NRI-NRT

ఆస్ట్రేలియాలో చదవాలనుకునే వారికి వీసా రూల్స్‌ లో కీలక మార్పు

ఆస్ట్రేలియాలో చదవాలనుకునే వారికి వీసా రూల్స్‌ లో కీలక మార్పు

విదేశీ విద్యార్థులకు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం వీసా నిబంధనల్లో కీలక మార్పు చేసింది. సబ్ క్లాస్ 500 వీసాలపై ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకొచ్చే విదేశీ విద్యార్థులు ఇకపై హోం ఎఫెయిర్స్ మినిస్టర్ అనుమతి లేకుండా తమ కోర్సును మార్చుకునే అవకాశం లేదని తేల్చింది. ఈ మేరకు ఆస్ట్రేలియా మైగ్రేషన్ యాక్ట్ 1958కు కొన్ని కీలక మార్పులు చేసింది. 2022 జులై 1 తరువాత దాఖలయ్యే అప్లికేషన్లకే ఈ మార్పు వర్తింస్తుందని పేర్కొంది.

*ఏమిటీ సబ్‌క్లాస్ 500 వీసా..
విద్యార్థులకు ఇచ్చే సబ్‌క్లాస్ 500 వీసాల ద్వారా ఐదేళ్ల పాటు ఆస్ట్రేలియాలో చదువుకోవచ్చు. ఆ సమయంలో తమకు నచ్చిన రంగంలో విద్యార్థులు ఉద్యోగాలు కూడా చేయవచ్చు. వారి పనిగంటలపై కూడా ఎటువంటి పరిమితులు ఉండవు. ఇక గతంలో.. ఈ వీసా కలిగిన వారు గత ఆరు నెలలుగా తాము చదువుతున్న కోర్సును విద్యా సంస్థ అనుమతితో మార్చుకునే సౌలభ్యం ఉండేది. అయితే.. దేశభద్రత రీత్యా ప్రభుత్వం ఈ అవకాశాన్ని తొలగించింది. కొత్త రూల్ ప్రకారం.. కోర్సు మార్పు ద్వారా కీలక సాంకేతికత దేశ సరిహద్దులు దాటిపోయే అవకాశం లేదని నిర్ధారించుకున్నాకే హోం మినిస్టర్ దీనికి అనుమతించాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేట్ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ లేదా ఇతర బ్రిడ్జి కోర్సులు చదివే వారందరికీ ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి.