Movies

తల్లి కాబోతున్న ప్రణిత

తల్లి కాబోతున్న ప్రణిత

అత్తారింటికి దారేది’తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన బాపుగారి బొమ్మ, నటి ప్రణీత గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాను తల్లి కానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేశారు. భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసిన ఆమె .. “నా భర్త 34 వ పుట్టినరోజు నాడు .. దేవతలు మాకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు” అని పేర్కొన్నారు. ప్రణీత పెట్టిన పోస్ట్ పై పలువురు సినీ ప్రముఖులు , అభిమానులు స్పందిస్తున్నారు. ఈ జంటకు అభినందనలు చెబుతూ కామెంట్స్ పెట్టుకున్నారు. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లోనూ ప్రణీత పలు సినిమాల్లో నటించారు. ‘అత్తారింటికి దారేది పాండవులు పాండవులు తుమ్మెద’, ‘బ్రహ్మోత్సవం’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాలు నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కరోనా సమయంలోనూ పేదల కోసం ఆమె తనవంతు సాయం చేశారు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని గతేడాదిలో వివాహం చేసుకున్నారు.