DailyDose

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి – TNI తాజా వార్తలు

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి – TNI తాజా వార్తలు

* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్‌ రమణ ప్రసాద్‌ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 15న జరగనున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను సీఎం జగన్‌కు అందజేశారు. వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ, ప్రసాదాలు అందించారు. కాగా 15 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు పున్నమి వెన్నెల్లో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం జరగనుంది.

* ఆంధ్రప్రదేశ్‌లో మూకుమ్మడిగా రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారానికి ఏపీ ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న సచివాలయంలోని అసెంబ్లీ పార్కింగ్ స్థలంలో ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ డాక్టర్‌ సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులతో వర్చువల్‌గా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో నూతన మంత్రివర్గ సభ్యులతో గ్రూపు ఫోటో, వేదిక, అలంకరణ, ఆహ్వాన పత్రిక, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారికి ఆహ్వానం పలకడం, రవాణా సౌకర్యం ఏర్పాట్లను ప్రోటోకాల్ విభాగం పర్యవేక్షిస్తోంది. ఏపీ సీఎం జగన్‌ ఆదేశాల మేరకు మంత్రివర్గంలో ఉన్న మొత్తం 24 మంది మంత్రులు నిన్న తమ రాజీనామా పత్రాలను అందజేశారు. పాత మంత్రివర్గంలో ఉన్న వారిలో అయిదుగురు లేదా ఆరుగురిని కుల, మత, ప్రాంతీయ సమీకరణల మేరకు కొనసాగిస్తారని భావించినప్పటికీ అనుభవం దృష్ట్యా మరికొంత మందికి తిరిగి అవకాశం కల్పించనున్నారని సమాచారం. మొత్తంగా ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న మంత్రివర్గంలో అధికభాగం కొత్తవారికి అవకాశం దక్కనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

*ఆంధ్రప్రదేశ్‌లో 57 మంది జిల్లా, అదనపు జిల్లా జడ్జీలను బదిలీలు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది . తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వెంకట జ్యోతిర్మయి, కడప జిల్లా న్యాయమూర్తిగా ఎన్‌. సలోమన్‌ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సి . పురుషోత్తం కుమార్‌, చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇ. భీమారావు, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వైవిఎస్‌ పార్థసారథిలను నియమించింది.అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బి. శ్రీనివాస్‌, కృష్ణ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా అరుణ సారిక , ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎ. భారతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా అదనపు జిల్లా జడ్జీలను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు విడుదల చేసింది .

*ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి మూడు సంవత్సరాల్లో ఆయన సతీమణి బుష్రా బీబీ స్నేహితురాలు ఫరా ఖాన్ సంపద భారీగా పెరిగినట్లు పాకిస్థానీ మీడియా తెలిపింది. 2017లో ఆమె సంపద విలువ 231 మిలియన్ల పాకిస్థానీ రూపాయలు కాగా, 2021లో ఇది 971 మిలియన్ పాకిస్థానీ రూపాయలకు పెరిగిందని వెల్లడించింది. ఆమె ఆదాయపు పన్ను రిటర్న్‌ల ద్వారా ఈ వివరాలు తెలిసినట్లు పేర్కొంది. 2018లో ఆమె ఐటీ రిటర్న్‌లో ఆదాయం ‘నిల్’ అని పేర్కొన్నారని తెలిపింది

*యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం నిషేధం..యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ లోగోలు వాడితే కేసులు నమోదు చేయండి..రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కు కేంద్ర ఆదేశం.దేశ భద్రత దృష్ట్యా యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రజా క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలిపింది. యూట్యూబ్‌ ఛానళ్లకు సంబంధించిన వ్యక్తులు.. టీవీ ఛానళ్ల లోగోలను వాడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్రం వెల్లడించింది. వాటితోపాటు మూడు ట్విటర్‌ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్‌ ఖాతా, ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌ను కూడా నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఎవరైనా యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ లోగో వాడితే చర్యలు తీసుకోవాలని కోరింది

*కొత్తగూడెం టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ధాన్యం సేకరణలో మోదీ ప్రభుత్వ తీరుకు నిరసనగా టీఆర్‌ఎస్‌లోని రెండు వర్గాలు బైక్‌ ర్యాలీ తీశాయి.కాగా మున్సిపల్ చైర్‌పర్సన్‌ కాపు సీతామహాలక్ష్మి స్కూటీని.. వ్యతిరేక వర్గం కౌన్సిలర్లు వెనుక నుంచి ఢీకొట్టారు.దీంతో సీతామహాలక్ష్మి స్కూటీ నుంచి కింద పడిపోయారు. సొంతపార్టీ నేతలే అవమానిస్తున్నారంటూ సీతామహాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎదుట ఆమె కంటతడి పెట్టారు.

*రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జీ.సి.సి) చైర్మన్ గా నియామకమైన రమావత్ వాల్యా నాయక్ శుక్రవారంసంక్షేమ భవన్ లో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజనస్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలుమధ్య తరగతి ప్రజలు వృద్ధిలోకి రావడానికి కంటున్న కలలను నిజం చేయడంలో అందరూ వారధులుగా పని చేయాలని అన్నారు. ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో గిరిజనుల సమగ్ర వికాసానికి తెలంగాణ ప్రభుత్వమే పాటుపడిందన్నారు.అసెంబ్లీ సాక్షిగా గిరిజన రిజర్వేషన్లను శాతానికి పెంచాలని తీర్మానం చేస్తూ కేంద్రానికి బిల్లు పంపిస్తే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తమకు గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై ప్రతిపాదన రాలేదని ఒక తప్పుడు మాటను పార్లమెంట్ సాక్షిగా చెబుతూ గిరిజనులను ఆందోళనకు గురి చేసిందన్నారు

*ఎంపీ రఘురామపై పోలీసుల దాడిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ.. కేంద్రం, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత 2 వారాల్లో రీజాయిండర్ దాఖలు చేసేందుకు.. రఘురామకృష్ణరాజు తనయుడు భరత్‌కు అవకాశం ఇచ్చింది. 4 వారాల తర్వాత కేసును లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రఘురామపై పోలీసుల దాడిపై సీబీఐ విచారణ జరపాలంటూ.. ఆయన కుమారుడు భరత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

* నరసరావుపేటలో టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబు‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓ ఫ్లెక్సీ తొలగించారంటూ టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వైసీపీ ఫ్లెక్సీ తొలగింపులో అరవింద్‌బాబుతో పాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్‌బాబును పోలీసులు బెయిల్‌పై విడుదల చేశారు.

*పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ ముఖ్య నాయకుల సమావేశం జరుగనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా, యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మూడు దశల్లో కాంగ్రెస్ చేసిన ఉద్యమాలపై చర్చించనున్నారు. గురువారం చేపట్టిన విద్యుత్ సౌద ముట్టడి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీ సభ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులు, అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులకు ఆహ్వానం పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

*తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. గురువారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని, సాగునీటి సౌకర్యం పెరిగిన నేపథ్యంలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపారు. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర రైతాంగం రోడ్ల మీదికి వచ్చిందని, కేంద్రం అందుకు నిరాకరిస్తోందని విమర్శించారు. 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌, రైతు బంధు వంటి పథకాల వల్ల ధాన్యం ఉత్పత్తి రెండింతలు పెరిగిందని చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. పంజాబ్‌ తరహాలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ఢిల్లీలోనూ ఆందోళన చేయబోతున్నామని తెలిపారు.

*ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఢిల్లీలో ప్రజా సంబంధాల అధికారిగా (పీఆర్‌ఓ) సంజయ్‌కుమార్‌ ఝాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సహారా సమయ్‌, దైనిక్‌ జాగరణ్‌ వంటి హిందీ పత్రికల్లో సంజయ్‌కుమార్‌ పనిచేశారు. కేసీఆర్‌ అప్పుడప్పుడు ఢిల్లీలో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడి హిందీ మీడియాకు, ఉత్తర భారత ప్రజలకు కేసీఆర్‌ గురించి సమాచారాన్ని తెలిజేయడానికి సంజయ్‌ను ఆయన పీఆర్‌ఓగా నియమించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంజయ్‌కు అవసరమైన భవన, రవాణా సదుపాయాలు కల్పించాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఆయనకు నెలకు రూ.2 లక్షల వేతనాన్ని చెల్లించనున్నారు. మంత్రులకు చెల్లించే పద్దు (ఎంహెచ్‌ 101) నుంచి ఆయనకు వేతనం చెల్లిస్తారు.

*కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్నా.. వారి రక్తంలో గడ్డలు ఏర్పడే ముప్పు ఆరు నెలల దాకా ఉంటున్నట్టు స్వీడన్‌ పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా కాళ్లలోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడే (డీప్‌ వెయిన్‌ త్రాంబోసిస్‌) ముప్పు మూడు నెలలపాటు, ఊపిరితిత్తుల్లో గడ్డలు ఏర్పడే ముప్పు ఆరునెలలపాటు, అలాగే రక్తస్రావం అయ్యే ప్రమాదం రెండు నెలలపాటు ఉంటున్నట్టు వారి పరిశోధనలో తేలింది

*‘తన సొంత బాబాయి వివేకానందరెడ్డి గొడ్డలి వేటుకు బలైతే గుండెపోటుగా జగన్మోహన్‌రెడ్డి చిత్రీకరించారు. ఇప్పుడు ‘హైదరాబాద్‌లో ఉంటూ నన్ను విమర్శించే వారికి గుండెపోటు వస్తుంది’ అంటూ పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. ఇది చూస్తుంటే వారి హత్యకు ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోంది. గొడ్డలివేటును గుండెపోటుగా చిత్రీకరించడంలో దిట్ట అయిన జగన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నిఘా సంస్థలు దీనిపై దృష్టి పెట్టాలి’’ అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమ అన్నారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇప్పటి వరకు మంత్రుల రూపంలో దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుంది. మంత్రివర్గం మార్పుతో గజదొంగల ముఠా ప్రజలను పీడించబోతోంది. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడానికే మంత్రి వర్గం మార్పు. రాష్ట్రంలో జగన్‌ పాలనపై ప్రశాంత్‌ కిషోర్‌ ఇచ్చిన సర్వే ఫలితాలపై జగన్‌కు చెమటలు పడుతున్నాయి.

*రైలు చార్జీలలో వృద్ధులకు రాయితీ పునరుద్ధరణపై ఒక నిర్ణయం తీసుకోవాలని రైల్వే అధికారులను హైకోర్టు ఆదేశించింది. కొవిడ్‌ను కారణంగా చూపి రద్దు చేసిన రాయితీని, దాని ప్రభావం తగ్గాక కూడా ఎందుకు పునరుద్ధరించడం లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళానికి చెందిన జీఎన్‌ కుమార్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌ విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వీవీఎ్‌సఎస్‌ శ్రీకాంత్‌, ఏపీఎస్‌ఆర్టీసీ తరఫున స్టాండింగ్‌ కౌన్సిల్‌ దుర్గాప్రసాద్‌, కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎ్‌సజీ) ఎన్‌.హరినాథ్‌ వాదనలు వినిపించారు.

*గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమాన టైర్‌ క్లోజింగ్‌ డోర్‌ విరిగిపోవడంతో ఈ సర్వీసును అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంగళూరు నుంచి 9ఐ501 నంబర్‌ ఎయిరిండియా విమానం 65మంది ప్రయాణికులతో గురువారం ఉదయం 9.30కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చింది. తిరిగి అదే విమానం 64 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బయల్దేరాల్సి ఉంది. అయితే ఆ విమానం ల్యాండింగ్‌ అయిన తర్వాత పైలట్‌ పరిశీలించగా టైర్‌ క్లోజింగ్‌ డోర్‌ విరిగినట్టు గుర్తించారు. ఆ సర్వీ్‌సను రద్దు చేసినట్టు అధికారులు చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. మరమ్మతుల అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ఈ విమానం బెంగళూరు వెళ్లింది.

*మత్స్యకార భరోసా పథకం మార్గదర్శకాలకు ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఇక నుంచి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఈ పథకాన్ని వర్తింప చేస్తారు. ఈ మేరకు గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. సముద్రంలో వేట నిషేధించిన కాలంలో మత్స్యకారుల జీవనానికి భరోసానిస్తూ ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం మార్గదర్శకాల్లో ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. గతంలో రేషన్‌, బియ్యం కార్డును ప్రతిపదికగా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేశారు. తాజా మార్గదర్శకాలతో కార్డులతో నిమిత్తం లేకుండా కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటారని పేర్కొన్నారు. నేరుగా బ్యాంకు అక్కౌంట్‌కు నగదు బదిలీ చేసే ఏటువంటి పథకం ద్వారానైనా ఇప్పటికే లబ్ధి పొందుతూ ఉంటే అటువంటి మత్స్యకార కుటుంబాలు ఈ పథకానికి అనర్హమైనవి. నాలుగు చక్రాల వాహనం ఉంటే ‘భరోసా’కు అనర్హులన్న నిబంధన నుంచి టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. పట్టణ ప్రాంతంలో 1,000 చదరపు అడుగుల స్థలం మించి ఉండకూడదన్న నిబంధనను సవరించి, మున్సిపల్‌ ఏరియాలో 1,000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉన్న కుటుంబానికి మాత్రమే అర్హత ఉంటుందని పేర్కొన్నారు. నెలకు కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.10,000, పట్టణ ప్రాంతంలో రూ.12,000 మించకూడదంటూ ఇప్పటి వరకు ఉన్న నిబంధన సవరించి… గ్రామీణ ప్రాంతంలో రూ.1.20లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44లక్షలు పరిమితిగా నిర్ణయించింది.

*ఇకపై ప్రభుత్వ వైద్యాధికారులెవరూ ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి వీల్లేకుండా పటిష్ఠ నియమావళిని తయారుచేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. త్వరలోనే తగిన మార్గదర్శకాలు రూపొందించనుంది. సీఎం జగన్‌ తొలి మంత్రివర్గం చివరి సమావేశం గురువారం అమరావతి సచివాలయంలో జరిగింది. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని విలేకరులకు వెల్లడించారు. కొంత మంది ప్రభుత్వ వైద్యులు.. ప్రభుత్వంలో వైద్యం కంటే బయట వైద్యమే మెరుగ్గా ఉంటుందనేలా వ్యవహరిస్తున్నారని ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ.. ప్రైవేటు వైద్యం చేయడం సరికాదు’ అని స్పష్టం చేశారు

*రాష్ట్ర కొత్త మంత్రివర్గం 11న ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ప్రస్తుత మంత్రుల పేషీల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం గట్టి ఝలక్‌ ఇవ్వనుంది. ఓఎ్‌సడీలు, పీఏలు, పీఎ్‌సలు, అదనపు వ్యక్తిగత కార్యదర్శులందరినీ మాతృశాఖలకు పంపే ఆదేశాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సంబంధిత ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. మళ్లీ కొత్త మంత్రివర్గం ఏర్పడిన తర్వాత ఆయా మంత్రులు తమకు అనుకూలరైన ఉద్యోగులను మళ్లీ తమ పేషీల్లోకి తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. తమకు ఇష్టమైతే పాత మంత్రుల వద్ద పని చేసినవారిని కొనసాగించుకోవచ్చు. ఉద్యోగులు సొంత శాఖలకు వెళ్లాక కొత్త మంత్రులు వారిని తమ పేషీలకు ఎంచుకోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.

*సీపీఎస్‌పై గురువారం జరగాల్సిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమవేశం మరోసారి వాయిదా పడింది. తొలుత ఉద్యోగ సంఘాలతో ఈ నెల న జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం దాన్ని 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే గురువారం జరగాల్సి ఈ సమావేశాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది. సమావేశం ఎప్పుడనేది తర్వాత తెలియజేస్తామని తెలిపింది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ప్రభుత్వం రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, హెచ్‌.తిమ్మన్న తెలిపారు. ఇక ఏ సమావేశాలూ అవసరం లేదని, ఉమ్మడి ఉద్యమాలతో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని ప్రకటించారు.

*కరెంటు కోతల పుణ్యమా అని తాటాకు విసనకర్రలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. నిన్నటి వరకు రూ.20 పలికిన విసనకర్ర ధర… ఇప్పుడు రూ.30కి పెరిగింది. జనం విసనకర్రల వ్యాపారులను వెతుక్కుంటూ వెళ్లి మరీ కొనుగోళ్లు చేస్తున్నారు. ‘‘ఏటా వేసవిలో సైకిల్‌పై విసనకర్రలను విక్రయిస్తా. ఎంత తిరిగినా రోజుకు 10 నుంచి 20కి మించి అమ్ముడయ్యేవి కావు. ఈ సీజన్‌లో 800 విసనకర్రలు తయారు చేశా. 750 విసనకర్రలు ఈ రెండు రోజుల్లోనే అమ్ముడయ్యాయి. మళ్లీ విసనకర్రలు తయారు చేస్తున్నా. 30 ఏళ్లుగా వేసవిలో విసనకర్రలు అమ్ముతున్నా. ఇంత డిమాండ్‌ ఎప్పుడూ లేదు’’ అని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన విసనకర్రల చిరువ్యాపారి శ్రీనివాస్‌ పేర్కొన్నారు

*జమ్మూ-కశ్మీరు బ్యాంకు మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రినేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. రుణాల మంజూరుపెట్టుబడుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఈ బ్యాంకు మాజీ చైర్మన్ ముష్తాక్ అహ్మద్ షేక్తదితరులపై అంతకుముందు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) కేసును నమోదు చేసింది. దీని ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రకారం కేసును ఈడీ నమోదు చేసింది

*ప్రభుత్వం ఈ నెల 11న నిర్వహించనున్న జ్యోతిబాపూలే జయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా బీసీ ఉద్యమ నాయకుడు నీల వెంకటే్‌షను నియమించింది. మరో 42మందిని వైస్‌ చైర్మెన్లుగా, 13 మందిని కన్వీనర్లుగా, 10 మందిని కో-ఆర్డినేటర్లుగా నియమించింది.