NRI-NRT

ఆస్ట్రేలియా ప్రధాని.. వండెను ఖిచిడీ!

ఆస్ట్రేలియా ప్రధాని.. వండెను ఖిచిడీ!

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ భారతీయ వంటకం ఖిచిడీ తయారు చేశారు. భారత్‌తో ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భారతీయ వంటకాల్ని తయారుచేశారు. వాటిలో ఖిచిడీతో పాటు కొన్ని కూరలు కూడా ఉండటం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. తన కుటుంబీకులకు కూడా భారతీయ వంటలు బాగా నచ్చాయన్నారు. గతంలో ఆయన సమోసాలు కూడా తయారుచేయడం విశేషం.