NRI-NRT

‘టాస్’ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

‘టాస్’ ఆధ్వర్యంలో   ఉగాది సంబరాలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (టాస్) వారు 2022 ఏప్రిల్ 9వ తేదీ శనివారం నాడు ఎడిన్‌బర్గ్‌లో శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇది దాదాపు మూడు సంవత్సరాల తర్వాత జరిగిన అతిపెద్ద టాస్ వేడుక. దీంతో భారీ సంఖ్యలో ప్రవాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు నేపథ్య గాయని ఉష రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉష తన పత్ర్యక్షగానంతో వీక్షకులను ఉర్రూతలూగించారు. టాస్ సాంస్కృతిక కార్యదర్శి నిరంజన్ నూక ఆధ్వర్యంలోఈ కార్యక్రమం జరిగింది. టాస్ పస్ర్తుత, పూర్వ కార్యవర్గసభ్యుల జ్యోతి పజ్ర్వలనతో ఆకర్షణీయంగా ప్రారంభమైంది. మైథిలి కెంబూరి, శివ చింపిరి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్ సెల్వరాజ్(కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఎడిన్‌బర్గ్, యూకే)కి స్వాగతం పలికారు. టాస్ ఉగాది సంబరాలు 2022ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక పద్రర్శనలను వివిధ ఇండో-స్కాటిష్ సంస్థల ప్రతినిధులు చూసి ఆనందించారు. ప్యూర్‌వ్యూవ్, శుభోదయం గ్రూపు సంస్థలు కార్యక్రమానికి పధ్రాన స్పాన్సర్లుగా వ్యవహరించాయి. టాస్ వ్యవస్థాపక సభ్యులు సత్య శ్యా మ్ జయంతి, రమేష్ గోల్కొండ కలిసి కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ 2022-24 పక్రటించారు. చైర్మన్‌గా మైథిలి కెంబూరి, అధ్యక్షుడిగా శివ చింపిరి, పధ్రాన కార్యదర్శిగా ఉదయ్ కుమార్ కూచాడి, జాయింట్ కార్యదర్శిగా వెంకటేష్ గడ్డం, కోశాధికారిగా నిరంజన్ నూక, సాంస్కృతిక కార్యదర్శిగా విజయ్ కుమార్ పర్రి, ప్రాజెక్ట్స్, మహిళా కార్యదర్శిగా మాధవి లత దండూరి, క్రీడా కార్యదర్శిగా జాకీర్ షేక్, ఐటీ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ కార్యదర్శిగా పండరి జైన్ పోలిశెట్టి, యువజన కార్యదర్శిగా నరేష్ దీకొండ, అసోసియేట్ ప్రాజెక్ట్స్ కార్యదర్శిగా బాలాజీ కర్నాటి,అసోసియేట్ క్రీడా కార్యదర్శిగా రాజశేఖర్ సాంబ పాల్గొన్నారు

04122022133533n92
04122022133541n93
04122022133601n29
04122022133608n46