Politics

హవాలా బాలినేని..ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడింది – TNI రాజకీయ వార్తలు

హవాలా బాలినేని..ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడింది – TNI రాజకీయ వార్తలు

* హవాలా బాలినేని.. దాదాగిరీకి ఎక్స్‌ పైరీ డేట్ దగ్గర పడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.”నీ అవినీతిని ప్రశ్నిస్తే విద్యావంతులు, దళిత మేధావి..ఎమ్మెల్యే బాలాఆంజనేయస్వామి ఇంటిపైకి రౌడీ మూకల్ని పంపుతావా?. అవినీతి చీడపురుగువి నీకే అంత పౌరుషం పొడుచుకొస్తే.. బాలాఆంజనేయస్వామి ఇంటిపైకి వచ్చిన మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు.మా ఎమ్మెల్యే స్వామి జోలికొస్తే ఖబడ్దార్” అని నారా లోకేష్‌ హెచ్చరించారు.

*చిక్కిపై బొమ్మ ఎందుకు సీఎం గారు: రఘురామ
చిక్కిపై బొమ్మ ఎందుకు సీఎం గారు అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్‌ను ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వీలైతే భారతి సిమెంట్‌పై వేయించుకోవాలని పేర్కొన్నారు. జగన్ తన వెంట్రుక కూడా పీకలేరు అనడం ఎందుకు.. ఆయన దగ్గరకి ఎవరు వస్తారు? అని ప్రశ్నించారు. సర్పంచులు గుండు గీసుకొని రోడ్డెక్కారని తెలిపారు. హైదరాబాద్‌లో తనపై నిఘా పెట్టారని, జగన్‌రెడ్డి ఆదేశాలతో పోలీసులు తనను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. వై కేటగిరి భద్రత ఉన్న ఒక ఎంపీని లేపేయాలని చూస్తారా.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

*హవాలా బాలినేని.. ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడింది: నారా లోకేష్
హవాలా బాలినేని.. దాదాగిరీకి ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.‘‘నీ అవినీతిని ప్రశ్నిస్తే విద్యావంతులు, దళిత మేధావి.. ఎమ్మెల్యే బాలాఆంజనేయస్వామి ఇంటిపైకి రౌడీ మూకల్ని పంపుతావా?. అవినీతి చీడపురుగువి నీకే అంత పౌరుషం పొడుచుకొస్తే.. బాలాఆంజనేయస్వామి ఇంటిపైకి వచ్చిన మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు.మా ఎమ్మెల్యే స్వామి జోలికొస్తే ఖబడ్దార్’’ అని నారా లోకేష్‌ హెచ్చరించారు.

*వైసీపీ నేతలకు ఓటమి భయం: అచ్చెన్న
వైసీపీ లీడర్ నుంచి కేడర్ వరకూ ఓటమి భయం పట్టుకుందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అరాచక పాలనపై ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడియత్నం హేయమన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే తప్పా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల అక్రమాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మాపై దాడులు చేస్తే ఏం వస్తుంది? అని ప్రశ్నించారు. మూడేళ్లుగా అంగుళం అభివృద్ధి చేయని వైసీపీ నేతలను ఆ పార్టీ కేడర్ ప్రశ్నించాలని అచ్చెన్నాయుడు అన్నారు.

*వైసీపీ నేతలకు ఓటమి భయం: అచ్చెన్న
వైసీపీ లీడర్ నుంచి కేడర్ వరకూ ఓటమి భయం పట్టుకుందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అరాచక పాలనపై ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడియత్నం హేయమన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే తప్పా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల అక్రమాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మాపై దాడులు చేస్తే ఏం వస్తుంది? అని ప్రశ్నించారు. మూడేళ్లుగా అంగుళం అభివృద్ధి చేయని వైసీపీ నేతలను ఆ పార్టీ కేడర్ ప్రశ్నించాలని అచ్చెన్నాయుడు అన్నారు.

*వెంట్రుక పీకలేవు అని మాట్లాడటం సిగ్గుచేటు: పల్లె
రాష్ట్రానికి పట్టిన పెద్ద శని జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. జగన్ రెడ్డి కాదు జలగ రెడ్డి అని విమర్శించారు. సీఎంగా ఉండి వెంట్రుక కూడా పీకలేవు అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇలాంటి సీఎంని ఎన్నుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ఒక రాజధానికే దిక్కులేదు మూడు రాజధానులు ఎలా? అని ఆయన ప్రశ్నించారు.

* బీజేపీ బొందను బండి సంజయే తవ్వుతున్నారు: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
బండి సంజయ్ బట్టేబాజ్, బ్రెయిన్ లెస్ ఎంపీ‌గా మారిపోయారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. రైతులకు బండి సంజయ్ రాసిన లేఖలో అబద్దాలు తప్ప ఏమీ లేవన్నారు. నలుగురు బీజేపీ ఎంపీ‌లు తెలంగాణ‌కు నలువైపులా శనిలా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బండి సంజయ్ తెలంగాణలో పుట్టాడా గుజరాత్‌లో పుట్టాడా అనే అనుమానం కలుగుతోందన్నారు. బీజేపీ నేతలు ధాన్యం సేకరణ పై ఒక్కొక్కరు ఒక్క తరహాలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బొందను బండి సంజయ్‌యే తవ్వుతున్నాడని విమర్శించారు. పీసీసీ చీఫ్ రేవంత్ బీజేపీకి మోడీకి సామంతుడి‌లా మారారని అన్నారు. బీజేపీ ఏజెంట్‌లా రాహుల్ గాంధి ఆలోచనకు వ్యతిరేకంగా రేవంత్ పని చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. సెక్షన్ 8 గురించి మాట్లాడుతూ తెలంగాణ వ్యతిరేకిలా రేవంత్ మారారని చెప్పారు.

*అధికారం అడ్డాలోనే పుట్టా, దానిపై ఆశ లేదు: రాహుల్
అధికారం అడ్డాలోనే (సెంటర్ ఆఫ్ పవర్) తాను పుట్టానని, దానిపై ఆశ కానీ ఆకర్షణ కానీ తనకు లేవని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. జవహర్ భవన్‌లో శనివారంనాడు జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అధికారం కోసమే రాజకీయ నాయకులు నిరంతరం వెంపర్లాడుతుంటారని, తాను అధికారం అడ్డాలోనే పుట్టానని, నిజాయితీగా చెప్పాలంటే వాటిపై తనకెలాంటి ఆసక్తి లేదని చెప్పారు. దీనికి బదులు దేశ ప్రజల మనోగతాలను అవగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారని చెప్పారు. ఆ ప్రక్రియలో ప్రపంచంలోనే అంటరానితనం ఉనికి ఇప్పటికీ ఉన్న ఏకైక దేశం ఇండియా అనే విషయం తాను గ్రహించానని అన్నారు. ఈ తరహా దృక్పథం మార్చుకుని, అంటరానితనానికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తననెంతగానో ప్రేమిస్తున్న దేశ ప్రజలకు తాను రుణపడి ఉంటానని అన్నారు.

*జగన్ అసూయకు అన్నలాంటి వాడు – లోకేశ్
అసూయ పడేవారికి గుండెపోట్లు, బీపీలు వస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.అసూయ పడేవారికి గుండె పోట్లు, బీపీలు వస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సీఎం జగన్ అసూయకు అన్నలాంటి వాడని విమర్శించారు. అందుకే నాన్న, బాబాయ్కి టికెట్ తీసి పంపేశాడని దుయ్యబట్టారు. మరోసారి ఆయన అసూయతో గర్వం దాల్చాడన్న లోకేశ్.. ఈ సారి గుండెపోటు తల్లికా లేక చెల్లికా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. సీఎం జ‌గ‌న్ రెడ్డి చేత‌కాని పాల‌న‌, అవినీతి దాహం, బంధుప్రీతి వ‌ల్ల.. ఆయ‌న పార్టీ నేత‌లూ బ‌ల‌వుతున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు.

*జగన్‌ను ప్రజలు పీకేసే రోజులు దగ్గర్లో ఉన్నాయి: Payyavula
ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్‌ను ప్రజలు పీకేసే రోజులు దగ్గర్లో ఉన్నాయన్న‌ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ…క్యాబినెట్‌లో ఎంతమందని జగన్ పీకుతారో రేపు చుద్దామని…అసలు పీకేను పీకే దమ్ము జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. రాయలసీమలో ఎంత మంది మంత్రులను పీకగలరో చూద్దామని అన్నారు. ‘‘సొంత క్యాబినెట్‌ను మార్చుకోలేనివాడు.. ప్రతిపక్షాల పీకుతారా?.. రాయలసీమ ప్రాజెక్టులకు తాను ఏమి చేశారో జగన్ చెప్పాలి. జగన్ ఏమి పీకారో ఒక పుస్తకం రాస్తే.. ఏమి పీకలేదో పది పుస్తకాలు రాయొచ్చు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మీడియా, పత్రికలపై ముఖ్యమంత్రి జగన్ దాడి చేస్తే.. శంకరగిరి మాన్యాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతున్నందునే పీకుడు భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక రోడైనా వేశామని జగన్ చెప్పుకోగలరా? అని నిలదీశారు. యువత, మహిళలు, రైతుల జీవితాల్లో జగన్ వెలుగులను పీకేశారన్నారు. అటెన్ష్ కోసమే జగన్ అనుచిత భాషను ఉపయోగిస్తున్నారని పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

*చమురు మంత్రిత్వ శాఖను రద్దు చేయండి : అఖిలేశ్ యాదవ్
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలను నిరుపేదలుగా మార్చుతోందని, వారిని దోచుకుంటోందని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. చమురు మంత్రిత్వ శాఖను రద్దు చేయాలని సలహా ఇచ్చారు. అఖిలేశ్ యాదవ్ శనివారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, దురుసుతనంతో పెరుగుతున్న ఇంధనం ధరలను ప్రభుత్వ నియంత్రణలు, చట్టం, పరిపాలన లేదా నిర్వహణ నియంత్రించలేకపోతే, అంతా మార్కెట్‌కే ఆధీనంలోనే ఉంటే, పెట్రోలియం మంత్రిత్వ శాఖ వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే ఈ మంత్రిత్వ శాఖను రద్దు చేయాలన్నారు.

*శరద్ పవార్ ఇంటి వద్ద నిరసనలు నిఘా వైఫల్యమే : అజిత్ పవార్
షనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ ఇంటిపై శుక్రవారం కొందరు నిరసనకారులు రాళ్ళు విసిరిన సంఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ నేత అజిత్ పవార్ శనివారం స్పందించారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్‌టీసీ) ఉద్యోగులు శుక్రవారం శరద్ పవార్ ఇంటి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడంతోపాటు ఆ ఇంటిపై కొందరు రాళ్ళు విసిరిన సంఘటనకు కారణం నిఘా వైఫల్యమేనని అంగీకరించారు. దీనిపై దర్యాప్తునకు ఓ సీనియర్ పోలీస్ అధికారిని నియమించినట్లు తెలిపారుతమకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఎంఎస్‌ఆర్టీసీ కార్మికులు 2021 నవంబరు నుంచి సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా తమను పరిగణించాలని, ఎంఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముంబైలోని శరద్ పవార్ నివాసం వద్ద శుక్రవారం ఎంఎస్ఆర్‌టీసీ కార్మికులు ధర్నా చేశారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని, శరద్ పవార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు కొందరు ఆ ఇంటిపై రాళ్ళు విసిరారు. తమ నష్టాలకు కారణం కారణం శరద్ పవారేనని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ధర్నాలో పాల్గొన్న దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకుని, ఐపీసీలోని వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. ఎంఎస్ఆర్‌టీసీ కార్మికుల నిరసనలపై శివసేన నేత సంజయ్ రౌత్ గురువారం స్పందిస్తూ, ఈ నిరసనలు కుట్రపూరితమని ఆరోపించారు. వీటి వెనుక ఎవరు ఉన్నారో త్వరలోనే బయటపడుతుందన్నారు. ఎస్‌టీ కార్మికుల సమ్మెతో శరద్ పవార్‌కు సంబంధం లేదన్నారు. మహారాష్ట్రలో రాజకీయ, సాంఘిక వాతావరణాన్ని కల్లోలపరిచేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారన్నారు.

*పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్ పరిస్థితి: Vijayashanti
సీఎం కేసీఆర్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని బీజేపీ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. ఫేస్‌బుక్‌ వేదికగా ముఖ్యమంత్రిపై విజయశాంతి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ధర్నాలు వద్దన్న సీఎం… ఇప్పుడు స్వయంగా ధర్నాలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ నేతగా గొప్ప‌లు చెప్పుకునే కేసీఆర్… ఇప్పుడు ప్రజలు అసహ్యించుకునే స్థితికి దిగజారారని అన్నారు. అందుకే కొత్త నాటకాన్ని షూరు చేసి, తెలంగాణ ప్ర‌జ‌ల్ని మ‌రోసారి మోసం చేయాల‌ని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మీద నింద‌లు వేస్తూ రాజ‌కీయ పబ్బం గ‌డుపుకోవాల‌ని ఆలోచన చేస్తున్నారన్నారు. తెలంగాణ‌లో అన్ని అనర్థాలకు కారణం ముఖ్యమంత్రి అతి విశ్వాసమే అని అన్నారు. అబద్దాల పుట్ట అయిన కేసీఆర్ మాటల్ని ఎవరూ నమ్మడం లేదని… అందుకే కొత్తగా వడ్ల నాటకం మొదలుపెట్టారని విరుచుకుపడ్డారు. కేంద్రం ఎక్క‌డా వ‌డ్లు కొన‌నని చెప్ప‌లేదని బీజేపీ నేత స్పష్టం చేశారు. కేసీఆర్ స‌ర్కార్ కేంద్ర ప్ర‌భుత్వం మీద కావాల‌నే త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని పీకే సర్వేలో తేలినందునే పంజాబ్ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహించారు. కేసీఆర్ బీజేపీ గొంతు నొక్కాలని చూస్తే… ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఇప్ప‌టికే హుజూరాబాద్ ప్ర‌జ‌లు కేసీఆర్‌కు క‌ర్ర కాల్చి వాతపెట్టారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఉంటే అధికారపార్టీ లొసుగులు బయటపెడతార‌నే భయంతోనే సస్పెన్షన్ పేరుతో బయటకు పంపారన్నారు. రానున్న ఎన్నికల్లో హుజూరాబాద్ ఫలితాలే రాష్ట్రమంతా పునరావృతం అవుతాయని తేల్చిచెప్పారు. కుర్చీ, కుటుంబం, లక్షల కోట్ల సంపాదన కోసమే కేసీఆర్ ఆరాటపడుతున్నారని దుయ్యబట్టారు. రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే… వాళ్లు ఆ మట్టితోనే కేసీఆర్ స‌ర్కార్‌కి బొందపెట్టి తగిన బుద్ధి చెబుతారని విజయశాంతి హెచ్చరించారు

*భారత్‌ను ఏ మహాశక్తి శాసించలేదు: ఇమ్రాన్‌ ఖాన్‌
పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు తీర్పు దరిమిలా నేషనల్‌ అసెంబ్లీలో అవిశ్వాస పరీక్షకు సిద్ధమయ్యాడు ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌. అయితే దానికంటే ముందు జాతిని ఉద్దేశించి ప్రసగించాడు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. పాక్‌ ప్రజలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ ప్రధాని శుక్రవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు. తనను గద్దె దించడం వెనుక విదేశీ హస్తం ఉందన్న మాటే మరోమారు హైలైట్‌ చేసిన ఆయన.. పనిలో పనిగా మరోసారి భారత్‌పై ప్రశంసలు గుప్పించడం విశేషం.
సుప్రీం తీర్పు తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని డిప్యూటీ స్పీకర్‌ దర్యాప్తులో గుర్తించారు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం చెల్లదని ప్రకటించారు. అలాంటిది.. సుప్రీం కోర్టు కనీసం విచారణ చేపట్టినా బాగుండేది. ప్రాణ హాని ఉందన్న లేఖను సైతం కోర్టు పట్టించుకోలేదు. అయినా కోర్టు తీర్పును గౌరవిస్తాం. అమెరికా దౌత్యవేత్తలు ఇక్కడి నేతల్ని కొందరిని కలిసిన తర్వాతే.. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు తెర లేచింది. ప్రజాప్రతినిధులు గొర్రెల్లా అమ్ముడు పోయారన్నారు

*ఢిల్లీలో టీఆర్ఎస్ దర్నాకు భారీ ఏర్పాట్లు
ధాన్యం కొనుగోళ్ల అంశం పై ఢిల్లీలో పోరాటానికి సిద్ధమవుతోంది టీఆర్ఎస్ పార్టీ. వరిపోరును ఉధృతం చేసింది టీఆర్ఎస్ పార్టీ. వరుస ఆందోళనలతో హీట్ పుట్టిస్తున్న గులాబీ పార్టీ నేతలు గురువారం తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాల్లో దీక్షలు చేపట్టింది.టీఆర్ఎస్ దీక్షలతో జిల్లా కేంద్రాలన్నీ హోరెత్తాయి. దీక్షలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతుబంధు సమితి ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.సిరిసిల్లలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన నిరసన దీక్షలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ళు నిర్వహించాలని, తెలంగాణలో పండే ప్రతి గింజ కొనాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులు, కార్యకర్తల ఇళ్ళపై నల్లజెండాలు ఎగరేసి నిరసన తెలిపారు.ఏప్రిల్ 11 న ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ధర్నాకోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. భారీ స్టేజ్..ఎండ వేడిని తట్టుకునేలా టెంట్ ఏర్పాటుచేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. దేశ రైతాంగానికి మద్దతుగా గొంతెత్తే నాయకులంటూ కేసీఆర్,కేటీఆర్ ఫ్లెక్సీలు వెలశాయి. ఢిల్లీ నిరసనలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపిలు, జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఇందులో పాల్గొంటారు. ఈ ధర్నాలో పలు జాతీయ రైతు సంఘాల నేతలు,వ్యవసాయ సంఘాల నేతలు పాల్గొననున్నారు.

*జగన్‌ పాలనలో ‘విద్యుత్‌’ నాశనం: గొట్టిముక్కల
‘‘రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని జగన్‌రెడ్డి సర్వనాశనం చేశాడు. పరిశ్రమలకు పవర్‌ హాలిడే ప్రకటించడం జగన్‌రెడ్డి చేతకానితనానికి నిదర్శనం’’ అని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు విమర్శించారు. ‘‘పవర్‌ హాలిడేతో ఒక్క దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోనే 1,700 పరిశ్రమలు మూతపడ్డాయి. పరిశ్రమలు మూతపడితే రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. జగన్‌ అనాలోచిత చర్యలు, మూర్ఖపు విధానాలకు ఇప్పటికైనా స్వస్తి చెప్పాలి. తన అసమర్థతను ఒప్పుకొని పదవి నుంచి దిగిపోవాలి’’ అని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

*బూతుల మంత్రి స్థాయికి జగన్‌ దిగజారారు: వర్ల
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చివరకు బూతుల మంత్రి కొడాలి నాని స్థాయికి దిగజారి అదే భాష మాట్లాడుతున్నారని టీడీపీ ధ్వజమెత్తింది. ముఖ్యమంత్రిగా ఉండి బజారు భాష మాట్లాడటం అసహ ్యంగా ఉందని, పాలన చేతగాక నిస్పృహతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ‘‘ముఖ్యమంత్రిని నువ్వు అని ఏక వచనంతో సంబోధించారని గతంలో కేసులు పెట్టించిన వ్యక్తి ఇప్పుడు తన మాటలకు ఏం సమాధానం చెబుతారు? కొడాలి నాని, జోగి రమేశ్‌ స్థాయికి సీఎం దిగజారారా? ఇప్పుడు ముఖ్యమంత్రి వాడిన భాష చూస్తే తమ పార్టీ నేతలతో బూతులు ఆయనే మాట్లాడించినట్లు స్పష్టమవుతోంది. జగన్‌ తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బజారు భాష వాడటం హేయం’’ అని అన్నారు. ‘‘ప్రతిపక్షాలను బూతులు తిడితే కరెంటు కోతలు ఆగవు. మీ పాలన చూసిన తర్వాత ప్రజలు మీ వెంట్రుకలు పీకడం కాదు… మిమ్మల్ని నిలువులోతున పాతర వేయడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని వర్ల జగన్‌ని హెచ్చరించారు.

*పవర్‌ హాలిడే’ దురదృష్టకరం: తులసిరెడ్డి
వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్‌ హాలిడే ప్రకటించడం, పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగించాలని ఆదేశించడం దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని వలన రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోతారన్నారు. అలాగే జగనన్న వసతి దీవెన గురించి వైసీపీ ప్రభుత్వం డబ్బా కొట్టుకోవడం విడ్డూరమన్నారు. కుప్పంలో గంగమ్మ దేవస్థానం మాజీ చైర్మన్‌ పార్థసారఽథి ఆ పదవి కోసం వైసీపీ నాయకులకు లక్షలు చెల్లించడం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

*ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమలు పరారే!: యామినీశర్మ
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న అపరిపక్వ విధానాలతో పారిశ్రామికవేత్తలు తల్లడిల్లుతున్నారని ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్‌, బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి సాదినేని యామినీశర్మ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా సంక్షోభం నుంచి చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో ప్రభుత్వ నిర్ణయం పిడుగుపాటులా తాకిందన్నారు. పవర్‌హాలిడే ప్రకటనతో ప్రభుత్వ సమర్థత తెలిసిపోతోందన్నారు. ‘‘ఒక వైపు అసలు పరిశ్రమలే రావడం లేదు. మరోవైపు ఉన్నవే తరలిపోతూ, ఉపాధి ఊసే లేదు. ఈ తరుణంలో పవర్‌ హాలిడేస్‌ ఏంటి? అనధికార కరెంటు కోతలు, చార్జీల బాదుడుతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.’’ అని విమర్శించారు.

*మంత్రులు ఒరగబెట్టిందేమి లేదు: చినరాజప్ప
గత రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో మంత్రులు ఒరగబెట్టిందేమి లేదని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దుయ్యబట్టారు. శుక్రవారం కాకినాడ జిల్లా సామర్లకోటలో రాజప్ప మీడియతో మాట్లాడుతూ ప్రజలు ఐదేళ్లు పాటు పాలించమంటే రెండున్నరేళ్లు మాత్రమే అంటూ మంత్రులను మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రులంతా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రెండున్నరేళ్ల పాలన ఆంక్షలతో ఆయా శాఖలపై ఏమాత్రం పట్టు సాధించలేకపోయారన్నారు. మంత్రులందరూ కాలక్షేపం చేశారని, రానున్న కొత్త మంత్రులు కూడా ఇదే ధోరణి కొనసాగిస్తారని జోస్యం చెప్పారు. అభివృద్ధి ఆలోచన ప్రభుత్వానికి అసలు లేదని తప్పుబట్టారు. మంత్రులందరూ బూతులు తిట్టడానికే కాలం సరిపుచ్చారని చినరాజప్ప విమర్శించారు

*ఏపీలో వామపక్షాలు టీడీపీకి తోక పార్టీలు: విజయసాయి
ఏపీలో వామపక్షాలు టీడీపీకి తోక పార్టీలని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మధురవాడ భూ వ్యవహారంలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మధురవాడ భూ వ్యవహారంలో తన అల్లుడికి భాగస్వామ్యం లేదని తెలిపారు. ఏపీలో ఏది జరిగినా వైసీపీకి ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిని క్షేమించమని విజయసాయి హెచ్చరించారు. ఆ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ భాగోతం బయటపెడతామని వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఖజానాకు గండిపడేలా టీడీపీ వ్యవహరించిందనిఅసత్య ఆరోపణలు చేసినవారందరికీ నోటీసులు ఇస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.

*రైస్ మిల్లర్లతో కుమ్మకై వేల కోట్ల కుంభకోణం చేశారు: మధుయాష్కీ
తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ విమర్శలు గుప్పించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని మధుయాష్కీ డిమాండ్ చేశారు. నెపాన్ని కేంద్రంపై నెడుతూ తండ్రీకొడుకులు.. డ్రామాలు ఆడుతున్నారని మధుయాష్కీ అన్నారు. 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపడతామని మధుయాష్కీ స్పష్టం చేశారు. రైస్ మిల్లర్లతో కుమ్మకై వేల కోట్ల కుంభకోణం చేశారని మధుయాష్కీ ఆరోపించారు. ఏప్రిల్ 12న గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని మధుయాష్కీ తెలిపారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని.. రౌడీల్లా వ్యవహరిస్తున్న పోలీసుల చిట్టా రాసుకుంటున్నామని మధుయాష్కీ అన్నారు.

*జగన్‌ది ‘కిచెన్‌ కేబినెట్‌’ : రామకృష్ణ
‘‘జగన్మోహన్‌రెడ్డి మంత్రివర్గం ’కిచెన్‌ కేబినెట్‌’లా ఉంది. సీఎం జగన్‌ ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా ఎవ్వరినీ ఖాతరు చేయలేదు. ఉపముఖ్యమంత్రులు, మంత్రులు సైతం అలంకారప్రాయంగా మిగిలారు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ‘‘జగన్‌, కొంతమంది అధికారులతో ‘కిచెన్‌ కేబినెట్‌’ ఏర్పాటు చేశారు. వారితో మాత్రమే నిర్ణయాలు చేస్తున్నారు. స్వపక్షంతోసహా ఎవరితోనూ సంప్రదింపులు చేయరు. జగన్‌ ఒక్కమాటతో మంత్రులంతా రాజీనామాలు చేయడాన్ని బట్టి చూస్తే వారంతా డమ్మీలేనని స్పష్టమౌతోంద’’న్నారు. సీఎం చేసిన వెంట్రుక వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రజలపైన పెనుభారాలు మోపుతూ ఇలాగే ఇబ్బందులకు గురిచేస్తే ప్రజలే ఆయన వెంట్రుకలు పీకడమేకాదు గుండు కొట్టించేందుకు కూడా వెనుకాడరన్నారు.

*నేరాంధ్ర ప్రదేశ్‌గా రాష్ట్రం: కనకమేడల
‘‘ఆంధ్రప్రదేశ్‌ నేరాంధ్ర ప్రదేశ్‌గా మారింది. రాష్ట్రంలో దాదాపు 200 శాతం నేరాలు పెరిగాయి. ఆధారాలతో సహా నిరూపిస్తా. ఈ విషయంపై చర్చించడానికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారా?’’ అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ సవాల్‌ చేశారు. రాష్ట్రంలో నేరాల రేటుపై తాను అడిగిన ఓ ప్రశ్నకు పార్లమెంటులో కేంద్రం సమాధానం చెప్పిందని వెల్లడించారు. ‘‘వైసీపీది అవినీతి, అసమర్థ ప్రభుత్వం. వైసీపీ ఎంపీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. వైసీపీ నేతలు కేంద్రంతో లాలూచీపడ్డారు. కేసుల భయంతో కేంద్రం వద్ద మోకరిల్లుతున్నారు. గత మూడేళ్లుగా రాజధానిగా అమరావతే కొనసాగి ఉంటే అప్పులే అవసరమయ్యేవి కాదు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని కనకమేడల డిమాండ్‌ చేశారు

*ఏపీలో వామపక్షాలు టీడీపీకి తోక పార్టీలు: విజయసాయి
ఏపీలో వామపక్షాలు టీడీపీకి తోక పార్టీలని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మధురవాడ భూ వ్యవహారంలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మధురవాడ భూ వ్యవహారంలో తన అల్లుడికి భాగస్వామ్యం లేదని తెలిపారు. ఏపీలో ఏది జరిగినా వైసీపీకి ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిని క్షేమించమని విజయసాయి హెచ్చరించారు. ఆ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ భాగోతం బయటపెడతామని వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఖజానాకు గండిపడేలా టీడీపీ వ్యవహరించిందని, అసత్య ఆరోపణలు చేసినవారందరికీ నోటీసులు ఇస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు