Movies

అందాల ఆరబోతకు మళ్ళీ సిద్ధమైంది !

అందాల ఆరబోతకు మళ్ళీ సిద్ధమైంది !

మాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కు వచ్చిన భామ మాళవిక మోహనన్‌. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘పేట్ట’ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. ఆపై విజయ్‌ ‘మాస్టర్‌’లో నటించింది. ఆ తరువాత హీరో ధనుష్‌ నటించిన ‘మారన్‌’ చిత్రంలో కథానాయికగా నటించినప్పటికీ, ఇందులో హీరోతో ఒక్క పాటలోనూ రొమాన్స్ ఒలికించలేదు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్ర కథలో పెద్దగా బలం లేకపోవడంతో ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో నిరుత్సాహానికి లోనైన మాళవిక కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంటూ సోషల్‌ మీడియాకు దూరంగా ఉంది.

ప్రస్తుతం ఈమెకు సరైన అవకాశాలు కూడా లేవు. దీంతో ఈమె ఛాన్సుల కోసం మళ్ళీ అందాల ఆరబోతకి సిద్ధమైంది. ‘మారన్‌’ తర్వాత ఆమె చేసిన స్పెషల్‌ ఫొటో షూట్‌ ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అవకాశాల కోసం ఇదే సరైన మార్గంగా మాళవిక భావిస్తోంది. మళవిక ప్రస్తుతం ఓ హిందీ మూవీలో కథానాయికగా నటిస్తోంది. సినిమా పేరు యుధ్ర. సిద్ధార్ధ్ చతుర్వేది, రాజ్ అర్జున్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నఈ సినిమాకి రవి ఉధయవర్ దర్శకుడు. మరి మళవికా మోహనన్‌కు ఫోటో షూట్స్ వల్ల భారీ చిత్రాల్లో అవకాశాలేమైనా వస్తాయేమో చూడాలి.