DailyDose

ఈనెల 12న తెలంగాణ కేబినెట్ సమావేశం – TNI తాజా వార్తలు

ఈనెల 12న తెలంగాణ కేబినెట్ సమావేశం  – TNI తాజా వార్తలు

* తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 12వ తేదీ మంగళవారం జరనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2గంటలకు జరిగే సమావేశానికి మంత్రులతో పాటు చీఫ్ సెక్రకటరీ పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, కీలకమైన అంశాలపై సమావేశంలో చర్చించి కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

*అమర్‌నాథ్‌ యాత్ర కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం
అమర్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు యాత్ర రద్దయ్యింది. ఈ ఏడాది జూన్‌ 30న యాత్ర ప్రారంభం కానుండగా.. దేశంలో కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో భక్తులను అనుమతించేందుకు దేవస్థానం బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నది. యాత్రికుల కదలికలను ట్రాక్‌ చేయనుండగా.. యాత్రికుల భద్రత కోసం వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.అయితే, అమర్‌నాథ్‌ యాత్ర కోసం దేవస్థానం బోర్డు (SASB) వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా 566 చోట్ల పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ సందర్భంగా దేవస్థానం బోర్డ్‌ మార్గదర్శకాలను జారీ చేసింది. 13 సంవత్సరాల కంటే తక్కువ, 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారు రిజిస్ట్రేషన్‌కు అర్హులు కాదని పేర్కొంది. ఆరు వారాలు దాటిన గర్భిణులకు సైతం అవకాశం లేదని పేర్కొంది. రిజిస్ట్రేషన్‌ కోసం shriamarnathjishrine.com వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఆ తర్వాత ‘రిజిస్ట్రేషన్‌ ఆన్‌లైన్‌’పై క్లిక్‌ చేస్తే కొత్త ట్యాబ్‌ ఓపెన్‌ అవుతుందని.ఇందులో రిజిస్టర్‌ క్లిక్‌ చేసి.. అవసరమైన అన్ని వివరాలు ఇవ్వాలని సూచించింది. ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 316 బ్రాంచ్‌లలో అమర్‌నాథ్‌ యాత్ర రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైందని జమ్మూ సర్కిల్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ యతీందర్‌ కుమార్‌ పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు ఎస్‌ఏఎస్‌బీ సూచించిన ఆసుపత్రిల నుంచి తప్పనిసరిగా ధ్రువీకరణపత్రం, నాలుగు ఫొటోలతో పాటు రూ.120 ఫీజు చెల్లించాలన్నారు. జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌తో పాటు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన పలు బ్రాంచ్‌ల్లోనూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉందని అ ధికారులు పేర్కొన్నారు.

*సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మరోసారి సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిని చేపట్టనుండడం వరుసగా మూడోదఫా కానుంది. పార్టీలో అత్యున్నత వ్యవస్థ అయిన పొలిట్‌బ్యూరోకు తొలిసారిగా దళిత నేత ఎన్నిక కావడం ఇంకో విశేషం. కేరళలోని కన్నూర్‌లో నిర్వహించిన సీపీఎం 23వ కాంగ్రెస్‌ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, పార్టీలో అత్యున్నత స్థాయి కమిటీలైన పొలిట్‌బ్యూరో, సెంట్రల్‌ కమిటీల సభ్యులకు 75 ఏళ్ల గరిష్ఠ వయో పరిమితిని నిర్ధరించారు. ఆ వయస్సు సమీపించిన, దాటిన వారిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. 17 మంది సభ్యులు ఉండే పొలిట్‌బ్యూరోలోకి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్‌ దళిత నేత రామచంద్ర దోమేను తీసుకున్నారు. కేరళ ఎల్‌డీఎఫ్‌ కన్వీనర్‌ ఎ.విజయరాఘవన్‌, ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ అధ్యక్షుడు అశోక్‌ ధావలేలకు అవకాశం ఇచ్చారు. వయో పరిమితి కారణంగా ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, హన్నన్‌ మొల్లా, బిమన్‌ బసులను తొలగించారు. ఈ కమిటీలో ప్రకాశ్‌ కారాట్‌, బృందా కారాట్‌, మాణిక్‌ సర్కార్‌, పినరయ్‌ విజయన్‌, బి.వి.రాఘవులు వంటి వారు కొనసాగుతున్నారు. సెంట్రల్‌ కమిటీ సభ్యుల సంఖ్యను 95 నుంచి 85కు తగ్గించారు. కొత్తగా 17 మందికి అవకాశం కల్పించారు. కమిటీలోకి మరో ముగ్గురు మహిళలను తీసుకోవడంతో మొత్తం స్త్రీల సంఖ్య 17కు పెరిగింది. కాగా, ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ మతతత్వ విధానాలను అనుసరిస్తున్న బీజేపీని ఓడించడమే లక్ష్యమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకిక వాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

*జగన్ కొత్త కేబినెట్‌పై శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత మంత్రులు చేసింది ఏమీ లేదు..కొత్త మంత్రులు ఏమి చేస్తారో తెలియదని అన్నారు. జగన్‌కి తలలు ఊపే బ్యాచ్‌నే పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ‘మంత్రులు మీ కాళ్ల మీద మీరు నిలబడాలి.. లేకుంటే కాలగర్భంలో కలిసిపోతారు’ అని శైలజానాథ్‌ అన్నారు.

*తెలంగాణలో ‌రాష్ట్రపతి పాలన విధిస్తేనే రైతులు బాగుపడతారని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సోమవారం రాములమ్మ మీడియాతో మాట్లాడుతూ…. బీజేపీ ప్రభుత్వం వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్‌కు రైతులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.స్పెషల్‌ ఫ్లైట్స్‌లో పక్క రాష్ట్రాలకు తిరగడానికి డబ్బుంది కానీ.. పంట కొనడానికి కేసీఆర్‌ సర్కార్‌ దగ్గర డబ్బు లేదా? అని విజయశాంతి ప్రశ్నించారు.

*ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ నేతలు సోమవారం రైతు దీక్ష చేస్తున్నారు. ‘‘కేసీఆర్ వడ్లు కొను.. లేదా గద్దె దిగు’’ నినాదంతో బీజేపీ శ్రేణులు రైతు దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, డీకే అరుణ, మురళీదరరావు రైతు దీక్షలో పాల్గొన్నారు. నాంపల్లి కోర్టు కేసు నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దీక్షలో ఆలస్యంగా పాల్గొన్నారు.

*సీఎం జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే నాకు మంత్రి పదవి రాలేదు.. నామినేటెడ్ పదవులు పొంది.. సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరిగే వారే నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని భావిస్తున్నాను-వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను

*ధాన్యం కొనుగోలుపై ఇకనైనా కేంద్రం కళ్లు తెరవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేంద్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి అవలంభిస్తోందన్నారు. రైతుల నడ్డి విరిచేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం ప్రతి గింజా కొంటామంటేనే రైతులు వరి వేశారని చెప్పారు. కేసీఆర్ 24 గంటల గడువు తర్వాత నిర్ణయం ఉంటుందని కవిత వ్యాఖ్యానించారు.

*జగన్ కొత్త కేబినెట్‌పై శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత మంత్రులు చేసింది ఏమీ లేదు..కొత్త మంత్రులు ఏమి చేస్తారో తెలియదని అన్నారు.జగన్‌కి తలలు ఊపే బ్యాచ్‌నే పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ‘మంత్రులు మీ కాళ్ల మీద మీరు నిలబడాలి.. లేకుంటే కాలగర్భంలో కలిసిపోతారు’ అని శైలజానాథ్‌ అన్నారు

*ఏడేళ్లలో తెలంగాణ రైతుల కోసం..కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి మురళీధరన్‌ అన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్ల కోసం దీక్ష చేస్తారన్నారు.నీళ్లు లేకుంటే ధాన్యం ఉత్పత్తి కష్టమన్నారు. రైస్ మిల్లర్ల యజమానులతో టీఆర్‌ఎస్‌ నేతలు..ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాదు.. కరప్షన్‌రావు, కమీషన్‌రావు అని మురళీధరన్‌ సెటైర్లు వేశారు.

*తెలంగాణలో ‌రాష్ట్రపతి పాలన విధిస్తేనే రైతులు బాగుపడతారని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సోమవారం రాములమ్మ మీడియాతో మాట్లాడుతూ…. బీజేపీ ప్రభుత్వం వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్‌కు రైతులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.స్పెషల్‌ ఫ్లైట్స్‌లో పక్క రాష్ట్రాలకు తిరగడానికి డబ్బుంది కానీ.. పంట కొనడానికి కేసీఆర్‌ సర్కార్‌ దగ్గర డబ్బు లేదా? అని విజయశాంతి ప్రశ్నించారు.

*ఎన్టీఆర్: జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణంలో వైసీపీ నేత ఉదయభాను అనుచరులు అడుగడుగునా హల్ చల్ చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై కార్యకర్తలు పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తున్నారు. ఉదయభానుకు మంత్రివర్గంలో స్థానంపై పట్టణంలో అనుచరుల ఆందోళనకు దిగారు. వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు జగ్గయ్యపేట పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు.

*మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నివాళులర్పించారు. ‘‘కుల వ్యవస్థను కూకటివేళ్లతో పెకళించాలనే ఉద్యమానికి ఆద్యుడు, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపూలే. దేశంలో మొదటిసారిగా దళితులకు, బాలికలకు, స్త్రీలకు పాఠశాలలు ప్రారంభించిన ఆశాజ్యోతి. విద్యతోనే జ్ఞానం అభివృద్ధి సాధ్యమని నమ్మి ఆచరణలో పెట్టిన మహనీయులు జ్యోతిబా. దురాచారాలకు వ్యతిరేకంగానూ, వివిధ వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన ఉద్యమాలు నేటి తరాలకు ఆదర్శం. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను’’ అని లోకేష్ తెలిపారు.

*అనకాపల్లి: జిల్లాలోని చోడవరంలో వైసీపీ నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ధర్మశ్రీకి మంత్రి పదవి రాలేదంటూ ధర్మశ్రీ వర్గీయులు, వైసీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వడ్డాదిలో నాలుగు రోడ్ల కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ వైసీపీ నేతలు రాజీనామా లేఖలను చూపించారు.

*తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం దీక్ష ప్రారంభమైంది. ‘‘తెలంగాణ రైతుల పక్షాన నిరసన దీక్ష’’ పేరుతో టీఆర్‌ఎస్‌ దీక్ష చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షలో పాల్గొన్నారు. ధాన్యం సేకరణలో ఒకే విధానం ఉండాలనే డిమాండ్‌తో దీక్ష చేపట్టారు. టీఆర్‌ఎస్‌ దీక్షలో రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ పాల్గొన్నారు.

*మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సమసమాజ స్థాపనకు జ్యోతిబాపూలే జీవితం అంకితం చేశారన్నారు. జ్యోతిబాపూలే ఆశయ స్ఫూర్తితో స్థాపించిన పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. బీసీలతో టీడీపీది విడదీయలేని అనుబంధమన్నారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అనే వాస్తవం ఎవరూ కాదనలేనిదని చంద్రబాబు స్పష్టం చేశారు.

*భద్రాచలంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పర్యటన కొనసాగుతోంది. కాగా గవర్నర్‌ పర్యటనలో ప్రొటోకాల్‌ వివాదం నెలకొంది. గవర్నర్‌ పర్యటనకు కలెక్టర్‌, ఎస్పీ గైర్హాజరయ్యారు. మరోవైపు భద్రాద్రి పర్యటలో భాగంగా సీతారామస్వామిని తమిళిసై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామి వారికి తమిళిసై పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మిథిలా స్టేడియంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.

*రాష్ట్ర మంత్రివర్గంలో 8 జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు లేదు. కొన్ని జిల్లాల్లో ఇద్దరికి, ముగ్గురికి కూడా చోటు దక్కింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ముగ్గురు… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, రోజా… మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో ఉన్నారు. విజయనగరం, మన్యం పార్వతీపురం, కాకినాడ, తూర్పుగోదావరి, బాపట్ల, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో చోటిచ్చారు

*చదువు, ఆస్తుల కంటే మనిషికి గుణం ముఖ్యమని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ క్యాంపస్‌ రిలేషన్స్‌ హెడ్‌ ఆశిష్‌ భల్లా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను యాజమాన్యం ఆదివారం సత్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆశి్‌షభల్లా మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని దానికి మనం ప్రతినిధులుగా ఉండటం గొప్ప విషయమని తెలిపారు. మన దేశానికి ఇప్పుడు కావాల్సింది ఒట్టి ఇంజనీర్లుకాదని, విలువలతో కూడి ఇంజనీర్ల అవసరం ఉందన్నారు. టీవీఎస్‌ సుందరం లిమిటెడ్‌ సీనియర్‌ ప్లాంట్‌ ఇంచార్జ్‌ హెచ్‌ఆర్‌ అరవల్లి పవన్‌కుమార్‌ మాట్లాడుతూ.. జీవితం మనం అనుకున్నంత తేలికైనదేం కాదని, విద్యార్థులు శ్రమనే నమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. విజ్ఞాన్‌ వర్సిటీ విద్యార్థులు ఈ ఏడాది 1,314 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాఽధించడం గర్వకారణమని తెలిపారు. వీసీ ఆచార్య పి.నాగభూషణ్‌, కన్వీనర్‌ డి.విజయకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

*సామాన్యుడికి కరెంట్‌ షాక్‌ తగిలింది. అతడి ఇంటికి నెలకు ఏకంగా రూ.64,211 కరెంట్‌ బిల్లు వచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని ముక్కడిపేటకు చెందిన అబ్దుల్‌ హసీబ్‌ ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి ప్రతినెలా కరెంట్‌ బిల్లు రూ.500 నుంచి 600 వచ్చేది. మార్చి నెలకు సంబంధించి ఏకంగా రూ.64,211 బిల్లు రావడంతో షాక్‌ తిన్నాడు. ఆ బిల్లును తీసుకెళ్లి, విద్యుత్‌ అధికారులకు చూపించాడు. దీనిపై ట్రాన్స్‌కో ఈఈ భూపతిని వివరణ కోరగా.. సాంకేతిక సమస్యతో బిల్లు అధికంగా వచ్చిందని, దానిని సరిచేసి, ఎన్ని యూనిట్లు వాడారో ఆమేరకు కొత్త బిల్లు ఇస్తామని చెప్పారు.

*రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసి వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. తిరుపతి విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇళ్లలో ఒక ఫ్యాను, బల్బు కూడా వెలిగించుకోలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. చార్జీలు పెంచడమే కాకుండా.. కోతలు విధిస్తూ ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తోందన్నారు. రాయలసీమ నుంచి యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోయే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల మందికిపైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. బాధిత కుటుంబాల్లో భరోసా నింపడానికి పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రూ.5కోట్ల విరాళం ప్రకటించారన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలురైతు ఇంటికీ వెళ్లి రూ.లక్ష వంతున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఈ నెల 12న అనంతపురం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకూ తీసుకెళ్తామని, ప్రభుత్వ తీరును ఎండగడతామని చెప్పారు.

*న్‌రెడ్డిని రక్షించడానికి సకుటుంబంగా శ్రమిస్తుంటారు. తన దారిలో ఉన్నాడనే ముఖ్యమంత్రి ఆయనను మంత్రిగా కొనసాగిస్తున్నారు’’ అని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. కమీషన్లతో విద్యా శాఖను మంత్రి సురేశ్‌ కొల్లగొట్టారని ఆరోపించింది. టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్‌ రాజు ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పఽథకం పనుల్లో కమీషన్లు, కోడిగుడ్ల కంట్రాక్టులో వాటాలు, పల్లీ చిక్కీ కంట్రాక్టర్ల వద్ద వసూళ్లు, టీచర్ల బదిలీల్లో చేతివాటంతో మంత్రి సురేశ్‌ రూ.వందల కోట్లు పిండేశారు. విద్యార్థుల యూనిఫారాలు, బ్యాగులు, బూట్లు, పుస్తకాల్లో కూడా కోట్ల రూపాయలు వెనకేసిన చరిత్ర ఆయనది. విద్యా శాఖలో ఆదిమూలపు ట్యాక్స్‌ పెట్టి ప్రైవేటు విద్యా సంస్థల నుంచి భారీగా పిండారు. ఇంజనీరింగ్‌ కళాశాలలు, ప్రైవేటు డిగ్రీ, జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు ఈ మూడేళ్లలో వందల కోట్లు ఆయనకు చదివించుకున్నాయి’’ అని రాజు ఆరోపించారు. మార్కాపురంలో జార్జి ఇంజనీరింగ్‌ కళాశాల పేరుతో 90 ఎకరాలు కబ్జా చేశారని, పుల్లల చెరువులో 289 ఎకరాలు, గిద్దలూరులో 327 ఎకరాలు, త్రిపురాంతకంలో 365 ఎకరాలు, డోర్నాలలో 205 ఎకరాలు, పెద్దారవీడులో 330 ఎకరాలు, ఎర్రగొండపాలెంలో అసైన్డ్‌ భూములు ఆక్రమించారని అన్నారు. సురేశ్‌ అవినీతి విలువ రూ.2,000 కోట్లు ఉంటుందని వెల్లడించారు. జగన్‌రెడ్డి మాదిరిగానే సురేశ్‌ కూడా ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారని, అందుకే ఎన్నిఆరోపణలు వచ్చినా ఆయనపై ముఖ్యమంత్రి ఆపేక్ష చూపిస్తున్నారని అన్నారు.

*ఒంగోలులో బాలినేని అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పులో బాలినేనికి చోటు దక్కలేదని స్పష్టకావడంతో ఆయన అనుచరులు మంగమురు జంక్షన్‌లో ఆందోళనకు దిగారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బాలినేనికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ బాలినేని అనుచరుల నినాదాలు చేశారు

*హిందువులు ఘనంగా జరుపుకొనే శ్రీరామ నవమి వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని ఓ దర్గాలో ముస్లింలు నిర్వహించి మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. మండలంలోని సత్యనారాయణపురం దర్గాలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ దర్గాలోని మాలిక్‌ సీతారాముల కల్యాణాన్ని హిందూ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ వేడుకల్లో హిందూ, ముస్లిం కుటుంబాలు పాల్గొన్నాయి. సోమవారం శ్రీరామ పట్టాభిషేకాన్ని కూడా నిర్వహించనున్నారు.

* రాష్ట్రంలో సోషల్‌ స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో ‘సోషల్‌ ఇంప్యాక్ట్‌ బూట్‌-2022’ (ఎస్‌ఐబీ-2022) శిబిరాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. టి-హబ్‌, తెలంగాణ సోషల్‌ స్టార్టప్‌ నెట్‌వర్క్‌ల సంయుక్త సహకారంతో టీఎ్‌సఐసీ చేపట్టనున్న ఎస్‌ఐబీ-2022 కార్యక్రమం వివరాలను ఆదివారం ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ ప్రకటించారు. వ్యాపార రంగంలో సామాజిక అంశాలతో పాటు పర్యావరణ ప్రగతిపై దృష్టిపెట్టేలా సోషల్‌ స్టార్ట్‌పలు, ఎంటర్‌ప్రైజె్‌సలకు 4 వారాలపాటు ఈ ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్‌ఐబీ శిబిరంలో పాల్గొనదల్చిన వారు ఈనెల 15 వరకు టినీయూఆర్‌ఎల్‌.కామ్‌/ఎ్‌సఐబీ2022 వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కేటీఆర్‌ సూచించారు.

*ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు భారీగా డిమాండ్‌ ఉందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. కచ్బో డిజైన్‌ స్టార్టప్‌ వ్యవస్థాపకులు నిషిత్‌ పారిఖ్‌రాజ్‌కుమార్‌ కేవత్‌ రూపొందించిన మడతబెట్టే ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను ఆదివారం హైదరాబాద్‌ బంజరాహిల్స్‌లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ-వాహనాల మార్కెట్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందనిఈ నేపథ్యంలో ఆంత్రప్రెన్యూర్లకు తమ ప్రభుత్వం మద్దతుగా ఉంటుందన్నారు. కచ్బో డిజైన్‌ వ్యవస్థాపకులు నిషిత్‌ పారిఖ్‌రాజ్‌కుమార్‌ కేవత్‌లు మాట్లాడుతూ భవిష్యత్‌లో జనం కార్ల వినియోగం మానేస్తారన్నారు. ప్రపంచంలోనే మొదటిసారిగా మడతబెట్టే ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను (హార్న్‌ బ్యాక్‌) ను తాము అందుబాటులోకి తీసుకువచ్చామనిదీని గరిష్ఠ వేగం గంటకు కిలోమీటర్లని తెలిపారు. సెకన్లలోనే ఈ సైకిల్‌ను మడతబెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని చెప్పారు. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే కిలోమీటర్లు ప్రయాణించవచ్చన్నారు. త్వరలో దీనిని మార్కెట్‌లోకి తీసుకువస్తామని తెలిపారు.

*ఏపీ మంత్రివర్గంలో స్థానం లభించకపోవటంతో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అలకపాన్పు ఎక్కారు. ఎవరితో మాట్లాడకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసి మార్కాపురంలోని నివాసంలో ఉండిపోయారు. వచ్చిన నాయకులు, కార్యకర్తలను కలిసేందుకు ఇష్టపడటం లేదని అన్నా రాంబాబు అనుచరులు తెలిపారు.ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులు నిరసన కొనసాగిస్తున్నారు. అన్నా రాంబాబుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కంభంలో ఆయన అనుచరుల రాస్తారోకో నిర్వహించారు. ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలుపుతున్నారు.

*జనగామ జిల్లాలోని జఫర్గడ్ మండలం ఉప్పుగల్లులో దారుణం జరిగింది. పాత గొడవలతో కేశోజు రాజేష్ అనే యువకుడి ఇంటిపై 15 మంది దాడి చేశారు. ఇంటి తలుపులు, బైక్, ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బా ధ్వంసం చేశారు. ఫైనాన్స్ కోసం తీసుకొచ్చిన డబ్బులు ఎత్తుకెళ్లారని బాధితులు ఆరోపించారు. గతంలో సిగరెట్ విషయంలో వివాదం తలెత్తిందని, దాన్ని మనసులో పెట్టుకుని గొడవ చేశారని పోలీసులు చెబుతున్నారు. గతంలో వీరిపై కేసులు నమోదు అయినట్లు చెప్పారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 15 మందిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.