DailyDose

విద్యార్థి వీసా దరఖాస్తు సాఫ్ట్‌ వేర్‌లో మార్పులకు అమెరికా ఎంబసీ యోచన

Auto Draft

విద్యార్థి వీసా దరఖాస్తులు సమర్పించే సాఫ్ట్‌ వేర్‌లో మార్పులు చేయాలని భారత్‌లోని అమెరికా ఎంబసీ యోచిస్తోంది. ఈ ఏడాది వేసవి నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. 2022 వేసవి కాలంలో వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే విద్యార్థులు.. ఇదే ఏడాది మళ్లీ దరఖాస్తులు సమర్పించడానికి వీలు లేకుండా సాఫ్ట్‌ వేర్‌లో మార్పులు చేస్తున్నట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికార వర్గాలు వెల్లడించాయి. గతేడాది వేసవిలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈమేరకు సాఫ్ట్‌ వేర్‌లో మార్పులు జరుగుతున్నాయని వారు తెలిపారు. 2021 వేసవి సీజన్‌లో వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురైన విద్యార్థులు ఎంతోమంది.. ఆ ఏడాది మళ్లీ రెండు, మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు. దానివల్ల తమ కంప్యూటర్‌ సిస్టమ్‌లు క్రాష్‌ అయ్యాయన్నారు.