DailyDose

ఏపీ మంత్రి వర్గ విస్తరణపై – TNI ప్రత్యేక కథనాలు

ఏపీ మంత్రి వర్గ విస్తరణపై – TNI ప్రత్యేక కథనాలు

*మాచర్ల నియోజకవర్గానికి మంత్రి పదవి కేటాయించకపోవడం పై మాచర్ల పట్టణ ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల మున్సిపల్ పట్టణ చైర్మన్ మరియు 30 మంది కౌన్సిలర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశమైన చైర్మన్ కిషోర్ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్రెడ్డికి అండగా ఉన్నారని సరస్వతి భూముల విషయంలోనూ ఎన్నో కష్టనష్టాలకు ఎదుర్కొన్నారని, వెనుకబడిన పలనాడు ప్రాంతానికి మంత్రి పదవి కేటాయించడంతో అభివృద్ధి చెందుతుందని ఆశించామని, రామకృష్ణా రెడ్డి కి మంత్రి పదవి కేటాయించకపోవడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు అందుకని మాచర్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామాకు సిద్ధం అవుతున్నట్లు ప్రకటించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కి మంత్రి పదవి దక్కకపోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నారు. రాజీనామాలకు సిద్ధమవుతున్నారు..
*నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం నేపధ్యంలో గవర్నర్ కాన్వాయ్ ట్రయల్ రన్. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా. సిఎం కార్యక్రమాల కమిటీ ఛైర్మన్, ఎంఎల్ సి తలశిల రఘురామ్ తో కలిసి సమీక్ష. అమాత్యుల ప్రమాణ స్వీకారంపై సాంప్రదాయాలను వివరించిన జిఎడి కార్యదర్శి ముత్యాల రాజు. ప్రో.టోకాల్ ఏర్పాట్లను సిసోడియాకు వివరించిన బాలసుబ్రమణ్య రెడ్డి.
*కొత్తగా ఏర్పడబోయే మంత్రివర్గం

1,ధర్మాన ప్రసాదరావు
(బీసీ వెలమ)
2, సిదిరి అప్పలరాజు (మత్స్యకార సామాజిక వర్గం)
3, బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)
4, పీడిత రాజన్నదొర (షెడ్యూల్ తెగలు) st
5, గుడివాడ అమర్నాథ్ (కాపు)
6, బూడి ముత్యాల నాయుడు (కొప్పుల వెలమ)
7, దాడిశెట్టి రాజా
8,చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ
9, పినిపే విశ్వరూప్
10, తానేటి వనిత (మాదిగ)
11, కారుమూరి నాగేశ్వరరావు
12, కొట్టు సత్యనారాయణ
13, జోగి రమేష్ (గౌడ)
14, అంబటి రాంబాబు (కాపు)
15, మేరుగ నాగార్జున (sc)
16, విడదల రజని (బీసీ)
17, కాకాని గోవర్ధన్ రెడ్డి
18, అంజాద్బాష
19, బుగ్గన రాజేంద్రనాథ్
20, గుమ్మనూరు జయరాం (బోయ)
21, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
22, నారాయణస్వామి (sc)
23, ఆర్ కే రోజా
24, ఉష శ్రీ చరణ్ (కురువ సామాజికవర్గం)
25, తిప్పేస్వామి,

*బీసీ 10, ఎస్సీ 5, ఎస్టీ 1, మైనారిటీ 1, కాపు 4, రెడ్డి 4,

*త్వరలో ఏర్పాటు కానున్న ఏపీ స్టేట్ బోర్డ్ డెవలప్మెంట్ బోర్డ్ కి చైర్మన్ గా కొడాలి నానీ నియమించే అవకాశం.ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కేబినెట్ హోదాలో నియామకం.

*రాష్ట్ర మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ముఖ్యమంత్రి సలహా మేరకు కొద్ది నిమిషాల క్రితం నిర్ణయం తీసుకున్న రాష్ట్ర గవర్నర్. మొత్తం 24 మంది మంత్రుల రాజీనామాలకు ఆమోదం. రాజీనామాల ఆమోదంపై విడుదల కానున్న అధికారిక గెజిట్. మరి కొద్ది సేపటిలో రాజ్ భవన్ కు నూతన మంత్రుల జాబితా. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పరిశీలన అనంతరం ఆమోదం.

*మంత్రివర్గంలో 8 జిల్లాలకు దక్కని ప్రాతినిధ్యం – గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం, అన్నమయ్య, విశాఖ, అల్లూరి, తిరుపతి, రాజంపేట జిల్లాలకు దక్కని చోటు.

*ప్రకాశం జిల్లా నుంచి ఆదీమూలపు సురేష్ కు క్యాబినెట్ లో చోటు..తిప్పేస్వామి స్థానం లొసురేశ్ కు చోటు.
*ఏపీ కేబినెట్ విస్తరణలో పలు వర్గాలకు నో చాన్స్ – కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలకు దక్కని చోటు.

*కొడాలి నాని కి వేరే పదవి
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బిసి 10 కాపు 4 రెడ్డి 4 ఎస్సీ 5 ఎస్టి 1 మైనార్టీ ఒకటి చొప్పున పదవులు ఇవ్వగా వైసిపి లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. దీంతో వారికి వేరే పదవి కల్పిస్తూ బుజ్జగిస్తున్నారు. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా కొడాలి నానికి చీప్ విప్ గా ప్రసాదరాజు డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్రస్వామి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మల్లాది విష్ణు కు చోటు కల్పించారు.

*సామినేని ఉద‌య‌భానుకి ద‌క్క‌ని మంత్రి ప‌ద‌వి – రాజీనామాకి సిద్ధ‌మ‌వుతోన్న మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్,కౌన్సిల‌ర్స్
సామినేని ఉద‌య‌భానుకి మంత్రి ప‌ద‌విలో చోటు ద‌క్క‌లేదు. దాంతో రాజీనామాకి సిద్ధ‌మ‌వుతున్నారు జ‌గ్గ‌య్య‌పేట మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్,కౌన్సిల‌ర్స్..సీనియ‌ర్ నేత అయిన సామినేని ఉద‌య‌భానుకి మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు ఉద‌య‌భాను అనుచ‌రులు. సామినేని ఉద‌య‌భాను కూడా ఈసారి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్నారు. ఆయ‌న ఆశ‌లు అడియాశ‌లే అయ్యాయి. మ‌రి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో నెక్ట్స్ స్టెప్ప్ ఏంట‌నేది తెలియాల్సి ఉంది.

*ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి జగన్ కు అండగా ఉన్నవారికి మంత్రివర్గంలో స్థానం కల్పించారా వైఎస్. జగన్ ను కోరుతున్న మాచర్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులుముకుమ్మడి రాజీనామాకు రంగం సిద్ధంముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ఎమ్మెల్యే పదవిని సైతం త్యాగం చేసి జగన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారాని మాచర్ల నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలుపుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నూతన జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అయినా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి కి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని వారు జగన్ ను కోరుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మాచర్ల చరిత్రను తిరగరసిన పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోవటం ఏమిటీ అని కార్యకర్తలు పార్టీ రాష్ట్ర అధిష్టానన్ని ప్రశ్నిస్తున్నారు. పార్టీకి సేవచేసే వారికీ పదవులు దక్కవా అంటూ పార్టీ కార్యకర్తలు నిరాశవ్యక్తంచేస్తున్నారు. విశ్వాసనీయతకు స్థానం లేదా అంటూ కార్యకర్తలు నిరాశను వ్యక్తం చేస్తూ పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.

*సీఎం జగన్‌ మంత్రివర్గ విస్తరణలో 8 కొత్త జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. వీటిలో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలు ఉన్నాయి. అయితే, కొన్ని కొత్త జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ మందికి మంత్రి పదవులు దక్కాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు; కోనసీమలో చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, పినిపె విశ్వరూప్; ప.గో.జిల్లాలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ; పల్నాడు జిల్లాలో అంబటి రాంబాబు, విడదల రజని; చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రోజాకు మంత్రి పదవులు దక్కాయి.

*సీఎం జగన్‌ మంత్రివర్గ విస్తరణలో 8 కొత్త జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. వీటిలో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలు ఉన్నాయి. అయితే, కొన్ని కొత్త జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ మందికి మంత్రి పదవులు దక్కాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు; కోనసీమలో చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, పినిపె విశ్వరూప్; ప.గో.జిల్లాలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ; పల్నాడు జిల్లాలో అంబటి రాంబాబు, విడదల రజని; చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రోజాకు మంత్రి పదవులు దక్కాయి.
Whats-App-Image-2022-04-10-at-18-13-01