DailyDose

కొత్త మంత్రి మండలి ఏర్పాటు పై – TNI కథనాలు

కొత్త మంత్రి మండలి ఏర్పాటు పై – TNI కథనాలు

1. మంత్రి వర్గంలో 8 జిల్లాలకు దక్కని చోటు
రాష్ట్ర మంత్రివర్గంలో 8 జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు లేదు. కొన్ని జిల్లాల్లో ఇద్దరికి, ముగ్గురికి కూడా చోటు దక్కింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ముగ్గురు… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, రోజా… మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో ఉన్నారు. విజయనగరం, మన్యం పార్వతీపురం, కాకినాడ, తూర్పుగోదావరి, బాపట్ల, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో చోటిచ్చారు.
4-19
2. ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు
రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం ఖరారైంది. మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. మరోసారి దళిత మహిళకు హోంశాఖ కేటాయించారు. అంజాద్‌ బాషాకు మరోసారి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. మంత్రులు కాసేపట్లో ప్రమాణస్వీకారం చేస్తారు.
**మంత్రివర్గం
*అంజాద్‌ బాషాకు మరోసారి డిప్యూటీ సీఎం పదవి
*డిప్యూటీ సీఎంలుగా రాజన్న దొర, ముత్యాలనాయుడు
*డిప్యూటీ సీఎంలుగా కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి
*రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు- ధర్మాన ప్రసాదరావు
*సీదిరి అప్పలరాజు- మత్స్య, పశు సంవర్థకశాఖ
*బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ
*రాజన్నదొర- గిరిజన సంక్షేమశాఖ, డిప్యూటీ సీఎం
*గుడివాడ అమర్నాథ్‌- పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, వాణిజ్యశాఖ
*ముత్యాలనాయుడు- పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, డిప్యూటీ సీఎం
*దాడిశెట్టి రాజా- రోడ్లు, భవనాలశాఖ, పినిపె విశ్వరూప్‌- రవాణాశాఖ
*వేణుగోపాలకృష్ణ- బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐఅండ్‌పీఆర్‌
*తానేటి వనిత- హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
*కారుమూరి నాగేశ్వరరావు- పౌర సరఫరాలు, వినియోగదారులశాఖ
*కొట్టు సత్యనారాయణ- డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ
*జోగి రమేష్‌- గృహ నిర్మాణం, మేరుగ నాగార్జున- సాంఘిక సంక్షేమం
*విడదల రజిని- వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య
*అంబటి రాంబాబు- జలవనరులశాఖ
*ఆదిమూలపు సురేష్‌- మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌
*కాకాని గోవర్థన్‌రెడ్డి- వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్‌
*పెద్దిరెడ్డి- విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ, పర్యావరణం
*ఆర్కే రోజా- టూరిజం, సాంస్కృతిక, యువజనశాఖ
*అంజాద్‌ బాషా- డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమం
*బుగ్గన రాజేంద్రనాథ్‌- ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నులు, అసెంబ్లీ
5-14
3. మంత్రి పదవి పోయినందుకు బాధగా లేదు…కానీ: Sucharitha
రెండేన్నరేళ్ల మాత్రమే మంత్రి పదవి అని జగన్ అన్న ముందే చెప్పారని మాజీ మంత్రి సుచరిత అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… మంత్రి పదవి పోయినందుకు తనకు బాధగా లేదని… కానీ కొన్ని కారణాలు బాధంచాయన్నారు. ‘‘నా వ్యక్తిగత కారణాల వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా’’ అని తెలిపారు. రాజకీయాలలో ఉన్నంత కాలంలో జగన్ వెంటే ఉంటానన్నారు. ‘‘నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. పార్టీ నేతలంతా సంయమనం పాటించాలి. నేను పదవిలో ఉన్న లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా’’ అని సుచరిత స్పష్టం చేశారు. సుచరిత వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఆందోళన విరమించారు
012
4. అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన ఎంపీ మేపిదేవి
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు ఎంపీ మోపిదేవిని వైసీపీ హై కమాండ్ రంగంలోకి దించింది. అందరికీ భవిష్యత్తులో ప్రాతినిధ్యం కల్పిస్తామని తన మాటగా చెప్పాలని మోపిదేవి ద్వారా సీఎం జగన్ సమాచారం పంపారు. దీంతో మోపిదేవి నిన్న మాజీ హోంమంత్రి సుచరిత, ఈ రోజు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని కలిశారు. అయితే మాజీ హోంమంత్రి సుచరిత మోపిదేవికి రాజీనామా లేఖ ఇచ్చారు. పదవి ఇవ్వనందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యే పార్థసారథి కూడా తన సీనియారిటీ పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానును కలవడం కోసం మోపిదేవి ప్రయత్నిస్తున్నారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జగ్గయ్యపేటలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఉదయభాను అనుచరులు రోడ్డుపై టైర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు
25-0
5. మంత్రి వర్గంలో 8 జిల్లాలకు దక్కని చోటు
రాష్ట్ర మంత్రివర్గంలో 8 జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు లేదు. కొన్ని జిల్లాల్లో ఇద్దరికి, ముగ్గురికి కూడా చోటు దక్కింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ముగ్గురు… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, రోజా… మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో ఉన్నారు. విజయనగరం, మన్యం పార్వతీపురం, కాకినాడ, తూర్పుగోదావరి, బాపట్ల, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో చోటిచ్చారు.
040
6. ఇక టీవీ షోలు చేయను: రోజా
మంత్రి అవుతున్నందుకు షూటింగ్లు మానేస్తున్నట్లు MLA రోజా తెలిపారు. ఇకపై టీవీ, షూటింగ్ పాల్గొనను. సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోను. నన్ను అసెంబ్లీలోఅడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారు. కానీ జగనన్న నన్ను రెండు సార్లు MLAగా గెలిపించి ఇప్పుడు మంత్రిని చేస్తున్నారు. మహిళ పక్షపాత సీఎం కేబినెట్లో మంత్రిగా చేయడం నా అదృష్టం’ అని చెప్పారు.
050
7. కాసేపట్లో సీఎం జగన్ వద్దకు వెళ్లనున్న బాలినేని
శ్రీనివాసరెడ్డిబాలినేనిని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు తీసుకెళ్లనున్న సజ్జల
శ్రీకాంత్ రెడ్డిబాలినేనిని తన వద్దకు తీసుకురావాలని సజ్జలకు సీఎం ఆదేశం
బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడనున్న సీఎం జగన్
అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డిని మరోసారి కలిసిన సజ్జల
విజయవాడలోని బాలినేని నివాసానికి సజ్జల
సజ్జలతో పాటు బాలినేని ఇంటికి వెళ్లిన శ్రీకాంత్‌రెడ్డి, అప్పిరెడ్డి
బాలినేని ఇంటికి వెళ్లిన తలశిల రఘురామ్‌, అనిల్‌, మాధవరావు
01222
8. ధర్మాన ప్రసాదరావు-రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
సీదిరి అప్పలరాజు- పశుసంవర్ధక,మత్స శాఖలు
బొత్స సత్యనారాయణ-విద్యాశాఖ
రాజన్నదొర-గిరిజన సంక్షేమం (డిప్యూటీ సీఎం)
గుడివాడఅమర్నాథ్-ఐటీ, పరిశ్రమలు
బూడి ముత్యాలనాయుడు-పంచాయతీరాజ్ (డిప్యూటీ సీఎం)
విశ్వరూప్-రవాణాశాఖ
చెల్లుబోయిన వేణు-ఐఅండ్ పీఆర్, బీసీసంక్షేమం, సినిమాటోగ్రఫీ
దాడిశెట్టిరాజా-రోడ్లు భవనాలు
తానేటి వనిత-హోంమంత్రి
కారుమూరినాగేశ్వరరావు-పౌరసరఫరాలు
కొట్టుసత్యనారాయణ-దేవాదాయ (డిప్యూటీసీఎం)
జోగిరమేష్-గృహనిర్మాణం
మేరుగు నాగార్జున-సాంఘికసంక్షేమం
విడదల రజనీ-మహిళా,శిశు సంక్షేమం
అంబటి రాంబాబు-జలవనరులశాఖ
ఆదిమూలపుసురేష్-మున్సిపల్ శాఖ
అంజాత్ బాషా-మైనార్టీ వ్యవహారాలు-(డిప్యూటీ సీఎం)
బుగ్గన రాజేంద్రనాథ్-ఆర్ధిక, వాణిజ్యపన్నులు, ప్రణాళిక
పెద్దిరెడ్డి-వపిద్యుత్, అటవీ, పర్యావరణం
నారాయణస్వామి-ఎక్సైజ్ (డిప్యూటీ సీఎం)
ఉషా శ్రీచరణ్-స్త్రీ శిశు సంక్షేమం
రోజా-టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ
02222
9. మేకతోటి సుచరిత
పదవుల కోసం వేంపర్లాడటం మా ఇంట వంట లేదు….అలా అయితే 2009 లో వైస్ కుటుంబం కోసం అసెంబ్లీ లో తల వంచుకొని నిలబడి, రాజీనామా చేసేవాళ్ళము కాదు….అప్పటి కాంగ్రెస్ ఎన్నో ప్రలోబాలకు గురించేసింది… వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాము… బెదిరించారు… ఆశ చూపారు…. కానీ మాకు వైస్ కుటుంబం ముఖ్యం….ఈరోజు కూడా అంతే… పదవి ముఖ్యం కాదు… కానీ ప్రతి మనిషి కి ఆత్మభిమానం,, ఓర్పు,సహనం అనేవి ఉంటాయి…అడుగులకు మడుగులు ఒత్తితే అలాగే కొనసాగే వాళ్ళము….కష్టకాలం లో పార్టీ పెట్టేటప్పుడు లేని వారు ఇప్పుడు పార్టీ అధికారాన్ని అనుభవిస్తూ పార్టీ నడిపే స్థాయిలో ఉన్నారు. అలాంటివారి అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం…ఆత్మాభిమానం కోసం బ్రతికే వాళ్ళని అవమానిస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయి అని అధిష్టానం ఇప్పటికైనా తెలుసుకోవాలని మనవి…
02555
10. పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్న బాలినేని అనుచరులు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులు బాలినేనిని కలిసి రాజీనామా ప్రకటనలు చేస్తున్నారు. సంతమాగులూరు ఎంపీపీ చిన వెంకట రెడ్డి, బాలినేనిని కలిసిన అనంతరం రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అలాగే బాలినేని అనుచరులు పార్టీ పదవులకూ రాజీనామా చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలినేని అనుచరుడు, ఎంపీపీ చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ బాలినేనికి అన్యాయం జరిగిందన్నారు. ఆయన రాజీనామా సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు భవిష్యత్ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తానే కాదు.. చాలా మంది రాజీనామాలు చేయడానికి సిద్దంగా ఉన్నారని, రాజీనామాల పరంపర కొనసాగుతోందని చిన వెంకటరెడ్డి తెలిపారు.
011223
11. జగన్ వద్దకు బాలినేని పంచాయతీ
ఏపీలో మంత్రివర్గ విస్తరణ దుమారం రేపుతోంది. మంత్రి పదవులు ఆశించిన ఆశావాహులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. కొత్త కేబినెట్‌లో మాజీ హోంమంత్రి సుచరితకు చోటు దక్కలేదు. దీంతో ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరావు కూడా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం వైసీపీ అధిష్ఠానానికి తెలియడం ఆయనను శాంతిపజేందుకు దూతలుగా ప్రభుత్వ సలహారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అప్పిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి వెళ్లారు. బాలినేని నివాసానికి చేరుకున్న నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. బాలినేని ఎంతకూ దిగిరాకపోవడంతో ఆయనను నేరుగా సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయం తెలుస్తోంది. ఇప్పటికే బాలినేనితో సజ్జల రెండుసార్లు చర్చలు జరిపారు. మరోసారి బాలినేనిని బుజ్జగించేందుకు సజ్జల యత్నిస్తున్నారు. బాలినేనిని కేబినెట్‌ నుంచి తొలగించడం… అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్‌ బై చెప్పేందుకు కూడా సిద్ధపడ్డారు. బాలినేనిని బుజ్జగించేందుకు ఆదివారం ఉదయం నుంచి రాత్రిదాకా అధిష్ఠానం తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తొలుత… ఆదివారం ఉదయం విజయవాడలోని బాలినేని నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్వయంగా వెళ్లారు. ‘ఆదిమూలపు సురేశ్‌ను కూడా తొలగిస్తున్నాం. మీ జిల్లా నుంచి ఎవరూ కేబినెట్‌లో ఉండరు’ అని సజ్జల చెప్పారు. దీంతో… బాలినేని శాంతించారు. సర్దుకుపోయేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రానికి సీన్‌ మారిపోయింది. తుది జాబితాలో ఆదిమూలపు పేరూ కనిపించడంతో బాలినేని హతాశులయ్యారు
0255533
12. కొత్త వారు 14 మందికి స్థానం..
సరిగ్గా 34 నెలల రెండు రోజులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్నారు. అధికారం చేపట్టిన కొత్తలోనే.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తానని సీఎం బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో కొంత జాప్యం చోటుచేసుకున్నప్పటికీ, ఈ నెల 7వ తేదీన 24 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించారు. అనుభవం, సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్‌ జగన్‌.. పాత, కొత్త కలయికతో కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. పాత మంత్రివర్గంలోని 11 మందిని మళ్లీ మంత్రివర్గంలో తీసుకుంటుండగా, కొత్తగా 14 మందికి స్థానం కల్పించారు.
2-24
13. కొత్త, పాత మంత్రులకు తేనీటి విందు
ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగుతారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందు ఉంటుంది. కాగా, ఆదివారం రాత్రి కొత్త మంత్రులు జాబితాను సీఎం కార్యాలయం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపించింది. అంతకు ముందే గవర్నర్‌ 24 మంది పాత మంత్రుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారికంగా పత్రికా ప్రకటన జారీ చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు 24 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించారని, ఇది వెంటనే అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు 24 మంది మంత్రుల శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉంటాయని పేర్కొన్నారు.