Movies

ఆర్‌ఆర్ఆర్‌పై న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం

ఆర్‌ఆర్ఆర్‌పై న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం

ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ఇక ఈమూవీపై సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెరికా మీడియా సైతం ఆర్‌ఆర్‌ఆర్‌ను కొనియాడింది. న్యూయార్క్‌ టైమ్స్‌ ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం, మూవీ టీంను ప్రశంసిస్తూ ఆర్టికల్‌ను ప్రచురించింది. తాజాగా దీనిపై రాజమౌళి స్పందించారు. రీసెంట్‌గా జరిగిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ సక్సెస్‌ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ అమెరికా మీడియా సైతం ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని ప్రశంసించడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘అమెరికా లాంటి అగ్ర దేశం కూడా ఈ సినిమాను ప్రశంసిస్తుందని ఊహించలేదు. న్యూయార్క్ టైమ్స్ వంటి అతిపెద్ద మీడియా ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి స్పెషల్‌ అర్టికల్‌ రాసింది. ఇది చూసి నా మనసు భావోద్వేగంతో నిండిపోయింది. ఇది నిజంగా హార్ట్ టచింగ్ విషయం’ అన్నారు. అంతేగాక అమెరికాలోని ప్రేక్షకులు కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆదరిస్తున్నారన్నారు. ‘‘బాహుబలి’కి జపాన్ నుంచి ప్రశంసలు వచ్చాయని, ‘ఆర్ఆర్ఆర్’కు ఆమెరికా నుంచి వచ్చాయి. ఏ సినిమాకైనా బాక్సాఫీస్ నంబర్లు చాలా ముఖ్యమైనవే అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలు కూడా చాలా ముఖ్యం’’ అంటూ రాజమౌళి పేర్కొన్నారు.