NRI-NRT

సందడిగా హాంగ్‌కాంగ్ ప్రవాసుల ఉగాది వేడుకలు

సందడిగా హాంగ్‌కాంగ్ ప్రవాసుల ఉగాది వేడుకలు

హాంకాంగ్ తెలుగు వారు ఘనంగా అంతర్జాలం లో ఉగాది వేడుకలను అద్భుతంగా జరుపుకున్నారు.

గత రెండు సంవత్సరాలుగా స్థానిక కోవిడ నిభందనల కారణంగా ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఉగాది వేడుకలను నిర్వహించలేక పోయారు. ఈ సంవత్సరం కూడా అలా మానలేక జూమ్ ద్వారా వైభవంగా జరుపుకొన్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కనువిందుగా ఈ వేడుకలను అంతర్జాల మాధ్యమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హాంకాంగ్ తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీమతి జయ పీసపాటి గారు ప్రారంభించగా, శ్రీమతి శాంతి మోగంటి గారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉగాది వేడుకలను ఆర్థిక కార్యదర్శి శ్రీ రాజశేఖర్ మన్నే, ట్రెజరర్ శ్రీ నర్రా వరప్రసాద్, జనరల్ సెక్రటరీ శ్రీ గరదాస్ జ్ఞానేశ్వర్ మరియు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో నిర్వహించారు.

తెలుగు ఎన్. ఆర్. ఐ idol ద్వితీయ విజేత గాయని హర్షిణీ పచ్చoటి తన అద్భుతమైన గాత్రంతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, చిన్నారుల, పెద్దలు ఎంతో ఉత్సాహంతో తమ నృత్యాలు, పాటలు ప్రదర్శించారు.

చిన్నారులు అక్షిత, దీక్షిత, ఇషిక, గుణ, స్వర్ణిక, లహరి, విద్య , సారా, జయంత్, అద్వైత్ మరియు పెద్దలు మనోజ్, శ్రీహరి బాలాదిత్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రదర్శనల్లో శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యం, కూచిపూడి నృత్యం, సుమతీ శతకాలు, శాస్త్రీయ వాయిద్యం మరియు భజన ఉండటం ఉగాది వేడుకలకు అందాన్ని ఇచ్చాయి.

అధ్యక్ష ప్రసంగంలో వ్యవస్థాపకురాలు శ్రీమతి జయ పీసపాటి మాట్లాడుతూ, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య పురోగతి గురించి మాట్లాడారు. మహమ్మారి కారణంగా ఎందరో భాదితులకు తమ సమాఖ్య మాతృభూమిలో మరియు కర్మ భూమిలో సహాయం అందచేసిందని వివరిస్తూ స్థానిక వలస కార్మికులకు సేవలు అందజేస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు సేకరించి ఆర్ధిక సహాయం అందజేసేనట్లు తెలిపారు.

ప్రతి యేటా ఉగాది వేడుకలలో ఉగాది పురస్కారాలతో విశిస్టమైన సామాజిక సేవలు చేసిన వారిని గుర్తించడం ఒక ఆనవాయతిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా, కోవిడ మహమ్మారి సమయాలలో సామాజిక మానవీయ ధృకపదంతో సేవలు అనజేస్తున్న స్థానిక భారతీయులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ రాఘవేంద్రన్, శ్రీమతి నందిని, శ్రీమతి సోనల్ శా మరియు శ్రీమతి దీప్తి రామచంద్రన్ హాజరయ్యారు. వీరు హాంకాంగ్ లో కోవిడ్ 19 సమయంలో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు అందించిన సేవలను కొనియాడి వార్లను సత్కరించారు. అలాగే హాంకాంగ్ వాస్తవ్యులైన శ్రీమతి కుంజ్ గాంధీని మరియు శ్రీమతి టెస్స లైసన్స్ ని తమ ఫేస్బుక్ గ్రూప్ “HKQSG” ద్వారా కోవిడ్ సమయంలో అందరికి అందించిన సహాయ సహకారాలను కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీ రాఘవేండ్రం మాట్లాడుతూ, తాము 2015 నుంచి తమ సేవలు ప్రారంభించినా, ఇప్పటి వరకు తమ సేవలని ఎవరు కూడా ఇటువంటి వేదికల పైన గుర్తించలేదని తమని ఆహ్వానించలేదని తెలుపుతూ, తెలుగు సమాఖ్యని అభినందించి తమ కృతజ్ఞతలను తెలిపారు.

తదుపరి తెలుగు సమాఖ్య ముఖ్య కార్యవర్గ సభ్యులు ప్రసంగించి ఉగాది వేడుకల కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేసి, కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు, పెద్దలకు అభినందనలు తెలిపారు.
ఫ్రంట్‌లైన్ కార్యకర్తలందరికీ తమ హర్షధ్వానాలతో జేజేలు తెలుపుతూ, జై తెలుగు తల్లి , జై హింద్ అనే వందనం తో ఉగాది వేడుకలని సుసంపన్నం చేస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం కలిసి విందు భోజనాలతో చేద్దామని ఆశలు వ్యక్తం చేశారు సభ్యులందరు.