Business

మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో ముగిసిన దేశీ సూచీలు – TNI వాణిజ్య వార్తలు

మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో ముగిసిన దేశీ సూచీలు – TNI వాణిజ్య వార్తలు

* మూడు వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలు మార్కెట్‌కి బూస్ట్‌ని అందించాయి. ముఖ్యంగా కీలకమైన రెపోరేటు, రివర్స్‌ రెపోరేటులో ఎటువంటి మార్పులు చేయకపోవడం సానుకూలంగా మారింది. దీంతో ఇటు బీఎస్‌ఈ సెన్సెక్స్‌, అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండు సూచీలు లాభపడ్డాయి.ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ లాభాలతో ఆరంభమైంది. 59,256 పాయింట్ల దగ్గర మొదలైన పరుగు ఓ దశలో గరిష్టంగా 59,654 పాయింట్లను తాకింది. అయితే చివరి గంటలో కొద్దిగా అమ్మకాలు సాగడంతో మార్కెట్‌ ముగిసే సమయానికి 412 పాయింట్ల లాభంతో 59,447 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. నిఫ్టీ విషయానికి వస్తే 145 పాయింట్లు లాభపడి 17,784 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మిడ్‌క్యాప్‌ కంపెనీల షేర్లు 0.98 శాతం వృద్ధి చూపించగా స్మాల్‌క్యాప్‌ కంపెనీలు 0.39 వృద్ధిని కనబరిచాయి.
*హైదరాబాద్‌కు చెందిన మైక్రోబైట్‌కు వెంచర్‌ కేపిటిలిస్ట్‌ విజయ్‌ మద్దూరి దాదాపు రూ.11 కోట్ల నిధులు అందించారు. ఈ నిధులను కొత్త బయోఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి మైక్రోబైట్‌ వినియోస్తుంది. సొంతగా అభివృద్ధి చేసిన టెక్నాలజీతో ఇక్కడ బయోఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తారని మైక్రోబైట్‌ సీఈఓ ప్రవీణ్‌ గోరకవి తెలిపారు. భారత్‌లో ఇథనాల్‌ మార్కెట్‌ 2025-26 నాటికి 250 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రవీణ్‌ చెప్పారు
*డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీ్‌సలో డాక్టర్‌ రెడ్డీస్‌ హోల్డింగ్స్‌ విలీనం కానుంది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌లో ఈ కంపెనీకి 24.83 శాతం వాటా ఉంది. విలీన స్కీమ్‌కు హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ విలీనానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ బోర్డు 2019 జులైలో ఆమోదం తెలిపింది. విలీనానంతరం డాక్టర్‌ రెడ్డీస్‌ హోల్డింగ్స్‌ వాటాదారులు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ వాటాదారులుగా మారతారు
*ఎయిర్‌లైన్స్‌ షేర్ల బదిలీలో మోసానికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసులో స్పైస్‌జెట్‌ ప్రమోటర్‌ అజయ్‌ సింగ్‌కు కొంత ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ని అరెస్ట్‌ చేయకుండా ఢిల్లీ హైకోర్టు గురువారం తాత్కాలిక రక్షణ కల్పించింది. కేసు తదుపరి విచారణ తేదీ వరకు అజయ్‌ సింగ్‌పైౖ ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు న్యాయమూర్తి అనూప్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు బెయిల్‌ కోసం అజయ్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చేనెల 24న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, కేసు దర్యాప్తునకు సింగ్‌ సహకరించాలని, ఈ వివాదానికి కారణమైన షేర్లను ఎవరికీ చెందకుండా ఉండేలా స్తంభింపజేయాలని కోర్టు ఆదేశించింది.
*భారత రిజర్వ్‌ బ్యాంక్‌ గురువారం డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల (డీబీయూ) ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆజాదీ కా అమృత్‌ వేడుకల సందర్భంగా బ్యాంకులు 75 జిల్లాల్లో డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విషయం విదితమే. ఈ డీబీయూల్లో అకౌంట్‌ తెరవడం, నగదు విత్‌ డ్రాయల్‌, డిపాజిట్‌, కేవైసీ అప్‌డేట్‌, రుణాల మంజూరు, ఫిర్యాదుల నమోదు వంటి సేవలు అందుబాటులో ఉంటాయని ఆర్‌బీఐ ఆ మార్గదర్శకాల్లో తెలిపింది. డిజిటల్‌ బ్యాంకింగ్‌లో అనుభవం గల షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులన్నీ ఆర్‌బీఐ అనుమతి లేకుండానే ప్రథమ శ్రేణి నుంచి ఆరవ శ్రేణి పట్టణాల వరకు అన్నింటిలోనూ డీబీయూలు తెరవవచ్చు. అన్ని డీబీయూలకు ప్రత్యేకంగా ప్రవేశ, నిర్గమ ద్వారాలుంటాయి. డిజిటల్‌ బ్యాంకింగ్‌ వినియోగదారులకు అనుకూలమైన ఫార్మాట్లు, డిజైన్లతో ప్రస్తుత బ్యాంకింగ్‌ యూనిట్ల నుంచి వేరుగా ఇవి పని చేస్తాయి.
*ఈ ఆర్థిక సంవత్సరం ఫార్మా కంపెనీలకు పెద్దగా కలిసొచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరం ఆ కంపెనీల ఆదాయ వృద్ధి రేటు గత సంవత్సరంతో పోలిస్తే ఆరు నుంచి ఎనిమిది శాతం మించక పోవచ్చని ఇక్రా పేర్కొంది. గత ఏడాది ఈ కంపెనీల ఆదాయాలు ఎనిమిది నుంచి పది శాతం వరకు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం దేశీయ ఫార్మా కంపెనీల దేశీయ ఆదాయం 7-9 శాతం, వర్థమాన దేశాల ఎగుమతుల ఆదాయం 12-14 శాతం, ఈయూ దేశాల ఎగుమతుల ఆదాయం 7-9 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది. తీవ్రమైన పోటీ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అమెరికా మార్కెట్‌లో ఆదాయ వృద్ధిరేటు అంతంత మాత్రంగానే ఉంటుందని అంచనా వేసింది
*టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్), నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్(ఎన్‌యూఎస్) జట్టు కట్టాయి. కార్పొరేట్ పాలనను ఆటోమేట్ చేయడం దీని ప్రధానోద్దేశం. సింగపూర్, ఆసియాలోని సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వ్యాపారాలలో వృత్తిపరమైన అభ్యాసాల మెరుగుదలకు ఇది దోహదపడుతుందని టీసీఎస్ గురువారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. టీసీఎస్… కార్పొరేట్ గవర్నెన్స్ అసెస్‌మెంట్‌ను వేగంగా, మరింత సమర్థవంతంగా చేయడానికి ఎన్‌యూఎస్ బిజినెస్ స్కూల్‌లోని సెంటర్ ఫర్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ(సీజీఎస్)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారిత కొత్త ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడంలో టీసీఎస్ సాంకేతిక నైపుణ్యం, సీజీఎస్ కార్పొరేట్ గవర్నెన్స్‌లను ఈ సహకారం ట్యాప్ చేస్తుంది, ఇది ఆయా వనరుల నుండి కార్పొరేట్ గవర్నెన్స్ డేటాను పొందనుండడంతోపాటు ప్రాసెస్ చేయగలదని కంపెనీ తెలిపింది. ‘మేం సీజీఎస్‌లో వారి డిజిటల్ పరివర్తన ప్రయాణంలో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషిస్తున్నాం. సింగపూర్, మిగిలిన ఆసియాలో కార్పొరేట్ గవర్నెన్స్ సహా సుస్థిరతలో అత్యుత్తమ సంస్కృతిని నిర్మించడానికి టీసీఎస్ అదే విలువలు, అభిరుచిని పంచుకుంటుంది’ అని టీసీఎస్ సింగపూర్ కంట్రీ హెడ్ అమీత్ నివ్‌సర్కార్ పేర్కొన్నారు.
*వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఎల్‌ అండ్‌ టీ కనస్ట్రక్షన్‌ నిర్మించనుంది. ఆసుపత్రిని టర్న్‌కీ ప్రాతిపదికన డిజైన్‌ చేసి, నిర్మించి, అప్పగించడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎల్‌ అండ్‌ టీ కనస్ట్రక్షన్‌కు చెందిన బిల్డింగ్స్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌ వ్యాపార విభాగం ఆర్డర్‌ పొందింది. బిడ్డింగ్‌ ద్వారా ఈ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. వరంగల్‌ హెల్త్‌ సిటీలో భాగంగా 1,750 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎల్‌ అండ్‌ టీ నిర్మిస్తుంది. బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లు కాకుండా 23 అంతస్తుల బిల్డింగ్‌ను నిర్మించనున్నట్లు ఎల్‌ అండ్‌ టీ కనస్ట్రక్షన్‌ వెల్లడించింది. ప్రాజెక్టులో భాగంగా ప్రధాన ఆసుపత్రితోపాటు ఇతర భవనాలను కూడా కంపెనీ నిర్మిస్తుంది. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే.. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తెలంగాణలోని అతిపెద్ద ఆసుపత్రుల్లో ఇది ఒకటి అవుతుంది. దేశంలోనే అత్యంత ఎత్తు కలిగిన హాస్పిటల్‌ బిల్డింగ్‌గా నిలుస్తుంది. మొత్తం బిల్ట్‌ అప్‌ ఏరియా 16.5 లక్షల చదరపు అడుగులుంటుంది. నిర్మాణ వ్యయాన్ని బట్టి మొత్తం కాంట్రాక్టు విలువ రూ.1,000-2,500 కోట్ల మధ్య ఉండొచ్చు.
*రానున్న మూడు దశాబ్దాల్లో(2031 నుండి 2060 వరకు) గ్రీన్ హైడ్రోజన్‌ను అభివృద్ధి చేసేందుకుగాను… ఆగ్నేయాసియాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు $25.2 బిలియన్ల వరకు పెట్టుబడులు అవసరమని ఇండోనేషియా ప్రభుత్వం అంచనా వేసింది. ప్రత్యేకించి… పెర్టమినా హైడ్రోజన్ అభివృద్ధి సహా స్వచ్ఛమైన శక్తి పరివర్తనను వేగవంతం చేయడంలో సహాయపడడానికి దాదాపు $ 11 బిలియన్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే… 2031 నుండి 2060 వరకు గ్రీన్ హైడ్రోజన్‌ను అభివృద్ధి చేయడానికి ఆగ్నేయాసియాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు $ 25.2 బిలియన్ల వరకు పెట్టుబడులు రానున్న ఐదు సంవత్సరాల్లో అవసరమని ఇండోనేషియా ప్రభుత్వం అంచనా వేసింది. ముఖ్యంగా, రాష్ట్ర-మద్దతుగల పెర్టమినా హైడ్రోజన్ అభివృద్ధి సహా స్వచ్ఛమైన శక్తి పరివర్తనను వేగవంతం చేయడంలో సహాయపడటానికి దాదాపు $ 11 బిలియన్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది.
*ఆర్థరైటీస్‌, రక్త సమస్యలు, కొన్ని రకాల కేన్సర్లు, వ్యాధి నిరోధక వ్యవస్థ సమస్యల చికిత్సకు వినియోగించే మిథైల్‌ప్రెడ్‌నిసోలోన్‌ సోడియం సక్సినేట్‌ ఇంజెక్షన్‌ను అమెరికాలో విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీ్‌సకు అనుమతి లభించింది. ఇందుకు యూఎ్‌సఎ్‌ఫడీఏ ఆమోదం తెలిపింది. ఫార్మాసియా అండ్‌ అప్‌జాన్‌ కంపెనీ ఎల్‌ఎల్‌సీ కంపెనీ ‘సొలు-మెడ్‌రోల్‌’ బ్రాండ్‌తో విక్రయిస్తున్న ఇంజెక్షన్‌కు ఇది జనరిక్‌. వివిధ మోతాదులు కలిగిన వయల్స్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ సరఫరా చేస్తుంది.