Movies

నెటిజన్‌కు ఆలియా కౌంటర్‌

నెటిజన్‌కు ఆలియా కౌంటర్‌

వివాహ ముహూర్తం దగ్గర పడుతున్నా కొద్దీ వీలైనంత గోప్యత పాటిస్తున్నారు కాబోయే వధూవరులు ఆలియా భట్‌, రణబీర్‌ కపూర్‌. తమ ఇళ్ల దగ్గర భద్రతను పెంచుకున్నారు. పెళ్లి సంగతులు, ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా పెళ్లి పనుల్లో తలమునకలై ఉన్న ఈ జంటను తమ పోస్టులతో నవ్విస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఓ నెటిజన్‌ ఆలియా, రణబీర్‌ పెళ్లి జరగడం తట్టుకోలేకపోతున్నానని సరదాగా సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ జంట పెళ్లి కారు వెనక పరుగులు పెడుతున్నట్లు వీడియో క్రియేట్‌ చేశాడు. ఆలియా పక్కన తనుండాల్సిన స్థానంలో రణబీర్‌ ఉన్నట్లు ఫొటో మార్ఫింగ్‌ చేశాడు. ఏప్రిల్‌ 17న నేను.. అంటూ హార్ట్‌ బ్రేక్‌ సింబల్‌ పెట్టాడు. చూడగానే నవ్వొచ్చేలా ఉన్న ఈ పోస్టుకు ఆలియా స్పందించకుండా ఉండలేకపోయింది. నవ్వుతూ రిైప్లె ఇచ్చింది. ఇక ఈ సెలబ్రిటీ జంట పెళ్లి పనులు ఊపందుకున్నాయి. ఈ నెల 14న ఆలియా, రణబీర్‌ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు.