Business

బంగారం కొనుగోలు దారులకు భారీ షాక్‌! – TNI వాణిజ్య వార్తలు

బంగారం కొనుగోలు దారులకు భారీ షాక్‌! – TNI వాణిజ్య వార్తలు

*బంగారం కొనుగోలు దారులకు భారీ షాక్‌ తగిలింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచ దేశాల్లో బంగారం ధరల పెరగుదలకు కారణమని తెలుస్తోంది. అలాగే భారత్‌లో సైతం బంగారం ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం రోజు 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.390కి పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది. చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,190 ఉండగా..10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది. కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.48,600 ఉండగా..10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది.బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600గా ఉండగా..10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,600 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,020గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 ఉండగా ..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.53,020గా ఉంది. వైజాగ్‌లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600ఉండగా ..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.53,020గా ఉంది.

* ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కూతురు అక్షతా మూర్తి తన భర్త అయిన బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ను వివాదం నుంచి గట్టెక్కించేందుకు కీలక ప్రకటన చేశారు. భారత్‌ నుంచి ఆర్జిస్తున్న సొమ్ముతో సహా తన మొత్తం ఆదాయంపై బ్రిటన్‌లో పన్ను చెల్లించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మధ్యనే ముగిసిన పన్ను మదింపు సంవత్సరానికి కూడా తన నిర్ణయం వరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ‘‘నా వృత్తిపరమైన జీవితం, నా భర్త రాజకీయ కెరీర్‌ పూర్తిగా వేర్వేరు. ఎన్నో ఏళ్లుగా ఇన్ఫోసి్‌సలో నాకున్న వాటా కేవలం పెట్టుబడి మాత్రమే కాదు. అది నా తండ్రి కృషికి సాక్ష్యం. ఆ విషయం పట్ల నేనెంతో గర్వపడుతున్నాను. బ్రిటన్‌లో నా పన్ను హోదా నా భర్తకు సమస్యగా మారడం లేదా కుటుంబాన్ని ప్రభావితం చేయడం నాకిష్టం లేదని’’ ట్విటర్‌లో పేర్కొన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాచపల్లిలోని అన్‌రాక్‌ అల్యూమినియం లిమిటెడ్‌ (ఏఏఎల్‌)లో ఉత్పత్తి ప్రారంభమైంది. ప్లాంట్‌ నిర్మాణం పూర్తయిన పదేళ్ల తర్వాత ఉత్పత్తిని ప్రారంభించటం గమనార్హం. ఈ ప్లాంట్‌ నిర్మాణ పనులు 2007లో ప్రారంభం కాగా 2012 నాటికల్లా పూర్తయ్యాయి. కాగా అల్యూమినియం తయారీకి అవసరమైన బాక్సైట్‌ సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ)తో అన్‌రాక్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

* ధరాఘాతం వినియోగదారుల జేబులతోపాటు కంపెనీల ఆదాయానికీ గండికొడుతోంది. ఉత్పత్తుల ధరలను పెంచడంతో ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూ మర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీల విక్రయాలు మార్చితో ముగిసిన త్రైమాసికంలో గణనీయంగా తగ్గాయని బిజోమ్‌ రిపోర్టు వెల్లడించింది. గ్రామీణంతో పాటు పట్టణ మార్కెట్లలోనూ సేల్స్‌ తగ్గుముఖం పట్ట డం గమనార్హమని అంటోంది. ప్రధానంగా హోమ్‌కేర్‌ పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తులపై ప్రభావం అధికంగా కన్పించిందని ఈ రిటైల్‌ వర్తక విశ్లేషణ సంస్థ నివేదిక పేర్కొంది. ధరలు మరింత పెరగవచ్చన్న భయాలతో అధిక కొనుగోళ్లకు పాల్పడటంతో వంట నూనెలు వంటి నిత్యావసర కమోడిటీ ఉత్పత్తుల అమ్మకాలు మాత్రం పుంజుకున్నాయని తెలిపింది

* ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమావేశం టై గ్లోబల్‌ సమ్మిట్‌ టీజీఎ్‌స- హైదరాబాద్‌లో టైహైదరాబాద్‌ చాప్టర్‌ నిర్వహించనుంది. టై గ్లోబల్‌ ఆరవ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని టై హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ సురేశ్‌ రాజు తెలిపారు. ఈ సమావేశానికి 500 చాప్టర్ల సభ్యు లు, దాదాపు 1,500 మంది ఎంటర్‌ప్రెన్యూవర్లు, ఏంజి ల్‌ ఇన్వెస్టర్లు, మెంటార్లు తదితరులు హాజరవుతారు. డిసెంబరు 12 నుంచి 14 తేదీల్లో ఈ సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుందని టై గ్లోబల్‌ బోర్డ్‌ ట్రస్టీస్‌ వైస్‌ చైర్మన్‌, గ్లోబల్‌ సమిట్‌ కో-చైర్‌ మురళీ బుక్కపట్నం తెలిపారు.

* గాయత్రీ ప్రాజెక్ట్స్‌ నుంచి రుణాలు వసూలు చేసుకోవడానికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కేసు విచారణను హైదరాబాద్‌ బెంచ్‌ చేపట్టనుందని మార్కెట్‌ సమాచారం. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు గాయత్రీ ప్రాజెక్ట్స్‌ దాదాపు రూ.6,000 కోట్లు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. ఈ రుణాల్లో అధిక భాగం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఇచ్చింది. రుణాలను పునర్‌వ్యవస్థీకరించమని రుణదాతలను కంపెనీ కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొద్ది రోజుల్లో రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికపై రుణదాతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించే వీలుంది. అయితే.. కంపెనీ సమర్పించిన రుణ పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళికకు అన్ని బ్యాంకులు అంగీకరించకపోవచ్చునంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎన్‌సీఎల్‌టీ, హైదరాబాద్‌ బెంచ్‌ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

* యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఐహెచ్‌సీ) అదానీ గ్రూప్‌లోని మూడు కంపెనీల ఈక్విటీలో వాటా కోసం 200 కోట్ల డాలర్లు (సుమారు రూ.15,400 కోట్లు) పెట్టుబడి పెడుతోంది. ఇందులో సగం 102 కోట్ల డాలర్లు (సుమారు రూ.7,700 కోట్లు) అదానీ గ్రూపు ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎల్‌) ఈక్విటీలో పెట్టుబడి పెట్టనుంది. మిగతా మొతాన్ని అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీఈఎల్‌), అదానీ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌ (ఏటీఎల్‌) కంపెనీల ఈక్విటీలో పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రతిపాదనకు మూడు కంపెనీల డైరెక్టర్ల బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. వాటాదారులు, రెగ్యులేటరీ సంస్థల ఆమోదం తర్వాత ఈ పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయి.

* ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తికి ఇస్తున్న పన్ను మినహాయింపుని విపక్ష లేబర్‌ పార్టీ ప్రశ్నించింది. ఇంకా భారత పౌరసత్వం కొనసాగిస్తూ, ఆమె ఏ మేర పన్ను మినహాయింపు పొందుతున్నారో వివరణ ఇవ్వాలని అక్షతామూర్తి భర్త, బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ను లేబర్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అక్షతామూర్తి ఇప్పటికీ నారాయణ మూర్తి కుటుంబానికి చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ ‘క్యాటమరాన్‌ యూకే’లో డైరెక్టర్‌గా కొనసాగుతూ దానిపై వచ్చే ఆదాయంపై మాత్రమే బ్రిటన్‌లో పన్ను చెల్లిస్తున్నారు. భారత్‌లోని వ్యాపారాలపై మాత్రం భారత్‌లోనే పన్ను చెల్లిస్తున్నారు. బ్రిటిష్‌ చట్టాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నట్టు సునాక్‌ ఇంతకు ముందే స్పష్టం చేశారు.

* రానున్న మూడు దశాబ్దాల్లో(2031 నుండి 2060 వరకు) గ్రీన్ హైడ్రోజన్‌ను అభివృద్ధి చేసేందుకుగాను… ఆగ్నేయాసియాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు $25.2 బిలియన్ల వరకు పెట్టుబడులు అవసరమని ఇండోనేషియా ప్రభుత్వం అంచనా వేసింది. ప్రత్యేకించి… పెర్టమినా హైడ్రోజన్ అభివృద్ధి సహా స్వచ్ఛమైన శక్తి పరివర్తనను వేగవంతం చేయడంలో సహాయపడడానికి దాదాపు $ 11 బిలియన్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే… 2031 నుండి 2060 వరకు గ్రీన్ హైడ్రోజన్‌ను అభివృద్ధి చేయడానికి ఆగ్నేయాసియాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు $ 25.2 బిలియన్ల వరకు పెట్టుబడులు రానున్న ఐదు సంవత్సరాల్లో అవసరమని ఇండోనేషియా ప్రభుత్వం అంచనా వేసింది. ముఖ్యంగా, రాష్ట్ర-మద్దతుగల పెర్టమినా హైడ్రోజన్ అభివృద్ధి సహా స్వచ్ఛమైన శక్తి పరివర్తనను వేగవంతం చేయడంలో సహాయపడటానికి దాదాపు $ 11 బిలియన్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది.

* ఆంధ్రప్రదేశ్‌తెలంగాణల్లో ఓమ్నీ హాస్పిటల్స్‌ పేరుతో ఆరు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న ఇన్‌కార్‌ హెల్త్‌కేర్‌ రూ.155 కోట్ల నిధులను సమకూర్చుకోనుంది. ఆల్టర్‌నేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ ‘ఇన్వెస్టెక్‌’కు చెందిన ఎమర్జింగ్‌ ఇండియా క్రెడిట్‌ ఆపర్ట్యునిటీస్‌ ఫండ్‌ వన్‌, ఇన్వెస్టెక్‌ బ్యాంక్‌ పీఎల్‌సీ నుంచి ఈ నిధులు సమీకరిస్తున్నట్లు ఓమ్నీ గ్రూప్‌ సీఈఓ అలోక్‌ చంద్ర ముల్లిక్‌ తెలిపారు. 2010లో ఓమ్నీ హాస్పిటల్స్‌ పేరుతో సేవలు ప్రారంభించినట్టు ఇన్‌కార్‌ గ్రూప్‌ సీఎండీ సూర్య పులగం తెలిపారు.

*క్లిష్ట సమయాల్లో తీవ్రంగా కష్టపడి కంపెనీకి అండగా నిలిచిన ఉద్యోగులకు… ఓ ఐటీ సంస్థ సీఈఓ… బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందించారు. చెన్నైకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ కంపెనీ సీఈఓ… కష్ట సమయాల్లో కంపెనీకి సాయం చేసిన ఐదుగురు సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చారు. సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ కంపెనీ కిస్‌ఫ్లో ఇంక్… ఐదుగురు ఉద్యోగులకు బీమర్‌లను అందించింది. వారి విధేయత, నిబద్ధతను గౌరవించటానికి సంస్థ తన ఐదుగురు సీనియర్ మేనేజ్‌మెంట్ కార్మికులకు ఒక్కొక్కటి రూ. 1 కోటి కంటే ఎక్కువ విలువైన బీఎండబ్ల్యూ కార్లను అందించింది. ఈ ఈవెంట్‌కు కొన్ని గంటల ముందు వరకు… కార్లను అందజేసే కార్యక్రమాన్ని గోప్యంగా ఉంచారు. కిస్‌ఫ్లో ఇంక్ సీఈఓ సురేష్ సంబందం మాట్లాడుతూ… ‘ఐదుగురు ఉద్యోగులు కంపెనీ ప్రారంభమైనప్పటి నుండి ఉన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కంపెనీ ‘బంగారాన్ని తవ్వడానికి సహాయం చేసారు. కొంతమంది ఉద్యోగులు నిరాడంబరమైన నేపథ్యాల నుండి వచ్చారు. కంపెనీలో చేరడానికి ముందు గణనీయమైన సవాళ్లను ఎదుర్కొన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. కారోనా నేపథ్యంలో… వ్యాపార వాతావరణాన్ని నావిగేట్ చేయడానికి యత్నించినందున కంపెనీ పలు రోడ్‌బ్లాక్‌లను ఎదుర్కొంది. అంతేకాకుండా… కొంతమంది పెట్టుబడిదారులు ఆ సమయంలో కంపెనీ సజావుగా పని చేయడంపై సందేహాలను కూడా లేవనెత్తారు.