DailyDose

బాహుబలి ఎడ్లు @ ఏలూరు

బాహుబలి ఎడ్లు @ ఏలూరు

బాహుబలి చిత్రంలో పొడవాటి కొమ్ములున్న ఎద్దులను చూశాం కదా. అలాంటివే ఏలూరు అశోక్ నగర్ లోని అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం కనిపించాయి . రెండేళ్ల కిందట ఆవరణలో తిరుపతిలోని ఇస్కాన్ మందిరం నుంచి హరినామ సంకీర్తనలతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేపట్టారు . బలరామకృష్ణులతోపాటు ప్రభుపాదుల విగ్రహాల బండిని లాగుతూ ఆకట్టుకునేందుకు ఎడ్లను వినియోగించారు . ఈ యాత్ర ఏలూరు వచ్చేసరికి కరోనా ప్రభావంతో నిలిపేయాల్సి వచ్చింది . అప్పటి నుంచి వీటిని ఇక్కడే ఉంచి ఆలనాపాలనా చూస్తున్నామని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపా అరమీటరు పొడవున్న వంపులు తిరిగిన కొమ్ములతో కనువిందు చేస్తున్నాయి . అటు వైపు వెళ్లినవారంతా వీటిని ఆసక్తిగా చూస్తున్నారు .