DailyDose

కోడలిని వేధింపులకు గురిచేసిన వైసీపీ నేత – TNI నేర వార్తలు

కోడలిని వేధింపులకు గురిచేసిన వైసీపీ నేత – TNI  నేర వార్తలు

* నెల్లూరు జిల్లాలోని కావలిలో దారుణం జరిగింది. వైసీపీ నేత, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు షాహుల్ హమీద్, ఆయన కుటుంబ సభ్యుల ఘాతుకానికి పాల్పడ్డాడు. కోడలిని తీవ్ర వేధింపులకు గురిచేయడంతో పాటు… ఇరవై రోజులు పాటు ఇంట్లో నిర్భంధించారు. ఆపై కోడలిని కొట్టి ఇంట్లో నుంచి తరిమేశారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు దిశా యాప్‌ను ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. బాధితురాలి తండ్రి హెడ్ కానిస్టేబుల్ అయినప్పటికీ పోలీసులు కనికరించలేదు. వైసీపీ నేత, ఆయన కుటుంబ సభ్యులకే పోలీసులు వత్తాసు పలుకుతున్నారు.

*యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని రామ‌న్న‌పేట‌లో భారీ చోరీ జ‌రిగింది. హోట‌ల్ వ్యాపారి కుకుడాల ల‌క్ష్మారెడ్డి ఇంట్లో అర్ధ‌రాత్రి దొంగ‌లు ప‌డ్డారు. ఇంట్లో ఉన్న 32 తులాల బంగారం, 35 తులాల వెండి, రూ. 2.76 ల‌క్ష‌ల న‌గ‌దును దొంగ‌లు అప‌హ‌రించారు. ఇవాళ ఉద‌యం ఇంటికొచ్చిన ల‌క్ష్మారెడ్డి త‌న నివాసంలో చోరీ జ‌రిగిన‌ట్లు గుర్తించాడు. దీంతో బాధిత వ్య‌క్తి ల‌క్ష్మారెడ్డి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దొంగ‌ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

*నంద్యాలలో దారుణం జరిగింది. నిషేధిత స్థలంలో మద్యం సేవించరాదని వారించిన హోంగార్డు శేఖర్‌ను గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. స్థానిక కేంద్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శేఖర్‌ విధుల్లో ఉండగా నలుగురు యువకులు కార్యాలయంలోకి వెళ్లారు. అనుమతి లేకుండా ఎందుకు వచ్చారని ఆ యువకులతో వారించడంతో అతడిపై ఎదురు దాడికి దిగారు.

*విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై కంకిపాడు బైపాస్ రోడ్డు వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం కారు అగ్నికి ఆహుతైంది. విజయవాడ నుంచి బంటుమిల్లి వెళ్తున్న క్రమంలో కంకిపాడు బైపాస్ రోడ్డు వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్నవారు.. కారును రహదారిపై నిలిపి పరుగులు తీశారు. ఎవరికీ గాయాలు కాలేదు. కారులో మంటలు వ్యాపించడంతో జాతీయ రహదారిపై కొంత సమయంపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

*కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసిన ప్రబుద్ధుడు.పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వైనం.మాయమాటలు చెప్పి బాలికను లొంగతీసుకున్న ప్రసన్న కుమార్.ప్రేమించి గర్భవతిని చేసిన ప్రసన్న కుమార్ అనే యువకుడు.పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి మేరీ శైలజ.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

*ఝార్ఖండ్‌లోని త్రికూట్‌ హిల్‌వేలో ఉన్న రోప్‌వే కేబుల్ కార్‌లలో దాదాపు 48 మంది చిక్కుకుపోయారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ఘటన జరిగింది. త్రికూట్‌ హిల్‌వే మంచి టూరిస్ట్ డెస్టినేషన్. వందలాది మంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ కేబుల్ కార్ స్పెషల్ అట్రాక్షన్. చాలామంది టూరిస్టులు రోప్‌వే కేబుల్ కార్‌లలో ఎక్కుతుంటారు. ఆదివారం సెలవు రోజు కావడంతో చాలామంది కేబుల్ కార్ ఎక్కారు. అయితే, సాయంత్రం ఐదు గంటల సమయంలో రెండు కేబుల్ కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లన్నీ గాలిలోనే నిలిచిపోయాయి. 18 కేబుల్ కార్లు రోప్ వేలకు వేలాడుతున్నాయి. అయితే, సిబ్బంది కొన్ని కార్లలోని టూరిస్టులను ఎలాగోలా బయటకు తీయగలిగారు. అయినప్పటికీ 18 కార్లలో మొత్తం 48 మంది ఇంకా చిక్కుకుపోయి ఉన్నారు. సోమవారం ఉదయం పదకొండు గంటల వరకు కూడా టూరిస్టులు ఇంకా అలాగే చిక్కుకుని ఉన్నారు. వీరికి ఆహారం, మంచినీళ్లు మాత్రం అందించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు టూరిస్టులను క్షేమంగా తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు.

*బిహార్ పశ్చిమ చంపారణ్ జిల్లాలో మైనర్పై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాత వరుస అయ్యే పొరుగింటి వ్యక్తి(60) బాలికపై చాలా రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు తెలియకుండా బాధితురాలి కుటుంబ సభ్యులతో పంచాయతీలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గ్రామపెద్దలు వృద్ధుడికి రూ.2లక్షలు జరిమానా విధించి బాధితురాలి కుటుంబానికి అందజేశారు. దీంతో వారు పోలీస్ స్టేషన్లో కేసు వాపస్ తీసుకున్నారు. 6 నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వచ్చింది.

*దేశ రాజధాని దిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.60 కోట్లు విలువైన 15.05 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

*జనగామ: జిల్లాలోని జఫర్గడ్ మండలం ఉప్పుగల్లులో దారుణం జరిగింది. పాత గొడవలతో కేశోజు రాజేష్ అనే యువకుడి ఇంటిపై 15 మంది దాడి చేశారు. ఇంటి తలుపులు, బైక్, ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బా ధ్వంసం చేశారు. ఫైనాన్స్ కోసం తీసుకొచ్చిన డబ్బులు ఎత్తుకెళ్లారని బాధితులు ఆరోపించారు. గతంలో సిగరెట్ విషయంలో వివాదం తలెత్తిందని, దాన్ని మనసులో పెట్టుకుని గొడవ చేశారని పోలీసులు చెబుతున్నారు. గతంలో వీరిపై కేసులు నమోదు అయినట్లు చెప్పారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 15 మందిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

*ఝార్ఖండ్‌లోని త్రికూట్‌ హిల్‌వేలో ఉన్న రోప్‌వే కేబుల్ కార్‌లలో దాదాపు 48 మంది చిక్కుకుపోయారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ఘటన జరిగింది. త్రికూట్‌ హిల్‌వే మంచి టూరిస్ట్ డెస్టినేషన్. వందలాది మంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ కేబుల్ కార్ స్పెషల్ అట్రాక్షన్. చాలామంది టూరిస్టులు రోప్‌వే కేబుల్ కార్‌లలో ఎక్కుతుంటారు. ఆదివారం సెలవు రోజు కావడంతో చాలామంది కేబుల్ కార్ ఎక్కారు. అయితే, సాయంత్రం ఐదు గంటల సమయంలో రెండు కేబుల్ కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లన్నీ గాలిలోనే నిలిచిపోయాయి. 18 కేబుల్ కార్లు రోప్ వేలకు వేలాడుతున్నాయి. అయితే, సిబ్బంది కొన్ని కార్లలోని టూరిస్టులను ఎలాగోలా బయటకు తీయగలిగారు. అయినప్పటికీ 18 కార్లలో మొత్తం 48 మంది ఇంకా చిక్కుకుపోయి ఉన్నారు. సోమవారం ఉదయం పదకొండు గంటల వరకు కూడా టూరిస్టులు ఇంకా అలాగే చిక్కుకుని ఉన్నారు. వీరికి ఆహారం, మంచినీళ్లు మాత్రం అందించినట్లు అధికారులు తెలిపారు.

*యాదాద్రి జిల్లాలోని రామన్నపేటలో హోటల్ వ్యాపారి కుకుడాల లక్ష్మారెడ్డి ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. దాదాపు 32 తులాల బంగారం, 35 తులాల వెండి, రూ. 2.76 లక్షల నగదును దుండగులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*గుజరాత్ రాష్ట్రంలోని భారుచ్ జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం సంభవించిన పేలుడులో ఆరుగురు కార్మికులు మరణించారు. అహ్మదాబాద్ నగరానికి 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ పారిశ్రామికవాడలోని కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో అక్కడ సమీపంలో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు మరణించారు. కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపు చేశామని భారుచ్ జిల్లా ఎస్పీ లీనా పాటిల్ చెప్పారు. రియాక్టర్ పేలుడులో అక్కడే పనిచేస్తున్న కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పేలుడుకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

*వరంగల్‌ కాశిబుగ్గలో ఆన్‌లైన్‌ ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు బెట్టింగ్‌రాయుళ్లను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ సంతోష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాశిబుగ్గ శివాలయం ప్రాంతానికి చెందిన తోట సాయివిశాల్‌, ఎల్‌బీనగర్‌కు చెందిన బొట్ల ప్రభుకిరణ్‌లు కొన్ని యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు సైబర్‌ క్రైం విభాగం నుంచి సమాచారం వచ్చింది. వారిపై నిఘా పెట్టి ఇద్దరిని అరెస్టు చేసి సెల్‌ఫోన్‌న్లు స్వాధీనం చేసుకోగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. వారి నుంచి రూ.50వేల నగదుతో పాటు రెండు ద్విచక్రవాహనాలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చెప్పారు. వీరిపై గేమింగ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి ఇంతేజార్‌గంజ్‌ పోలీసులకు అప్పగించామన్నారు. ఈదాడులలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో పాటు ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు పాల్గొన్నారు.

*వెల్దుర్తి మండలంలోని అల్లుగుండు గ్రామానికి చెందిన ఊరువాకిలి వెంకటేశ్వర్లు (55) అనే రైతు పురుగు మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భార్య రామలక్ష్మమ్మ వివరాల మేరకు.. వెంకటేశ్వర్లుకు మూడెకరాల పొలం ఉంది. దీన్ని సాగు చేసుకోవడంతో పాటు కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. మూడెకరాల్లో మూడు సంవత్సరాలుగా పత్తి సాగు చేస్తున్నాడు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో బ్యాంకులో రూ.50వేల రుణం, గ్రామస్థుల వద్ద రూ.6లక్షల అప్పు మిగిలింది. మూడు రోజులుగా అప్పులవాళ్ల ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో భార్యతో చెప్పుకుని మథనపడేవాడు. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పత్తి పంటకు తెచ్చిన పురుగుల మందు తాగాడు. వెంటనే గమనించిన చుట్టుపక్కల వాళ్లు పొలంలో ఉన్న భార్యకు సమాచారమిచ్చారు. వెంకటేశ్వర్లును కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామ్మోహనరెడ్డి తెలిపారు.

*కన్న కొడుకే తండ్రిని హతమార్చిన ఘటన దుర్గి మండలం అడిగొప్పులలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చల్లా అంజయ్య(65) రోజూ మద్యం సేవించి ఇంట్లో వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విసుగు చెందిన కుమారుడు బ్రహ్మయ్య ఆదివారం కొడవలితో అంజయ్య తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అపస్మారకస్థితిలో ఉన్న అంజయ్యను మాచర్ల పట్టణంలోని వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ పాల్‌ రవీందర్‌ తెలిపారు.

*పశువుల పాకలో ఎద్దులను కాపాడేందుకు వెళ్లిన అన్నదమ్ములు గం గన్న(రామచంద్ర (విద్యుదాఘాతంతో మృతి చెందారు. అనంతపురం జిల్లా డీ హీరేహాళ్‌ మండలం చెర్లోపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గంగన్నరామచంద్ర ఉమ్మడి ఇంట్లో ఉంటున్నారు. ఇంటి పక్కనే రేకులతో వేసిన పశువుల పాకలో రెండు ఎద్దులను కట్టేశారు. తెల్లవారుజామున ఎద్దులు అరుస్తుండటంతో మేల్కొన్న అన్నదమ్ములిద్దరూ పశువుల పాకవైపు వెళ్లారు. తొలుత వెళ్లిన గంగన్న తలకు షెడ్డు రేకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని కాపాడేందుకు తమ్ముడు రామచంద్ర అన్నను పట్టుకుని లాగాడు. దీంతో ఇద్దరూ కరెంటు షాక్‌కు గురై.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రేకుల షెడ్‌పై ఉన్న వైర్ల నుంచి విద్యుత్‌ సరఫరా అయిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

*పల్నాడు జిల్లా కారంపూడి మండలం గాదెవారిపల్లెకి చెందిన యువ రైతు బైర్రెడ్డి శ్రీనివాసరెడ్డి (38) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఎకరం పొలంతోపాటు 8 ఎకరాలను రెండేళ్లుగా కౌలుకు తీసుకొని మిర్చి, కంది సాగు చేశాడు. పంటలకు తెగుళ్లు సోకి దిగుబడి సరిగా రాకపోవడంతో సుమారు రూ.10 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. సూసైడ్‌ నోట్‌లో ఎవరికి ఎంత అప్పు ఉన్నదీ రాసి రెండ్రోజుల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు గాలించగా.. తన పొలంలోనే చెట్టుకు శ్రీనివాసరెడ్డి ఉరి వేసుకున్నట్టు ఆదివారం గుర్తించారు.

*ఆదివారం సెలవు.. ఇంట్లో హాయిగా ఆడుకుంటున్న పిల్లలు నాన్న బయటకు బయలుదేరడంతో మేమూ వస్తామని మారాం చేశారు. బైక్‌పై వెళ్తుండగా రోడ్డుపక్కన తాటిముంజలు చూసి బండి ఆపించారు. పిల్లలు అడిగారు కదా.. అని బండి పక్కన ఆపి పిల్లలిద్దరినీ బైక్‌పై కూర్చోబెట్టి ముంజలు తినిపిస్తున్నాడు. ఇంతలో.. ఓ కారు అదుపుతప్పి మృత్యువులా దూసుకొచ్చింది. రెప్పపాటులో తాటిముంజలు అమ్ముతున్న పాకను ఢీకొట్టి అక్కడున్న వారిని ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రిఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

*ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభ్యంకాని ఇంపీరియల్‌ బ్లూ బ్రాండ్‌ మద్యాన్ని ఎన్టీఆర్‌ జిల్లాలోని బెల్ట్‌ షాపులో ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంచికచర్ల నుంచి గొట్టుముక్కల వెళ్లే మార్గంలో బేతపూడి కృష్ణ నిర్వహిస్తున్న బెల్టు షాపుపై ఆదివారం దాడులు చేసిన ఎస్‌ఈబీ అధికారులు.. 180 ఎంఎల్‌ సీసాలు 55, 750 ఎంఎల్‌ సీసాలు ఐదు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై ఏపీ ప్రభుత్వ ముద్ర ఉంది. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభ్యంకాని ఈ బ్రాండ్‌.. బెల్ట్‌ షాపుల్లో దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది నకిలీ మద్యమేనని స్థానికులు చెబుతున్నారు.

*శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. సీతారాముల కల్యాణం నిర్వహించిన అనంతరం ఆలయంలో భజన జరుగుతుండగా.. బొలేరో వాహనం వేగంగా లోపలికి దూసుకొచ్చింది. అది ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా భజన చేసేందుకు మండలంలోని తుమ్మలపల్లికి చెందిన ఆదినారాయణ సహా 20 మంది ఆదివారం రాత్రి పల్లిపాడుకు వచ్చారు. వారంతా కలిసి భజన ప్రారంభించిన కొద్దిసేపటికే.. పల్లిపాడు నుంచి దిద్దుపుడి వైపు వెళ్తున్న బొలోరో వాహనం అదుపుతప్పి ఆలయంలోకి దూసుకొచ్చింది. అది ఢీకొనడంతో ఆదిరానాయణ కుమార్తెలు పగడాల సహస్ర (9), పగడాల దేదీప్య (8) మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలోనే ఉన్న మరో బాలిక అలేఖ్య, బొలేరో వాహన డ్రైవర్‌, అతడి పక్కన కూర్చున్న వ్యక్తి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

*రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటుండగా.. కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఇద్దరు పిల్లలతో పాటు తండ్రిని కబళించింది. విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం గౌరీపురం వద్ద విశాఖ-అరకు రహదారిపై ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారుల తల్లి, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడకు చెందిన ఓ కుటుంబం అరకు నుంచి కారులో తిరిగి వస్తుండగా అదుపు తప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలం శివలింగపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కిల్లో సోనాపతి ఎస్‌.కోటలో ఉంటున్నారు. ఆదివారం భార్యాపిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై శివలింగపురం వెళ్తూ మార్గమధ్యలో తాటిముంజలు కొనేందుకు రోడ్డు పక్కన ఆగారు. అప్పుడే వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆయన పిల్లలు శ్రావణ్‌(7), సుహాస్‌(4) ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సోనాపతి(38)ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. ఆయన భార్య శ్రావణి తీవ్రగాయాలతో విశాఖలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ద్విచక్రవాహనంపై ఉన్న ఎస్‌.కోట మండలం పెదఖండేపల్లికి చెందిన కొసరు అప్పారావు, ఆయన తమ్ముడి కుమార్తె సుహిత(5) తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారి కోమాలోకి వెళ్లింది. వీరిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించారు. ప్రమాదంపై ఎస్‌.కోట ఎస్‌ఐ లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోనాపతి, ఆయన ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కోనాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

*జార్ఖండ్‌లోని డియోఘ‌ర్‌లో రెండు కేబుల్ కార్లు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతిచెందారు. అయితే ఆదివారం ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. సుమారు 16 గంట‌ల పాటు ఆ కేబుల్ కార్ల‌లో సుమారు 48 మంది చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో ప‌ది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. బాబా బైద్య‌నాథ్ ఆల‌యం స‌మీపంలో ఉన్న త్రికూట ప‌ర్వతాల వ‌ద్ద ఉన్న కేబుల్ కార్స్ తెగిపోయిన‌ట్లు భావిస్తున్నారు. మొత్తం 12 కేబుళ్ల‌లో 50 మంది చిక్కుకున్‌తట్లు తెలిసింది. వారిని ర‌క్షించేందుకు రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు.
*తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. రాంబగీచ బస్టాండ్ సమీపంలో కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళ భక్తురాలికి రెండు కాళ్ళు విరిగిపోగా… మరో భక్తుడికి ఎడమ కాలు ఫ్రాక్చర్ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

*తిరువూరు బైపాస్ రోడ్డు వై జంక్షన్ వద్ద మణుగూరు డిపో బస్సు ఢీకొని వాహనదారుడు కి తీవ్ర గాయాలు..చికిత్స నిమిత్తం బాధితుడ్ని అమరావతి ఆసుపత్రికి తరలింపు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..