Movies

ప్రియుడితో అస్సాంకు శృతి

Auto Draft

లవ్ లైఫ్ ను ఓపెన్ గానే ఉంచడం స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు అలవాటు. ముంబైలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా దాపరికం లేకుండా ప్రియుడితో కలిసున్న సరదా సందర్భాలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. స్పెషల్ ఈవెంట్స్ వేటినీ మిస్ అవదు. ఇలాంటి ఓ వేడుకలో పాల్గొనేందుకు ఆమె అస్సాం వెళ్తున్నట్లు సమాచారం. ఇది ఆమె ప్రియుడు శంతను హజారికా సొంత రాష్ట్రం. అస్సాంలో రొంగాలీ బిహు అతి పెద్ద ఉత్సవం. ఏటా ఏప్రిల్ రెండో వారంలో నిర్వహిస్తుంటారు. రాష్ట్ర పండుగైన రొంగాలీ బిహు వేడుకల్లో ఈ సారి పాల్గొనబోతున్నది శృతి హాసన్. వచ్చేవారం శంతను హజారికా సొంతూరు అస్సాంలోని గహువాటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఈసారి బిహు ఉత్సవాలకు శృతి హాసన్ వస్తుండటం ప్రత్యేకత తీసుకురానుంది. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ చిత్రంలో నటిస్తున్నది శృతి.