Devotional

అయోధ్యలో వైభవంగా సీతారాముల కళ్యాణం

Auto Draft

సీతారాముల కల్యాణం చూడాలని ప్రతి ఒక్క భక్తుడు ఎదురు చూస్తారు. ఎందుకంటే తమ ఆరాధ్య దైవం కల్యాణం కనులారా తిలకిస్తే తమ జన్మకు సార్ధకత చేకూరుతుందని వారి ప్రగాఢ విశ్వాసం. అయితే రామయ్య కల్యాణం ఉత్తర భారతదేశంలో ఒక విధంగా, దక్షిణ భారతదేశంలో మరో విధంగా నిర్వహిస్తుంటారు. సరయు నది ఒడ్డున ఉన్న అయోధ్యలో మార్గశిరశుక్లపంచమి నాడు, పావన గౌతమి నది తీరాన ఉన్న భద్రాచలంలో చైత్రశుద్ద నవమి నాడుజగన్నాథుడి కల్యాణం నిర్వహిస్తారు.అయోధ్యలో స్వామి కల్యాణం పంచాహ్నికంగా నిర్వహిస్తే, భద్రాద్రిలో నవాహ్నికంగా నిర్వహించడం సంప్రదాయంగా ఉంది. ఈ క్రమంలో అయోధ్య,భ ద్రా ద్రిలో స్వామి కల్యాణం ఏ విధంగా నిర్వహిస్తారో అందిస్తున్న ప్రత్యేక కథనం.అయోధ్యలో పంచాహ్నికంగా…ఉత్తర భారతదేశంలోని అయోధ్యలో తులసీదాస్‌ రచించిన శ్రీరామచరిత మానస్‌ ఆ ధారంగా స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. ఈ కల్యాణం ఐదు రోజుల పాటు నిర్వహించడం అక్కడి సంప్రదాయం. ఇందులో భాగంగా తొలి రోజున మృత్సం గ్రహణాన్ని మహిళలు నిర్వహిస్తారు. రెండు, మూడు రోజుల్లో పితృదేవతాహ్వానం, ధాన్యం దంచుతారు. నాలుగో రోజున పంచాంగ పూజ, ఐదో రోజున సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ఈ కల్యాణం సూర్యాస్తమ సమయంలో ఊరేగింపుగా వెళ్లి జన్మస్థలం నుంచి కల్యాణ వేదిక వద్దకు స్వామి వారిని తీసుకొస్తారు. ఈ క్రమంలో కల్యాణం తెల్లవారుజామున 4 గంటల వరకు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా జన్మది నం నాడు అయోధ్య రాముడికి ప్రత్యేక పూజా కార్య క్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బాల రాముడి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం, ఊయల్లో స్వామి వారిని ఆసీనులను చేసి మంగళహారతులు పాడుతారు. ఇదే సమయంలో కృష్ణాష్టమి మాదిరే జన్మదినం నాడు స్వామి వారికి అలాగే ధనియాలు వేయించి చెక్కర, ఇతర త్రా వాటితో కలిపి ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని ‘సూతికా గృహ ప్రసాద్‌’ అంటారు. భద్రాద్రిలో జన్మదినం నాడే జగన్నాఽథుడి కల్యాణంపాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పురుషోత్తమ సంహితలో యస్యావతార సమయః తస్య కల్యాణమాచరేత్‌లో పేర్కొన్న విధంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచం ద్రస్వా మి కల్యాణం జన్మదినం నాడే జరగడం విశేషం. భద్రాద్రిలో స్వామి వారు ఏ రోజున వెలిసారు అనే విషయంపై స్పష్టమైన వివరాలు లేకపోవడంతో భక్తరామదాసు తన గురువుగారైన రఘునాధ్‌భట్టార్‌ను సం ప్రదించారు. ఆయన సూచన మేరకు జన్మదినం నాడే స్వామి వారి కల్యాణం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉగాది నుంచి శ్రీరామనవమి వసంతపక్ష ప్రయుక్త బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు