచి 40 శాతం మేర పెరిగాయి ఈ పరిస్థితుల్లో ముడిపదార్థాల ధరలను తగ్గించేందుకు, చైనా నుంచి లైటర్ల దిగుమతిపై నిషేఽధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ అగ్నిపెట్టెల కర్మాగారాల యజమానులు ఈ నెల 17 వరకు బంద్‌ పాటించాలని నిర్ణయించారు. ఆ మేరకు విరుదునగర్‌, సాత్తూరు, తిరునల్వేలి, తెన్‌కాశి, కావేరిపట్టినం, గుడియాత్తం తదతర ప్రాంతాల్లోని 300కు పైగా అగ్గిపెట్టెల తయారీ కర్మాగారాలను బుధవారం మూసివేశారు. ఈ కర్మాగారాలు మూతపడటంతో ఆరు లక్షల మంది కార్మికులు నష్టపోతున్నారని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.

*బాపట్ల జిల్లా అమృతలూరు మండలం మూల్పూరులో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు నూతక్కి రవికిరణ్‌ కేసుపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విజ్ఞ ప్తి చేశారు. బుధవారం ఈమేరకు గుంటూరు డీఐజీకి ఆయ న లేఖ రాశారు. ఈ యువకుడిని హత్య చేసిమృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి బకింగ్‌ హాం కాల్వలో పడేశారని ప్రచా రం జరుగుతోందని చెప్పారు.

*2016 కంటే ముందు అడ్మిషన్లు పొందిన పీహెచ్‌డీ అభ్యర్థులు థీసెస్‌ అందజేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ మరో గడువిచ్చింది. థీసెస్‌ చివరి దశకు చేరుకొన్న వారు, థీసెస్‌ పూర్తయ్యి ఫీజు చెల్లింపులో ఇబ్బందులు ఎదురైన వారు, ప్లెజరిజమ్‌ సర్టిఫికెట్‌ పొందని అభ్యర్థులు ఈ నెల 13 లోగా అందజేయాలని యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ మేరకు రిజిస్ర్టార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వర్సిటీలోని పలు విభాగాల డీన్స్‌ నిర్వహించిన సమావేశంలో పీహెచ్‌డీ థీసెస్‌ గడువు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన డిమాండ్లపై చర్చించారు. మరోసారి అవకాశం కల్పించాలనే అంశంపై పరిశీలించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15లోపు పరిశోధనపై సెమినార్‌ పూర్తి చేసుకున్నవారు, మార్చి 31లోపు ప్లెజరిజమ్‌ సర్టిఫికెట్‌ అందని వారికి, ఫీజు చెల్లింపులు చేయని వారికి అవకాశం కల్పిస్తున్నట్లు నిర్ణయించారు. ఈ నెల 13లోపు ఫీజు చెల్లించి ప్లెజరిజమ్‌ సర్టిఫికెట్‌ పొంది థీసెస్‌ అందజేయాలని సూచించారు. లేకుంటే అడ్మిషన్లు రద్దు చేస్తామని ప్రకటించారు.

*రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ నూతన డైరెక్టర్‌గా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన విధుల్లో చేరారు. అంబేడ్కర్‌ ఇంతకు ముందు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశారు.

*విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారులు బుధవారం నిర్వహించిన తనిఖీలలో రూ. 6.92 లక్షల జరిమానా వసూలు చేశారు.టౌన్‌ ఈఈ బీవీ సుధాకర్‌, డీఈఈ కోటేశ్వరరావు ఎస్‌ఈ ఆల్ఫోన్స్‌, ఈఈ భాస్కర్‌ల ఆధ్వర్యంలో 92 మంది సిబ్బంది 47 బృందాలుగా ఏర్పడి భవానీపురం సెక్షన్‌ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఒక కేటగిరీ నుంచి మరో కేటగిరీలో విద్యుత్‌ వినియోగించుకోవడం, అధిక లోడును వాడుకోవడం వంటి 176 కే సులను నమోదు చేసి రూ 6.92లక్షల జరిమానా వసూలు చేశారు. విజిలెన్స్‌ డీఈఈ నవీన్‌కుమార్‌, ఆపరేషన్‌ డీఈఈలు కోటేశ్వరరావు, నాగసాయి, నవీన్‌కుమార్‌, శ్రీధర్‌, టౌన్‌ ఏఈలు పాల్గొన్నారు

*చెత్త పన్నును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ పౌర సంఘాల వేదికపన్ను భారాల వ్యతిరేక వేదికల ప్రతినిధులు నిరసన తెలిపారు. బుధవారం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకూ చెత్త బుట్టలతో ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట చెత్త పోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వేదిక ప్రతినిధిసీపీఎం కార్పొరేటర్‌ బి.గంగారావు మాట్లాడుతూ.. కొత్తగా యూజర్‌ చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. నగరంలో శాతం మంది చెత్త పన్నును వ్యతిరేకిస్తున్నారనిఅయినప్పటికీ అధికారులు బెదిరించి మరీ వసూళ్లకు పాల్పడడం దుర్మార్గమని విమర్శించారు. వేదిక కన్వీనర్‌ బీబీ గణేశ్‌ మాట్లాడుతూ.. తక్షణమే యూజర్‌ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ అదనపు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వేదిక అధ్యక్షుడు కేవీ రమణమూర్తిఆర్‌.వెంకటరావుఉపాధ్యక్షుడు వీవీ ప్రభాకర్‌వార్వా వైస్‌ చైర్మన్‌ పిట్ట నారాయణ తదితరులు పాల్గొన్నారు.

*మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సీఎం జగన్‌ ఇష్టమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఆలోచన ప్రకారమే అన్నీ జరుగుతాయని, ఆయన ఏరోజు చెబితే ఆ రోజే రాజీనామాలు చేసేందుకు మంత్రులందరూ సిద్ధమని చెప్పారు. బుధవారం ఒంగోలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనన్నారు. మంత్రివర్గ మార్పుచేర్పులపై ఎవరికీ క్లారిటీ లేదని స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్‌ చార్జీలు పెంచామన్నారు. గతంలో చంద్రబాబు రూ.68 వేల కోట్లు అప్పులు చేసి వెళ్లడం వల్లే భారం పడిందని ఆరోపించారు. తెలంగాణలో ప్రజలపై రూ.5 వేల కోట్ల భారం వేశారని, ఇక్కడ రూ.1,800 కోట్లు మాత్రమేనని తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ క్లారిటీ లేని నాయకుడని విమర్శించారు. ‘పల్లకీలు మోయనంటారు.. వాళ్లనే వెనకేసుకొస్తాడు. సీఎం అభ్యర్థిగా ఉండనంటారు.. మరి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చుతారు’ అని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న పార్టీ పొత్తుల కోసం వెపర్లాడటం సిగ్గుచేటన్నారు.

*విద్యుత్‌ చార్జీలను తగ్గించేదాకా పోరాటం సాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో కాంగ్రెస్‌ పార్టీ బుధవారం నిరసన తెలిపింది. డీసీసీ అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ హాజరయ్యారు. పార్టీ జిల్లా కార్యాల యం నుంచి పవర్‌ ఆఫీస్‌ వద్దకు ర్యాలీగా వెళుతున్నవారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను లూఠీ చేస్తోందని శైలజా నాథ్‌ విమర్శించారు. పరిపాలన అంటే ప్రజలను దోపిడీ చేయడం కాదని, ఈ విషయాన్ని సీఎం జగన్‌ గుర్తించాలని సూచించారు. అతిపెద్ద విద్యుత్‌ ఉద్యమం నడిపిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకి ఉందని గుర్తు చేశారు.

*రాజధాని అమరావతిలోని సీఆర్‌డీఏ గ్రిడ్‌ రోడ్డుకు విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డును అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. ఆయన బుధవారమిక్కడ కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ బైపా్‌సకు సంబంధించి మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కు కోసం భూములను గుర్తించామని, వాటిని అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. డీపీఆర్‌ రూపకల్పనకు సహకరించి.. బైపాస్‌ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. విశాఖ-భోగాపురం బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు మద్దతివ్వాలని కోరారు. గతంలో రాష్ట్రానికి కేంద్రం 20 రోడ్డు ఓవర్‌ బిడ్జి(ఆర్‌వోబీ)లను మంజూరు చేసిందని, మరో 17 ఆర్‌వోబీలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

*సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు వ్యక్తిగత పనుల మీద విదేశాలు వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటూ కేం ద్రం జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. జడ్జీల వంటి ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల విషయంలో ఇలాంటి షరతులు అనవసరమని కోర్టు స్పష్టం చేసింది. అందరిలాగే జడ్జీలు విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు వీసా కు దరఖాస్తు చేసుకుంటారని, అప్పుడు ప్రయాణ వివరాలు ప్రభుత్వానికి తెలుస్తాయని కోర్టు పేర్కొంది. కేంద్ర విదేశాంగ శాఖ ఉత్తర్వులను అమన్‌ వచార్‌ అనే వ్యక్తి కోర్టులో సవాల్‌ చేశారు. జడ్జీల వ్యక్తిగత ప్రయాణాల వివరాలను వెల్లడించాలనడం వారి ప్రైవసీకి భంగం కలిగించడమేనని పిటిషనర్‌ పేర్కొన్నారు. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా వాదనలు వినిపిస్తూ జడ్జీలు విదేశాలకు వెళ్లినప్పుడు ఏదైనా అత్యవసరం ఏర్పడితే ప్రభుత్వం సహాయం చేస్తుందని, ఆ మేరకు ప్రయాణ వివరాలు అవసరమవుతాయని తెలిపారు.

*రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్లకుతేదీలో వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం అదనపు మాప్‌ అప్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు ఇప్పటికే నాలుగు విడతల కౌన్సిలింగ్‌ పూర్తి అయింది.ఖాళీ సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. సీట్ల వివరాలను వెబ్‌సైట్లో పొందుపర్చారు. ఈ నెల  సాయంత్రం  గంటల నుంచి తేదీ మధ్యాహ్నం  వరకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి
*నిరసనధర్నారాస్తారోకో వంటి కార్యక్రమాలు పోలీసు చట్టం ప్రకారం నిర్వహించాలని హైకోర్టు బుధవారం తెలిపింది. టీఆర్‌ఎస్‌ తలపెట్టిన రాస్తారోకో నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై లారీలను అడ్డుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు, నేషనల్‌ హైవే అథారిటీకి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కాకతీయ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ మంగళవారం హైకోర్టులో దాఖలుచేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై జస్టిస్‌ రాధారాణి ధర్మాసనం విచారణ చేపట్టింది. అనుమతి లేకుండా నిర్వహించే నిరసనల విషయంలో పోలీసులు చట్టప్రకారం వ్యవహరించాలని ధర్మాసనం సూచించింది. నిరసన తెలిపేవారు ముందస్తు అనుమతిపొందేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

*ఉత్తమ ప్రతిభ కనబరిచిన వైద్య సిబ్బందికి గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సన్మానం చేయాలని వైద్య శాఖ నిర్ణయించింది. 3 విభాగాల కింద 17 మంది వైద్య సిబ్బందిని ఎంపిక చేసింది. వారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు. కేసీఆర్‌ కిట్‌లో భాగంగా గర్భిణీలకు మొదటి యాంటీనాటల్‌ చెకప్‌ (ఎఎన్‌సీ) రిజిస్ట్రేషన్‌, గర్భిణీలకు 12 వారాలకు డాక్టర్‌ చెకప్‌, నాలుగో ఏఎన్‌సీ, పీహెచ్‌సీల్లో డెలివరీలు, ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌, టీబీ నిర్మూలన, రక్తహీనత కంట్రోల్‌, ఐహెచ్‌ఐపీ నిర్వహణలో మంచి ఫలితాలు సాధించిన వైద్య సిబ్బందిని గుర్తించారు.

*తరతరాలుగా పౌరాణిక కళా రూపాలను పరిరక్షించుకుంటూ, తెలుగు జాతి ఔన్నత్యాన్ని, భారతీయ సంస్కృతిని కాపాడుతున్న సురభి కళాకారుల సేవలు అభినందనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం ఆయన నివాసంలో వినాయక నాట్యమండలి ఆధ్వర్యంలో సురభి కళాకారులు మాయాబజార్‌, భక్తప్రహ్లాద, శ్రీనివాస కల్యాణం నాటకాలను కేవలం గంట వ్యవధిలో సంక్షిప్త రూపంలో ప్రదర్శించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడారు. సురభి కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి అపురూప కళా రీతులను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు.

*గోవా విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కోవిడ్-19 మహమ్మారి పూర్వపు స్థితికి చేరుకునే దిశగా గడచిన మూడు నెలల్లో ప్రయాణికుల రద్దీ కనిపించింది. మార్చి నెలలో ఈ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల సంఖ్య 78 శాతం పెరిగింది. గోవాను సందర్శించే యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతోపాటు, గోవా శాసన సభ ఎన్నికల కోసం విధించిన ఆంక్షలను ఉపసంహరించడం వల్ల ఇక్కడికి వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. డబొలిమ్ విమానాశ్రయం విడుదల చేసిన వివరాల ప్రకారం, జనవరిలో 4,129; ఫిబ్రవరిలో 3,505; మార్చిలో 5,508 విమానాల రాకపోకలు జరిగాయి. ఈ టెర్మినల్ ద్వారా జనవరిలో 4.5 లక్షల మంది, ఫిబ్రవరిలో 5.2 లక్షల మంది, మార్చిలో 8.1 లక్షల మంది రాకపోకలు సాగించారు. జనవరి రెండున 204 డొమెస్టిక్ అరైవల్స్, డిపార్చర్స్‌ ఈ టెర్మినల్‌లో జరగడం ఓ లైఫ్‌టైం రికార్డు. డిసెంబరు 28 నుంచి జనవరి 2 వరకు 1,206 విమానాల రాకపోకలు ఈ విమానాశ్రయం నుంచి జరిగాయి. ఈ సమయంలో 1.6 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. మార్చి వారంతంలో 54,857 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కోవిడ్ మహమ్మారికి పూర్వం వారాంతాల్లో ఇదే స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు జరిగేవి. ఈ గణాంకాలు రివెంజ్ టూరిజం సజీవంగా ఉందని చెప్తున్నాయని విమానాశ్రయం అధికారులు చెప్పారు. కోవిడ్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న తర్వాత ఎయిర్‌లైన్స్ కోలుకుంటున్నాయన్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపిన వివరాల ప్రకారం, గోవా అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో తొమ్మిదవది. ప్రయాణికుల రద్దీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.