Business

మార్కెట్లోకి మారుతి సుజుకి నయా కారు- TNI వాణిజ్య వార్తలు

మార్కెట్లోకి  మారుతి సుజుకి నయా కారు- TNI వాణిజ్య వార్తలు

* ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజుకీ త్వరలోనే అప్‌డేటెడ్‌ 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ను లాంచ్‌ చేయనుంది.ఈ కారుకు సంబంధించిన చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ ఫేస్‌లిఫ్ట్‌ కారుకు సంబంధించిన ప్రీబుకింగ్స్‌ను కూడా కంపెనీ మొదలుపెట్టింది. రూ. 11 వేల టోకెన్‌ అమౌంట్‌ను చెల్లించి కొనుగోలుదారులు 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌ ఎడిషన్‌ బుక్‌ చేసుకోవచ్చును.
*మహమ్మారి నేపథ్యంలో పెద్ద ఇళ్లకు డిమాండు బాగా పెరిగింది. దీంతో జనవరి-మార్చి త్రైమాసికంలో కోటి రూపాయల పైబడిన ధరల్లోని అపార్ట్‌మెంట్ల అమ్మకాలు జోరు గా సాగాయి. ఏడు ప్రధాన నగరాల్లో ఇలాంటి ఫ్లాట్లు 83 శాతం వృద్ధితో 10,988 అమ్ముడుపోయాయని జేఎల్‌ఎల్‌ ఇండియా తాజా నివేదికలో తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 5994 ఉన్నాయి. ఆ నగరాల్లో హైదరాబాద్‌ సహా బెంగళూరు, చెన్నై, పూణె, ముంబై, కోల్కతా, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ఉన్నాయి. రూ.1-1.5 కోట్ల విలువ గల ఫ్లాట్లు 6,187 అమ్ముడుపోగా రూ.1.5 కోట్లు పైబడిన విలువ గల ఫ్లాట్లు 4,801 అమ్ముడుపోయాయి. అన్ని రకాల ఫ్లాట్లు కలిపి దేశంలో మొత్తం అమ్మకాలు 51,849 ఉన్నాయి.
*యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఐహెచ్‌సీ) అదానీ గ్రూప్‌లోని మూడు కంపెనీల ఈక్విటీలో వాటా కోసం 200 కోట్ల డాలర్లు (సుమారు రూ.15,400 కోట్లు) పెట్టుబడి పెడుతోంది. ఇందులో సగం 102 కోట్ల డాలర్లు (సుమారు రూ.7,700 కోట్లు) అదానీ గ్రూపు ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎల్‌) ఈక్విటీలో పెట్టుబడి పెట్టనుంది. మిగతా మొతాన్ని అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీఈఎల్‌), అదానీ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌ (ఏటీఎల్‌) కంపెనీల ఈక్విటీలో పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రతిపాదనకు మూడు కంపెనీల డైరెక్టర్ల బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. వాటాదారులు, రెగ్యులేటరీ సంస్థల ఆమోదం తర్వాత ఈ పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయి
*కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలన్న ఆర్‌బీఐ నిర్ణయం మార్కెట్‌కు ఉత్తేజం ఇచ్చింది. మూడు రోజుల నష్టాలకు తెర దించిన సెన్సెక్స్‌ 412.23 పాయింట్ల వృద్ధితో 59,447.18 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 144.80 పాయింట్లు లాభపడి 17,784.35 వద్ద క్లోజయింది. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 170.49 పాయింట్లు, నిఫ్టీ 113.90 పాయింట్లు నష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్‌ షేర్లలో 4.36 శాతం లాభంతో ఐటీసీ అగ్రగామిగా ఉండగా టెక్‌ మహీంద్రా, మారుతి, హెచ్‌డీఎ్‌ఫసీ ద్వయం షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
*ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తికి ఇస్తున్న పన్ను మినహాయింపుని విపక్ష లేబర్‌ పార్టీ ప్రశ్నించింది. ఇంకా భారత పౌరసత్వం కొనసాగిస్తూ, ఆమె ఏ మేర పన్ను మినహాయింపు పొందుతున్నారో వివరణ ఇవ్వాలని అక్షతామూర్తి భర్త, బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ను లేబర్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అక్షతామూర్తి ఇప్పటికీ నారాయణ మూర్తి కుటుంబానికి చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ ‘క్యాటమరాన్‌ యూకే’లో డైరెక్టర్‌గా కొనసాగుతూ దానిపై వచ్చే ఆదాయంపై మాత్రమే బ్రిటన్‌లో పన్ను చెల్లిస్తున్నారు. భారత్‌లోని వ్యాపారాలపై మాత్రం భారత్‌లోనే పన్ను చెల్లిస్తున్నారు. బ్రిటిష్‌ చట్టాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నట్టు సునాక్‌ ఇంతకు ముందే స్పష్టం చేశారు.
*హైదరాబాద్‌కు చెందిన మైక్రోబైట్‌కు వెంచర్‌ కేపిటిలిస్ట్‌ విజయ్‌ మద్దూరి దాదాపు రూ.11 కోట్ల నిధులు అందించారు. ఈ నిధులను కొత్త బయోఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి మైక్రోబైట్‌ వినియోస్తుంది. సొంతగా అభివృద్ధి చేసిన టెక్నాలజీతో ఇక్కడ బయోఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తారని మైక్రోబైట్‌ సీఈఓ ప్రవీణ్‌ గోరకవి తెలిపారు. భారత్‌లో ఇథనాల్‌ మార్కెట్‌ 2025-26 నాటికి 250 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రవీణ్‌ చెప్పారు.
*ఈ ఆర్థిక సంవత్సరం ఫార్మా కంపెనీలకు పెద్దగా కలిసొచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరం ఆ కంపెనీల ఆదాయ వృద్ధి రేటు గత సంవత్సరంతో పోలిస్తే ఆరు నుంచి ఎనిమిది శాతం మించక పోవచ్చని ఇక్రా పేర్కొంది. గత ఏడాది ఈ కంపెనీల ఆదాయాలు ఎనిమిది నుంచి పది శాతం వరకు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం దేశీయ ఫార్మా కంపెనీల దేశీయ ఆదాయం 7-9 శాతం, వర్థమాన దేశాల ఎగుమతుల ఆదాయం 12-14 శాతం, ఈయూ దేశాల ఎగుమతుల ఆదాయం 7-9 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది. తీవ్రమైన పోటీ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అమెరికా మార్కెట్‌లో ఆదాయ వృద్ధిరేటు అంతంత మాత్రంగానే ఉంటుందని అంచనా వేసింది.
*ఈ ఆర్థిక సంవత్సరం ఫార్మా కంపెనీలకు పెద్దగా కలిసొచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరం ఆ కంపెనీల ఆదాయ వృద్ధి రేటు గత సంవత్సరంతో పోలిస్తే ఆరు నుంచి ఎనిమిది శాతం మించక పోవచ్చని ఇక్రా పేర్కొంది. గత ఏడాది ఈ కంపెనీల ఆదాయాలు ఎనిమిది నుంచి పది శాతం వరకు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం దేశీయ ఫార్మా కంపెనీల దేశీయ ఆదాయం 7-9 శాతం, వర్థమాన దేశాల ఎగుమతుల ఆదాయం 12-14 శాతం, ఈయూ దేశాల ఎగుమతుల ఆదాయం 7-9 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది. తీవ్రమైన పోటీ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అమెరికా మార్కెట్‌లో ఆదాయ వృద్ధిరేటు అంతంత మాత్రంగానే ఉంటుందని అంచనా వేసింది.
*భారత స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజూ నష్టాలనే చవి చూసింది. గురువారం సెన్సెక్స్‌ 575.46 పాయింట్ల నష్టంతో 59,034.95 వద్ద ముగియగా నిఫ్టీ 168.10 పాయింట్లు కోల్పోయి 17,639.55 వద్ద క్లోజైంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో భగ్గుమంటున్న ముడిచమురు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అంచనాల కంటే వేగంగా, అధికంగా వడ్డీ రేట్లను పెంచనున్నట్లు యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ తాజా పరపతి సమీక్ష మినిట్స్‌లో సంకేతాలివ్వడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ ప్రతికూలంగా మారింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 17 నష్టాలు చవిచూశాయి.
*హైదరాబాద్‌కు చెందిన హరిఓం పైప్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు అపూర్వ స్పందన లభించింది. మంగళవారం నాటితో కంపెనీ పబ్లిక్‌ ఆఫరింగ్‌ ముగిసే సమయానికి ఇష్యూ సైజుకు 7.93 రెట్ల బిడ్లు లభించాయి. కంపెనీ 85 లక్షల షేర్లను విక్రయానికి పెట్టగా.. 6.74 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలైనట్లు ఎన్‌ఎ్‌సఈ డేటా ద్వారా తెలిపింది. రూ.130 కోట్లు సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చిన కంపెనీ.. షేరు ధర శ్రేణిని రూ.144-153గా నిర్ణయించింది