DailyDose

నూతన ఎన్టీఆర్ జిల్లా కు మంత్రి వర్గంలో స్థానం నిల్.

నూతన ఎన్టీఆర్ జిల్లా కు మంత్రి వర్గంలో స్థానం నిల్.

రాజకీయంగా చైతన్యవంతమైన విజయవాడ ను విస్మరించడం పై అన్ని వర్గాల్లో విస్మయం.

రాష్ట్రంలో ప్రధాన నగరం,నిన్నటి వరకు రాజధాని కేంద్రం గా ఉన్న విజయవాడకు మంత్రి మండలిలో స్థానం లేకపోవటం ఆశ్చర్యకరం.

మాజీ ముఖ్యమంత్రి,ఎన్టీఆర్ పేరిట ఏర్పడిన జిల్లా లో మంత్రి పదవికి అర్హులు లేరా? అనేది చర్చనీయాంశంగా మారిన వైనం.

2019 సాధారణ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 స్థానాల్లోవైసిపి విజయకేతనం.

గత మంత్రి వర్గం లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనుకు అవకాశం.

రాజకీయ ఉద్దండులకు కేంద్రమైన విజయవాడ ను పట్టించుకోని మొదటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

అమరావతిని ఆటకెక్కించే వ్యూహంలో భాగంగా విజయవాడ ప్రాధాన్యతను తగ్గించారని ఆరోపణలు.

జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను,తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిది ఇరువురిలో ఒకరికి తప్పక మంత్రి పదవి వస్తుందని ఎదురు చూసిన వైసిపి శ్రేణుల ఆశలు ఆడియాసలు అయిన వైనం

ఎన్టీఆర్ పేరు న ఏర్పడ్డ జిల్లాకు కాబినెట్ లో బెర్త్ లేకపోవటం ఊహించని పరిణామం.

ముఖ్యమంత్రి వై ఏస్ జగన్ నిర్ణయం. పట్ల భగ్గుమంటున్న వైసిపి క్యాడర్.

రాజీ నామాలకు సిద్దమవుతున్న వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు

మాజీ ముఖ్యమంత్రి ,తెలుగు వారి ఆత్మాభిమానం పేరుతో పార్టీ స్థాపించి 9నెలల్లో సీఎం పీఠం అధిష్టించిన చరిత్ర కారుడు దివంగత ఎన్టీఆర్ పేరుతో జిల్లా ను ఏర్పాటు చేసి ,మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం అన్న ఎన్టీఆర్ ను అవమానించడమేనని టిడిపి ,వైసిపి లోని ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన,అగ్రహం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలైన కమ్మ,కాపులకు మొండి చెయ్యి.

సీఎం జగన్ కు అత్యంత విధేయులని భావించే కొడాలి,పేర్ని నానిల్లో ఒక్కరినీ కొనసాగించక పోవటం,ఉదయభాను,రక్షణ నిధి ల్లో ఒక్కరికి చోటు ఇవ్వకపోవడం వారి అభిమానుల్లో ఆగ్రహం..

కృష్ణా జిల్లాలో బిసి వర్గానికి చెందిన జోగి రమేష్ కు అవకాశం

పార్టీ స్టాండ్ గట్టిగా విన్పించటం ,టిడిపిని దీటుగా ఎదుర్కోవడం జోగి రమేష్ కు కలిసొచ్చిన అంశాలు గా భావిస్తున్న అభిమానులు.

రేపు ఉదయం లోపు ఎన్టీఆర్ జిల్లాలో ఒకరికి మంత్రి వర్గం లో అవకాశం దక్కుతుందని ఇంకా మిగిలివున్న ఆశలు

గత కాబినెట్ లో మంత్రిగా వున్న తానేటి వనిత బదులుగా అదే సామాజికవర్గం (మాదిగ )కు చెందిన ఎమ్మెల్యే రక్షణనిధికి అవకాశం ఇస్తే బాగుండేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం

ఊహించని పరిణామాలు జరిగి తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి మంత్రి అవకాశం వస్తుందని ఆశిస్తున్న అభిమానులు.