Movies

ఆలియా భట్‌- రణ్‌బీర్‌ పెళ్లి

ఆలియా భట్‌- రణ్‌బీర్‌ పెళ్లి

బాలీవుడ్‌లో ఇప్పుడు ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లి గురించి తెగ చర్చ నడుస్తుంది. పెళ్లి ఎక్కడ జరుగుతుంది? ఎంతమంది అతిథులు వస్తారు వంటి పలు విషయాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి బట్టలు, నగలు దగ్గరినుంచి పెళ్లయ్యాక వెళ్లే హనీమూన్‌ స్పాట్‌ ఏదై ఉంటుంది వంటి రకరకాల అంశాలపై బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఆలియాభట్‌ సోదరుడు రాహుల్‌ భట్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పెళ్లికి కేవలం 28మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారని, వీరిలో ఎక్కువమంది కుటుంసభ్యులే అని పేర్కొన్నారు. కనిపిస్తుంది. మహేష్ భట్ మొదటి భార్య కిరణ్‌ భట్‌కు కలిగిన సంతానమే రాహుల్‌ భట్‌ అన్న సంగతి తెలిసిందే. కాగా రాహుల్‌ ప్రకటన ప్రకటన ప్రకారం బయటి వారు ఎవరికీ ఆహ్వానం ఉండదని తెలుస్తుంది. ఇక పెళ్లి వేడుక ముంబైలోని చెంబూర్‌లో జరగనున్నట్లు తెలుస్తుంది. రణ్‌బీర్‌ కపూర్‌బాంద్రా నివాసం పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుం‍ది.