DailyDose

లైంగిక దాడి కేసు.. కరీంనగర్‌కు మచిలీపట్నం పోలీసులు? – TNI నేర వార్తలు

లైంగిక దాడి కేసు.. కరీంనగర్‌కు మచిలీపట్నం పోలీసులు? – TNI  నేర వార్తలు

*మచిలీపట్నంలోని ఇనగదురుపేట పోలీసుస్టేషన్‌ పరిధికి చెందిన ఒక దివ్యాంగురాలి(40)పై కరీంనగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడినట్లు అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందగా.. విచారణ నిమిత్తం కరీంనగర్‌కు చేరుకున్నట్లు తెలిసింది. వివరాలలోకి వెళ్తే.. దివ్యాంగురాలైన మహిళ మరో ఇద్దరితో కలిసి వంట పని కోసం గత ఫిబ్రవరిలో కరీంనగర్‌ వచ్చింది. తర్వాత ఆమె తిరిగి ఇంటికి చేరకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి సదరు మహిళ సెల్‌ఫోన్‌ నంబర్‌ ఆధారంగా కరీంనగర్‌ బస్టాండ్‌ వద్ద ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో మార్చి 09న ఆమె మచిలీపట్నం చేరుకుంది. ఆ దివ్యాంగ మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. కేసు నమోదవగా ఆరుపేట సీఐ బృందం కరీంనగర్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఆది, సోమవారాల్లో కరీంనగర్‌ బస్టాండ్‌ సమీపంలో, కొత్తపల్లి ఠాణా పరిధిలో కొంతమంది నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం.

*డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ
బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అభిషేక్, అనిల్‌ను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు కోరారు. మరోవైపు నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని బెయిల్ పిటిషన్ దాఖలైంది. తదుపరి విచారణ ఈ నెల 11కి న్యాయస్థానం వాయిదా వేసింది.

*పట్టపగలే మద్యం సేవించి ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడిపాడు. సూర్యాపేట జిల్లా, తిరుమలగిరిలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్, దిల్‌షుఖ్‌నగర్ నుంచి తొర్రూరుకు 30 మంది ప్రయాణీకులతో బస్సు బయలుదేరింది. మార్గమధ్యలో మోత్కూరు బస్సు స్టేషన్‌లో బస్సును ఆపిన డ్రైవర్ ఆ పక్కనే ఉన్న బెల్ట్ షాపులో మద్యం సేవించాడు. ఆ తర్వాత బస్సు తిరుమలగిరి వైపు బయలుదేరింది. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడుపుతున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు తిరుమలగిరి చెక్ పోస్టు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవర్ బ్రీత్ ఎన్‌లైజర్ పరీక్షకు నిరాకరించాడు. తనపై కేసు పెట్టుకుంటారో, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ దబాయించాడు. కొద్ది సేపు హై డ్రామ తర్వాత బ్రీత్ ఎన్‌లైజర్ పరీక్ష చేశారు. మద్యం సేవించినట్లు తేలడంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

*కోరుట్లలో ముగ్గురు జనశక్తి మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోరుట్ల శివారు కోనరావుపేట క్రాస్ రోడ్డు దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ ముగ్గురు అనుమానితులను ప్రశ్నించగా జనశక్తి మావోయిస్టులుగా నిర్ధారణ అయింది. సెంట్రల్ కమిటీ మెంబర్ సురేందర్‌తో పాటు చిట్టీ రాజేశ్వర్, నగునూరి గంగాధర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు జనశక్తి మావోయిస్టుల నుంచి 4 రివాల్వర్లు, 3 ట్వీలర్ బోర్ తుపాకులు, 1 తపంచ, 299 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

* కట్టలు తెగిన కోపంతో ఓ తండ్రి చెట్టంత కుమారుణ్ని నిలువునా కాల్చేశాడు. ఈ దారుణం బెంగళూరు చామరాజపేటలో విషాదాన్ని నింపింది. అప్పగించిన రూ.2లక్షల ఖర్చు వివరాలు చెప్పలేదనే ఉక్రోషం అతడిని మానసికంగా నియంత్రణ కోల్పోయేలా చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. చామరాజపేట ఆజాద్‌నగర్‌లో నివసించే సురేంద్ర నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు. తనయుడు అర్పిత్‌ (20) విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నాడని తరచూ బాధపడుతుండేవాడు. వారం కిందట అర్పిత్‌కు తండ్రి సురేంద్ర కొంత మొత్తమిచ్చి భవనాల నిర్మాణ అవసరాలకు వెచ్చించాలని సూచించాడు.ఇందులో రూ.2లక్షల మొత్తానికి లెక్క చెప్పలేదని, ఆ మొత్తాన్ని అడ్డగోలుగా ఖర్చు చేసేశాడని తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రతిసారీ లెక్క చెప్పకుండా దాటేస్తున్నావంటూ కుమారుడిపై నిప్పులు చెరిగాడు. ఈనెల 1న ఇంటి ముంగిటే కుమారుడిని గట్టిగా నిలదీశాడు. కోపం పట్టలేక అతడిపై పెట్రోలు పోశాడు. ‘వద్దు డాడీ వద్దు’ అంటూ యువకుడు తప్పించుకునేందుకు వీధుల్లో పరుగులు తీసినా వదల్లేదు. అగ్గిపుల్ల గీసి వేయడంతో అర్పిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆ యువకుడిని విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున చనిపోయాడు. పోలీసులు తండ్రిని అరెస్టు చేశారు.

*హనుమకొండ జిల్లాలోని శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులు అంతా పత్తిపాక గ్రామానికి చెందినవారని, కోతలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

*రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో.. పటేల్‌గూడ రహదారిపై అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన శివ(21), అజిత్‌(21) అనే యువకులు వెళ్తున్న లైటులేని ద్విచక్ర వాహనం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆశి్‌షముజేందర్‌(20), శివనాథ్‌రాయ్‌(24), బహదూర్‌(23)ల ద్విచక్ర వాహనం ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. దీంతో తీవ్రగాయాలైన ఆశి్‌షముజేందర్‌, శివ, అజిత్‌లు మృతి చెందారు. శివనాథ్‌రాయ్‌, బహదూర్‌లు చికిత్స పొందుతున్నారు. వీరందరూ పటాన్‌చెరు శివారులోని ఓ నిర్మాణ సంస్థలో కార్మికులుగా పనిచేస్తున్నారు

*గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ బంగారు నాణేలు ఇచ్చి రూ.7లక్షలతో ఉడాయించిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్‌కు చెందిన బాధితురాలు కరుణమ్మ అందించిన వివరాల మేరకు తమపొలంలో కేజీ బంగారు నాణేలు దొరికాయని రూ.20 లక్షలకే అందజేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. ఈ ఏడాది జనవరి 4న తనను అనం తపురానికి రమ్మని చెప్పారు. దీంతో తాను రూ.7లక్షలు తీసుకుని అనంతపురానికి వచ్చాను. అక్కడకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తనను కూడేరుకు ఆటోలో తీసుకెళ్లారన్నారు.

*బోథ్‌ మండలంలో బుధవారం వీచిన ఈదురు గాలులకు రూ.70వేల నష్టం సంభవించింది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగకండా బుధవారం రాత్రి విద్యుత్‌ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మండలంలోని ఘన్‌పూర్‌, పొచ్చెర గ్రామాల సరిహద్దుల్లో ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉండడంతో ఏడు విద్యుత్‌స్థంభాలు పడిపోయాయని ఏఈ జనార్దన్‌రెడ్డి తెలిపారు. రోడ్డపై పెద్ద వృక్షాలు నేలకొరగడంతో రవాణాకు ఆటంకం కలిగింది. తక్షణమే పోలీసు అధికారి సీఐ నైలునాయక్‌ స్పందించి రోడ్లపై పడ్డ చెట్లను తొలగింప చేశారు. గురువారం విద్యుత్‌ స్థంభాలు నిలబెట్టారు.

*ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ కె.శ్రీలక్ష్మి పర్యవేక్షణలో ఆత్మకూరు సెబ్‌ అధికారులు, సిబ్బంది ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో గురువారం దాడులు నిర్వహించారు. కర్నాటక రాష్టానికి చెందిన 180 ఎంఎల్‌ గల 720 సిల్వర్‌ కప్‌ బ్రాందీ మద్యం సీసాలను సాధీనం చేసుకు న్నారు. స్థానిక సెబ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ కృష్ణకిషోర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెంది న ఎద్దల పూడి ప్రసన్న, డబ్బుగుంట వెంకటేశ్వర్లును అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరికి ఒక వ్యక్తి కర్నాటక రాష్ట్రం నుంచి మద్యం సీసాలు సరఫరా చేస్తున్నట్లు తెలిసిందని, పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం మరికొందరిని పట్టుకుంటామని వెల్లడించారు. సూత్రధారులు, పాత్రధా రులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. అధికారులు నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆత్మకూరు ఎస్‌ఈబీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ నయనతార, సిబ్బంది పాల్గొన్నారు.

*వేగంగా దూసుకొచ్చిన కారు చిన్నారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మహబూబ్‌నగర్‌కు చెందిన వెంకటేష్‌, శోభ అల్వాల్‌ వజ్ర ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నారు. వారి కుమార్తె ధనుషా(2)రాత్రి రోడ్డపై ఆడుకుంటోంది. ఆ సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు చిన్నారిని ఢీకొట్టడంతో తలకు తీవ్రమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కారు ఢీకొట్టిన శబ్దానికి బయటకు వచ్చిన తల్లిదండ్రులు కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు

*మద్యం మత్తులో చెలరేగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. మాదాపూర్‌ ఎస్‌ఐ రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌కు చెందిన రాములు, సోనిబాయ్‌ దంపతుల చిన్న కొడుకు షెరావత్‌ శివనాయక్‌ (25) పెయింటర్‌. మాదాపూర్‌ చంద్రనాయక్‌ తండాలోని ఓ ఇంటిలో పెయింటింగ్‌ పని ఉండటంతో ఈనెల 5న నర్సాపూర్‌ నుంచి వచ్చాడు. బోరబండకు చెందిన సిద్దేశ్వర్‌ (21) అదే తండాలో నివాసం ఉంటూ పెయింటింగ్‌ పనిచేస్తుంటాడు. ఇద్దరూ ఒకేచోట పని చేస్తుండటంతో పరిచయం ఏర్పడింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాదాపూర్‌ ఖానామెట్‌ సర్వేనెంబర్‌ 11/7లోని ఖాళీ స్థలంలో ఇద్దరూ కలిసి మద్యం తాగేందుకు వెళ్లారు. మద్యం తాగిన తర్వాత ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో సిద్దేశ్వర్‌ దగ్గరలోని బండరాయితో శివనాయక్‌ తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. శివ కుటుంబసభ్యులు మొదట నర్సాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో, తర్వాత మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు

*బోథ్‌ మండలంలో బుధవారం వీచిన ఈదురు గాలులకు రూ.వేల నష్టం సంభవించింది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగకండా బుధవారం రాత్రి విద్యుత్‌ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మండలంలోని ఘన్‌పూర్‌పొచ్చెర గ్రామాల సరిహద్దుల్లో ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉండడంతో ఏడు విద్యుత్‌స్థంభాలు పడిపోయాయని ఏఈ జనార్దన్‌రెడ్డి తెలిపారు. రోడ్డపై పెద్ద వృక్షాలు నేలకొరగడంతో రవాణాకు ఆటంకం కలిగింది. తక్షణమే పోలీసు అధికారి సీఐ నైలునాయక్‌ స్పందించి రోడ్లపై పడ్డ చెట్లను తొలగింప చేశారు. గురువారం విద్యుత్‌ స్థంభాలు నిలబెట్టారు

*ప్రకారం కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి చెందిన చింతల కృష్ణయ్య(49) ఈ ఏడాది వరి సాగులో దిగుబడులు తగ్గి అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గంలేక బుధవారం రాత్రి పురుగుమందు తాగినట్టు భార్య భ్రమరాంబ(42) కు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆందోళనకు గురైన ఆమె వెంటనే కొమ్మమూరు కాలువలోకి దూకేసింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు. కాగా.. కృష్ణయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.