NRI-NRT

ఆస్ట్రేలియా వీసా డబ్బు రిఫండ్ !

ఆస్ట్రేలియా వీసా డబ్బు రిఫండ్ !

ఆస్ట్రేలియా తమ దేశంలో పైచదువులకు వచ్చిన వివిధ దేశాల విద్యార్థులకు వీసా సొమ్ము తిరిగిస్తామని ప్రకటించింది. ఎందుకో చూడండి..

కొవిడ్ కారణంగా చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చినవారికి వీసా మొత్తం ఫీజును తిరిగి చెల్లించనుంది ఆస్ట్రేలియా. జనవరి 19, 2022 నుంచి మార్చి 19, 2022 మధ్యలో ఆ దేశానికి వచ్చిన విద్యార్థులకు ఈ అవకాశం ఉందని ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ తెలిపింది.

* ఒకవేళ విద్యార్థులు ఫిబ్రవరి 01, 2020 నుంచి డిసెంబర్ 14, 2021 వరకు ఆస్ట్రేలియాలోనే ఉన్నప్పటికీ, తాము చేరిన కోర్సును కొవిడ్ కారణంగా పూర్తి చేయలేకపోతే వారు స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీ (వీఏసీ ) ద్వారా కొత్త స్టూడెంట్ వీసాను తిరిగి పొందొచ్చు.

* రిఫండ్ ఫీజు : దాదాపు రూ.47,759/- (630 ఆస్ట్రేలియన్ డాలర్ల వరకూ ఇస్తారు.)

*చివరి తేదీ : అర్హులైన అభ్యర్థులు 31 డిసెంబర్ 2022 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

*దరఖాస్తు విధానం: విద్యార్థులు హోమ్ అఫైర్స్ రిఫండ్ పోర్టల్కి వెళ్లి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది . ఇదే కాక ఇంగ్లిష్ టెస్ట్, బయోమెట్రిక్, హెల్త్ చెకప్ కోసం కూడా అదనపు సమయాన్ని ఇవ్వనున్నారు.

ఏదైనా సందేహాలుంటే. వెబైసైట్ : https://www.studyaustralia.gov.au/india