DailyDose

బాలినేనిని బుజ్జగించిన సజ్జల- TNI తాజా వార్తలు

బాలినేనిని బుజ్జగించిన సజ్జల- TNI తాజా వార్తలు

* మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లారు. కేబినెట్‌ కూర్పులో చోటు కల్పించకపోవడంపై బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలిగిన బాలినేనిని బుజ్జగించాలని సజ్జలకు సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశించడంతో సజ్జల, బాలినేని నివాసానికి వెళ్లి బుజ్జగిస్తున్నారు. 10 నిమిషాల పాటు బాలినేనితో సజ్జల మాట్లాడివెళ్లారు. బాలినేనిని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కలిశారు. జిల్లాలో సీనియర్‌గా ఉన్న ‌తనకు మంత్రిపదవి వస్తుందని ఆశిస్తున్నానని ఉదయభాను తెలిపారు. బాలినేనితో ఏ అంశాలూ చర్చించలేదని ఆయన తెలిపారు.

* రుణదాతల పనితీరును సమీక్షించే క్రమంలో ఆర్ధిక శాఖా మంత్రి సీతారామన్ ఈ నెల 23 న పీఎస్‌బీల అధిపతులతో సమావేశం కానున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం(2022-23) బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత ఇది మొదటి పూర్తి సమీక్ష సమావేశం కానుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలపై రుణదాతల పనితీరు, సాధించిన పురోగతిని సమీక్షించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 23 న ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్‌బీ) అధిపతులతో సమావేశం కానున్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు ఉత్పాదక రంగాలకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులను నిర్మలా సీతారామన్ ఇప్పటికే కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్(ఈసీఎల్‌జీఎస్) సహా ఆయా విభాగాలు, ప్రభుత్వ పథకాల పురోగతిపై సమగ్ర సమీక్ష జరగనుంది.

* ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో నితీశ్ రాణాను కోల్‌కతా నైట్ రైడర్స్ 8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంత డబ్బు పెట్టి కొనుక్కున్నా అతడు ఆడుతున్నది పెద్దగా ఏమీ లేదు. 28 ఏళ్ల రాణా ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో 21, 10, 0, 8 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్‌తో కోల్‌కతా తలపడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.

* కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందిన సంఘటన ఆదివారం అనంతగిరి గుట్టలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరి గుట్ట దేవాలయం సమీపంలో కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని, నీటిని తాగేందుకు వచ్చిన మూగజీవాలను వేటాడి చంపుతున్నాయన్నారు. కుక్కలను పట్టుకోవాలని మున్సిపల్‌ అధికారులకు పలు మార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు.జింకను కుక్కలు వెంబడిస్తున్న దృశ్యాలు గమనించిన కొందరు స్థానికులు, బర్డ్స్‌ వాచర్స్‌ కుక్కల వేట నుంచి జింకను కాపాడే ప్రయత్నం చేశారు. వికారాబాద్‌ జిల్లా అటవి శాఖ అధికారికి సమాచారం ఇవ్వడంతో అటవి శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే జింక మృతి చెందింది. మృతి చెందిన జింకను అటవి శాఖ అధికారులు తీసుకెళ్లారు.

*తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కు మరోసారి అవార్డుల పంట పండింది. ఈసారి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా ఇచ్చే అవార్డులతో భాగంగా ఈ అవార్డులను ప్రకటించినట్టు అధికారులు తెలిపారు. జిల్లా, మండల, గ్రామ పంచాయతీ లకు వివిధ కేటగిరిలలో 19 అవార్డులను తెలంగాణ రాష్ట్రం సాధించిందని తెలిపారు. నాలుగు కేటగిరీల్లో 19 ఉత్తమ అవార్డులు తెలంగాణ దక్కించుకుంది. ఇందులో ఉత్తమ జిల్లా పరిషత్ గా సిరిసిల్లకు అవార్డు దక్కగా ఉత్తమ మండలాలుగా వరంగల్ జిల్లా పర్వత గిరి, పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లా తిరుమల గిరి, జగిత్యాల జిల్లా కొడిమ్యాల్ మండలాలకు అవార్డులు వచ్చాయి.

*ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం రంజిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతులను రెచ్చగొట్టి వరి వేసేలా చేసింది బీజేపీ నేతలేనని చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారంతో తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మాట్లాడారని మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడతామని రంజిత్‌రెడ్డి హెచ్చరించారు.

*ఆంధ్రప్రదేశ్‌ అవలంభిస్తున్న అనాలోచిత విధానాలతో రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఏర్పాడ్డాయని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరెంటు సమస్యలను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మకు చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ అవినీతి విధానాలతో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని ఆరోపించారు.విద్యుత్ సంస్థల పేరిట తెచ్చిన రూ.26 వేల కోట్ల అప్పులు, ఛార్జీల పెంపుతో వచ్చిన రూ. 16 వేల కోట్లను ఏమీ చేశారని ప్రశ్నించారు. విద్యుత్ కోతలు, ధరల వాతలకు ప్రభుత్వ అవినీతి విధానాలే కారణమని అన్నారు. విద్యుత్‌ కోతలతో పౌల్ట్రీ, ఆక్వా పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని వెల్లడించారు. పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల 10 లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. పీపీఏల రద్దుతో విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని బాబు మండిపడ్డారు.

*ఏపీలో కరెంట్‌ కోతలపై..జగన్‌ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. ఏపీలో సగటు విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లు మాత్రమేనని.. సాధారణంగా ప్రతీ వేసవిలో ను 204 మిలియన్ యూనిట్లకు చేరుతుందని పేర్కొంది.కానీ కోవిడ్ తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిపోయిందని.. పరిశ్రమలు, ఆర్ధిక లావాదేవీలు పూర్తి స్థాయిలో జరుగుతున్న కారణం గా 240 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం చేరిందని వెల్లడించారు.ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత వినియోగం ఇప్పుడు జరుగుతోందని… రాష్ట్రంలోని అన్ని జెన్కో యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని ప్రకటన చేసింది. ప్రస్తుత సీజన్లో రూ. 1058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశామని.. జాతీయ ఎక్స్ఛేంజీల్లో లభ్యత లేని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కొత విధించాల్సి వచ్చిందని వెల్లడించింది.ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని… లేక పోతే గ్రిడ్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. అందుకే పరిశ్రమల వినియోగంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని చెప్పామని.. ఇదీ ఇబ్బందే కానీ తప్పని పరిస్థితి అని వెల్లడించింది. వ్యవసాయ అవసరాల వినియోగించే విద్యుత్ ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉందని… ఆ తర్వాత పరిశ్రమలకు యధావిధిగా సరఫరా జరుగుతుందని పేర్కొంది.

*బ్రిటిషర్లు సైతం పంజాబ్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసేవిధంగా ప్రణాళికలు రచిస్తున్నానని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా స్పందిస్తూ, ‘‘ముందు మన ఇంటిని చక్కదిద్దండి. న్యాయమైన పరిపాలనను అందించండి’’ అని సలహా ఇచ్చారు.

*నెల్లూరు: జిల్లాలోని చుంచులూరు వైసీపీ దళిత సర్పంచ్‌కు రోజురోజుకూ బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. మర్రిపాడు జడ్పీటీసీ మల్లు సుధాకర్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ దళిత సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో అభివృద్ధి పనులు.. తాను చెప్పిన వారే చేయాలంటూ జడ్పీటీసీ హుకుం జారీ చేశారు. దళిత సర్పంచులను చిన్నచూపు చూస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. జడ్పీటీసీ ఆగడాలపై సోమవారం మర్రిపాడులో దళిత సంఘాలతో కలిసి ధర్నా చేస్తానని సర్పంచ్‌ అన్నాడు.

* బాదుడే బాదుడు పేరుతో వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఉద్యమం చేపట్టిన ప్రధాన ప్రతిపక్షం దానిని మరింత వేడెక్కించాలని నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చేవారం నుంచి ఈ ఉద్యమ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. సుమారు 5జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. లోకేశ్‌ 10 నియోజకవర్గాల్లో జరిగే నిరసన కార్యక్రమాలకు హాజరవుతారు. మరికొన్ని చోట్ల అచ్చెన్నాయుడు పాల్గొంటారు. కరెంటు సమస్యపైనా, బాదుళ్లపైనా పార్టీ యంత్రాంగం చేపట్టిన కార్యక్రమాలను చంద్రబాబు శనివారం సమీక్షించారు. కొన్నిచోట్ల ఈ కార్యక్రమాలకు నియోజకవర్గ ఇన్‌చార్జులు హాజరుకాకపోవడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పనితీరు ఎలా ఉందో కొద్ది రోజులు చూద్దామని, మార్పు కనిపించకపోతే వారిని తొలగించడానికి కూడా వెనకాడేది లేదని వ్యాఖ్యానించారు.

* జంట నగరాల పరిధిలోని వివిధ మార్గాల్లో నిలిచిపోయిన ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈ నెల 11 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్‌ రైళ్లు అన్ని మార్గాల్లోనూ యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు

* భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా చార్లె్‌సటన్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో డబుల్స్‌ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. యూఎ్‌సఏలోని సౌత్‌ కరోలినాలో శనివారం జరిగిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో సానియా-హ్రదెకా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ 6-2, 4-6, 10-8తో టాప్‌సీడ్‌ షయ్‌ జాంగ్‌ (చైనా)-కరోలిన్‌ డొలిహడ్‌ (అమెరికా) జంటపై విజయం సాధించింది.

* రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌ పి.రమేశ్‌ కుమార్‌ నేతృత్వంలో సమాచార కమిషనర్లు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్‌ పనితీరు, కేసుల పరిష్కారం గురించి గవర్నర్‌కు వివరించారు. త్వరలో వార్షిక నివేదికను అందజేస్తామని తెలిపారు. సమాచార కమిషనర్లు ఎం.రవికుమార్‌, బీవీ రమణకుమార్‌, ఐలాపురం రాజా, కె.చెన్నారెడ్డి, ఆర్‌.శ్రీనివాసరావు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

* ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన (పీఎంకిసాన్‌) లబ్ధిదారులకు ఈకేవైసీ గడువును మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఓటీపీ ప్రమాణీకరణ ద్వారా ఆధార్‌ ఆధారిత ఈకేవైసీని తాత్కాలికంగా నిలిపివేయగా, పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు ఈ-కేవైసీ గడువును పొడిగించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.

* జగనన్న విద్య దీవెన పేరిట రాష్ట్ర ప్రభుత్వం భ్రమలకు గురిచేస్తోందని వైసీపీ ఎంపీ రఘురామరాజు విమర్శించారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. గతంలోనూ విద్య దీవెనలు ఉన్నాయని, గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఇప్పుడు పెద్దగా ఇచ్చిందేమీ లేదన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాకే పిల్లలు బడికి వెళ్లినట్టు బిల్డప్‌ ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. కరోనా దెబ్బకు దేశంలో 45లక్షల మంది ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరారని చెప్పారు. ‘‘చిక్కీపై బొమ్మ ఎందుకు సీఎం గారూ… వీలైతే భారతి సిమెంట్‌పై వేయించుకోండి. నా వెంట్రుక కూడా పీకలేరని అనడమెందుకు, మీ దగ్గరకి ఎవరొస్తారు? ఇది జగన్‌ స్థాయికి తగిన మాట కాదు’’ అని రఘురామ అన్నారు. సర్పంచ్‌లు గుండు గీసుకొని రోడ్డెక్కారన్నారు. సర్పంచ్‌ల్లో వచ్చిన చైతన్యంతో తమ ప్రభుత్వం నిధులు వెనక్కు ఇస్తోందని వివరించారు. విద్యుత్తు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.

* ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న పథకాలకు స్టిక్కర్లు వేయించుకుని, రాష్ట్ర ప్రజలకు ఫోజులిస్తున్న జగన్మోహన్‌రెడ్డికి సిగ్గుందా… అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ‘జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర’లో భాగంగా శనివారం రాత్రి అనకాపల్లి జిల్లా మాడుగులలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దగాకోరు పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఆ వెంటనే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

* ప్రకాశం జిల్లాలో వైసీపీ శ్రేణులు శనివారం వీరంగం సృష్టించాయి. టీడీపీకి చెందిన కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఇంటిపై దాడికి తీవ్ర ప్రయత్నం చేశాయి. వ్యూహం ప్రకారం కొండపి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు వరికూటి అశోక్‌బాబు నాయకత్వంలో వందలాది మంది కార్యకర్తలు, పార్టీ శ్రేణులు స్వామిని దూషిస్తూ ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించారు. అది తెలిసి స్వామికి మద్దతుగా టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి వద్దకు చేరారు. ఉద్రిక్త వాతావరణ తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. స్వామి ఇంటికి బయలుదేరిన వైసీపీ శ్రేణులను మధ్యలోనే అడ్డుకున్నారు. ముఖ్య నేతలను అరెస్టు చేశారు.

* రాష్ట్రానికి చెందిన పలువురు కళాకారులు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. నృత్యం విభాగంలో ప్రముఖ నాట్య కళాకారుడు, ఆచార్య పసుమర్తి రామలింగశాస్త్రికి, అలాగే హరికథ కళాకారుడు కోటా సచ్చిదానంద శాస్త్రికి ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం అవార్డులు ప్రదానం చేశారు. రామలింగశాస్త్రి ఐదు దశాబ్దాలకుపైగా కూచిపూడి, భరతనాట్యాన్ని ప్రచారం చేస్తూ, ఎందరో కళాకారులను తీర్చిదిద్దారు. సంగీతం విభాగంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబు అవార్డును అందుకోగా జగన్‌మోహన్‌ పెనుగంటిని లలిత కళా అకాడమీ అవార్డు వరించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, లలిత కళా అకాడమీ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.

*ఏపీ మంత్రుల రాజీనామాల ఫైలు రాజ్ భ‌వన్ చేరుకుంది. కేబినెట్ విస్తరణలో భాగంగా 24 మంది మంత్రుల రాజీనామాల లేఖలతో పాటు సీఎం కవరింగ్ లెటర్‌ను జీఏడీ అధికారులు రాజ్ భవన్ కు పంపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఫైల్‌ను రాజ్ భవన్ అధికారులు గవర్నర్ ముందు పెట్టనున్నారు. వెనువెంటనే రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలపనున్నారు. ఇక కొత్త మంత్రుల జాబితా కూడా ఆదవారం మధ్యాహ్నానికి రాజ్‌భవన్‎కు చేరనుంది.

*ఏపీ మంత్రుల రాజీనామాల ఫైలు రాజ్ భ‌వన్ చేరుకుంది. కేబినెట్ విస్తరణలో భాగంగా 24 మంది మంత్రుల రాజీనామాల లేఖలతో పాటు సీఎం కవరింగ్ లెటర్‌ను జీఏడీ అధికారులు రాజ్ భవన్ కు పంపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఫైల్‌ను రాజ్ భవన్ అధికారులు గవర్నర్ ముందు పెట్టనున్నారు. వెనువెంటనే రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలపనున్నారు. ఇక కొత్త మంత్రుల జాబితా కూడా ఆదవారం మధ్యాహ్నానికి రాజ్‌భవన్‎కు చేరనుంది.

*రిమ్స్ ఆస్పత్రిలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. సరైన వైద్యం అందకే ముగ్గురు పిల్లలు చనిపోయారని నిరసన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటన సిగ్గుచేటని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* శ్రీరామ నవమిసందర్భంగా జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో జరిగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాల్లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనత్ నగర్ లోని హనుమాన్ దేవాలయం, పూల్ బాగ్ హనుమాన్ టెంపుల్, బేగంపేట లోని కేసరి హనుమాన్ తదితర దేవాలయాల్లో జరిగిన కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం ఆయా ఆలయ కమిటీలు మంత్రిని సన్మానించాయి.