DailyDose

న్యూయార్క్‌, కెనడాలో కాల్పుల కలకలం.. ఇద్దరు విద్యార్ధులు మృతి – TNI నేర వార్తలు

న్యూయార్క్‌, కెనడాలో కాల్పుల కలకలం.. ఇద్దరు విద్యార్ధులు మృతి – TNI  నేర వార్తలు

*అమెరికాలోని న్యూయార్క్‌ (New York) వీధులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. న్యూయార్క్‌ సిటీలోని బ్రాన్స్క్‌ హైస్కూల్‌ బయట బయట ఓ దుడగుడు కాల్పులు జరిపాడు. దీంతో స్కూల్‌ నుంచి బయటకు వస్తున్న ఓ విద్యార్థిని మృతిచెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్కూల్‌ ఎదురుగా ఓ వ్యక్తి మరికొందరితో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అతడు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో స్కూల్‌ నుంచి బయటకు వస్తున్న అమ్మాయి ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. మరో ఇద్దరు కాళ్లకు గాయాలయ్యాయి. కెనడాలో జరిగిన కాల్పుల్లో భారత విద్యార్థి ఒకరు మృతి చెందారు. టొరంటో నగరంలోని సబ్‌వే స్టేషన్‌ ప్రవేశ ద్వారం వద్ద గురువారం సాయంత్రం దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత్‌కు చెందిన కార్తీక్‌ వాసుదేవ్‌ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు, ప్రత్యక్ష సాక్షులు, సీసీ టీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

*నంద్యాలజిల్లాలోని డోన్ శ్రీనివాస్ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 6 తరగతి విద్యార్థిని ఐశ్వర్యపై పంది దాడికి పాల్పడింది. ఈ దాడిలో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబీకులు భయందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పందుల బెడద లేకుండా చూడాలని స్థానికులు వాపోతున్నారు. వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

*రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టీఎన్ జీవోస్ కాలనీలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

*కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. డ్రమ్ములో మృతదేహం ఉంచి వాసన రాకుండా సిమెంట్ కంకరతో దుండగులు ప్లాస్టింగ్ చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

*కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నాగాయలంక వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అవనిగడ్డ నాగాయలంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కా తమ్ముళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గర్భిణీ అయిన అక్క దుర్గా భవానిని మోటార్ సైకిల్‌పై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి మోటార్ సైకిల్ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో దుర్గాభవానీ, ఆమె తమ్ముడు శ్రీచరణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు.

*రిమ్స్ హాస్పటల్‌లో దారుణం చోటు చేసుకుంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకూ ముగ్గురు పురిటి బిడ్డలు మృతి చెందారు. ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందింది. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతో సరైన చికిత్స అందించక పురిటి బిడ్డలు మృతి చెందారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎక్విప్‌మెంట్ సరిగా లేక తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. నిన్న రాత్రి వరకూ బాగున్న బాబు ఇప్పుడు ఆపస్మారక స్థితిలో ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిన్న నైట్ వరకూ బాగున్న పల్స్.. ఇప్పుడు డాక్టర్‌లు లేదంటున్నారు. ఒక్క మానిటర్‌తో 30 మంది పిల్లలను ట్రీట్ చేయిస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఒక్క మానిటర్ ఎంతమంది పిల్లలకు చూస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఐసీయూలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా వార్డులలో పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి అధికారులు స్పందించడం లేదు. మీడియాను రిమ్స్ ఆసుపత్రి లోనికి అనుమతించడం లేదు

*మ‌హిళ పురీష‌నాళంలో రూ. 6 కోట్ల విలువ చేసే హెరాయిన్
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంట‌ర్నెష‌న‌ల్ ఎయిర్‌పోర్టుకు ఉగాండా నుంచి వ‌చ్చిన‌ ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలి పురీష‌నాళంలో భారీగా హెరాయిన్ ఉన్న‌ట్లు క‌స్ట‌మ్స్ అధికారులు నిర్ధారించారు. ఎయిర్‌పోర్టులో దిగిన ఆమె అనుమానాస్ప‌దంగా క‌నిపించ‌డంతో.. అదుపులోకి తీసుకున్నారు.ఉగాండా నుంచి షార్జా మీదుగా ఢిల్లీ వ‌చ్చిన ఆ ప్ర‌యాణికురాలికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, ఆమె పురీషనాళంలో హెరాయిన్‌ను దాచి ఉంచిన‌ట్లు గుర్తించారు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో రూ. 6 కోట్ల విలువ చేసే 894 గ్రాముల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ యాక్ట్ కింద పోలీసులు ఆ ప్ర‌యాణికురాలిని అరెస్టు చేశారు.

*ఏలూరు: జిల్లాలోని తంగళ్లమూడి సాయిలీల అపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. షార్టుసర్క్యూట్ అవ్వడంతో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు పక్కన ఉన్న నాలుగు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో కారు స్వల్పంగా డామేజ్ అయ్యింది. ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.దీంతో అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

*రిమ్స్ హాస్పటల్‌లో దారుణం చోటు చేసుకుంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకూ ముగ్గురు పురిటి బిడ్డలు మృతి చెందారు. ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందింది. డాక్టర్లుసిబ్బంది నిర్లక్ష్యంతో సరైన చికిత్స అందించక పురిటి బిడ్డలు మృతి చెందారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎక్విప్‌మెంట్ సరిగా లేక తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. నిన్న రాత్రి వరకూ బాగున్న బాబు ఇప్పుడు ఆపస్మారక స్థితిలో ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిన్న నైట్ వరకూ బాగున్న పల్స్.. ఇప్పుడు డాక్టర్‌లు లేదంటున్నారు. ఒక్క మానిటర్‌తో  మంది పిల్లలను ట్రీట్ చేయిస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఒక్క మానిటర్ ఎంతమంది పిల్లలకు చూస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఐసీయూలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా వార్డులలో పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి అధికారులు స్పందించడం లేదు. మీడియాను రిమ్స్ ఆసుపత్రి లోనికి అనుమతించడం లేదు

*కృష్ణాజిల్లా నాగాయలంక లో ఘోర రోడ్డు ప్రమాదం.ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కాలేజ్ బస్సు కిందకు దూసుకెళ్లిన బైక్.బైక్ మీద ప్రయాణిస్తున్న చాట్రగడ్డ శ్రీ చరణ్ (17) జి. దుర్గ భవాని (22) లకు తీవ్ర గాయాలు. గాయపడిన వారిని ఇద్దరినీ 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు

*చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై ప్రమాదం..గన్నవరం శాంతి థియేటర్ సమీపం వద్ద డివైడర్ ను ఢీకొన్న లారీప్రమాదంలో రెండు భాగాలుగా విడిపోయిన లారీ..విజయవాడ వెళ్తుండగా చోటుచేసుకున్న ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు..ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

*ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులో దారుణం కన్న కొడుకుని గొడ్డలితో నరికి చంపిన తండ్రితరచు డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నాడంటూ కొడుకు బొల్లెద్దు కిరణ్ ని కత్తితో నరికి చంపిన తండ్రి గాబ్రియేలుతన మొదటి భార్య సంతానమైన కిరణ్ తన మాట వినడం లేదంటూ ఆగ్రహం చెంది నిద్రపోతున్న సమయంలో మెడపై కత్తితో నరికి చంపిన గాబ్రియేలు

*మిర్యాలగూడ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హై స్పీడ్‌తో వెళ్తున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై హనుమాన్‌పేట బైపాస్‌ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి టూ టౌన్‌ పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, 27 మంది ప్రయాణికులతో బస్సు.. హైదరాబాద్‌ నుండి బాపట్ల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్ర7మాదానికి డ్రైవర్‌ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

*వర్ధన్నపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి లారీ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‎కు తీవ్రగాయాలు కాగా, క్లీనర్ పరిస్థితి విమషంగా ఉంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కట్రియల శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*నూజివీడు మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తుక్కులూరు బైపాస్ వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*ర్ధన్నపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి లారీ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‎కు తీవ్రగాయాలు కాగా, క్లీనర్ పరిస్థితి విమషంగా ఉంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కట్రియల శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

*అనంతపురం: జిల్లాలోని పెనుకొండ మండలం కొండాపురం సమీపంలో రైలు ఢీకొని గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు రైల్వే లైన్ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 60 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల మృతితో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందంటూ గొర్రెలకాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడ వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై మిర్యాలగూడ బైపాస్ రోడ్‌లో ఓ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్తన్న బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*వర్ధన్నపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి లారీ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‎కు తీవ్రగాయాలు కాగా, క్లీనర్ పరిస్థితి విమషంగా ఉంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కట్రియల శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*ఆడుకుంటూ వెళ్లి నీళ్ల బకెట్‌లో పడి బాలుడు మృతి చెందాడు. ఎల్‌బీనగర్‌ ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం.. హయత్‌నగర్‌ లో ఉండే ఈ. లావణ్య (23), సాయి దంపతుల మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఆమె రెండేళ్ల కుమారుడితో ఎన్టీఆర్‌నగర్‌లో ఉంటున్న తాతయ్య, అమ్మమ్మల వద్ద ఉంటోంది. శుక్రవారం సాయంత్రం వాళ్లు బయటకు వెళ్లారు. కుమారుడు ఆడుకుంటుండగా ఆమె నిద్రపోయింది. కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన తాతయ్య నీళ్ల బకెట్‌లో తల కిందులుగా బాలుడు పడి ఉండడం చూశాడు. లావణ్యను నిద్ర లేపాడు. వెంటనే స్థానికుల సాయంతో బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

*ఐపీఎల్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాల‌పై పోలీసులు దృష్టి సారించారు. వ‌న‌స్థ‌లిపురంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న ఐదుగురు వ్య‌క్తుల‌ను రాచ‌కొండ పోలీసులు శ‌నివారం ఉద‌యం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురిలో ప్ర‌ధాన నిందితుడు దేవినేని చ‌క్ర‌వ‌ర్తి అని పోలీసులు తెలిపారు. ఐపీఎల్ బెట్టింగ్‌ల కోసం చ‌క్ర‌వ‌ర్తి ప్ర‌త్యేక యాప్ తయారు చేసి ఈ దందా చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.
*గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌సీసీ రోడ్డు ప్రాంతానికి చెందిన నరేంద్ర (22) అనే చోరీ కేసు నిందితుడు గురువారం ఏలూరులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నరేంద్ర ఇటీవల మంగళగిరి షరాఫ్‌ బజార్‌లో గల తన బంగారు దుకాణానికి వచ్చి రూ.19 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించాడని షాపు యజమాని కొల్లి గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

*వర్ధన్నపేట మండలం ల్యాబర్తిలో దారుణం జరిగింది. యువతిపై సర్పంచ్ పస్తం రాజుపత్తి నాగరాజు అత్యాచారం చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. యువతి గర్భందాల్చడంతో గ్రామపెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు.